సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు ఎంపీలు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ను శనివారం మధ్యాహ్నం కలవనున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచేందుకు గతంలోనే తమ పదవులకు రాజీనామా చేసిన వీరంతా స్పీకర్ను కలిసి వాటి ఆమోదం కోసం ఆమెను కోరనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డిని మధ్యాహ్నం ఒంటి గంటకు రావాల్సిందిగా స్పీకర్ కార్యాలయం నుంచి ఎంపీలకు ఫోన్ వచ్చింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఐదుగురికి కూడా స్పీకర్ కార్యాలయం నుంచి కబురొచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, అనంత వెంకట్రామిరెడ్డిలతో పాటు.. శుక్రవారమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా స్పీకర్ మీరాకుమార్ను కలవనున్నారు.