
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభం అయ్యాయి. పార్లమెంట్ ఉభయ సభలు ముందుగా జాతీయ గీతాలాపనతో ప్రారంభం అయ్యాయి. అనంతరం లోక్సభ స్పీకర్ మీరాకుమార్....మయన్మార్ పార్లమెంటరీ బృందానికి ఆహ్వానించారు. ఆ తర్వాత చనిపోయిన సభ్యులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం స్పీకర్ మీరాకుమార్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 12 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.