'మీరాకుమార్‌ను కేసీఆర్ అవమానించారు'
హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దయతోనే తెలంగాణ వచ్చిందన్న సీఎం కేసీఆర్ అదే సోనియా గాంధీ నిలబెట్టిన మీరాకుమార్ ఫోన్ చేస్తే కేసీఆర్ ఎందుకు ఫోన్ ఎత్తడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్, మీరాకుమార్ ను అవమానించారని పేర్కొన్నారు. తెలంగాణ రావడంలో మీరాకుమార్ పాత్ర మరువలేనిదన్నారు.
ఏ ఒప్పందంతో బీజేపీ అభ్యర్ధికి సీఎం కేసీఆర్ మద్దతు ఇస్తున్నారో ప్రజలకి చెప్పాలని సూటిగా అడిగారు. సీబీఐ కేసులకా? మరే ఒప్పందం అయినా వుందా? ఎందుకు బీజేపీ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. ప్రజలారా బీజేపీ అభ్యర్థికి ఓటెందుకు వేస్తున్నారో టీఆర్‌ఎస్ నేతలను నిలదీయండని కోరారు.