
మీరాకుమార్‌పై సుష్మా వీడియో దాడి
యూపీఏ ప్రభుత్వం నాడు వివిధ అవినీతి కుంభకోణాలకు పాల్పడిందంటూ సుష్మా స్వరాజ్ 2013లో లోక్‌సభలో కొద్ది సేపు మాట్లాడారు. ఆ సమయంలో ఇక చాలంటూ మీరా కుమార్ ఆమెను నిలువరించే యత్నం చేశారు. 'ప్రతిపక్షనేత పట్ల నాడు స్పీకర్ మీరా కుమార్ వ్యవహరించిన తీరు ఎలా ఉందో చూపించేందుకు ఇది నిదర్శనం' అంటూ సుష్మా ఆదివారం తన ఖాతాలో ఈ వీడియోను పంచుకున్నారు. ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో 2013 ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంటు సమావేశాల నాటిది.