న్యూఢిల్లీ : లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వూహాత్మకంగానే ముందుకెళ్లింది. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సీమాంధ్ర ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తే వారిని అడ్డుకునేందుకు ముందుగానే పథకం రచించింది. హోంమంత్రి సుశీల్ కుమాఱ్ షిండే బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భంగా 25 మందికి పైగా ఎంపీలు రక్షణగా నిలిచారు.
సీమాంధ్ర ఎంపీలను అడ్డుకునేందుకు మిగతా ఎంపీలకు పురమాయించటం జరిగింది. తెలంగాణ అంశంతో సంబంధం లేని ఎంపీలు కూడా పోడియం వద్ద సీమాంధ్ర ఎంపీలను అడ్డుకున్న విషయం తెలిసిందే. సభలో ఘర్షణ వాతావరణం ఉన్నా కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. మరోవైపు సభలో జరిగిన సంఘటనలకు ప్రభుత్వ మొండి వైఖరే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.