న్యూఢిల్లీ : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో శుక్రవారం సీమాంధ్ర ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్లో నిన్న తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం, అనంతర పరిణామాలు, భవిష్యత్ కార్యచరణ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆదివారం సీమాంధ్ర ప్రాంత ఎంపీలతో సమావేశం కానున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.