
ప్రజలను మభ్య పెట్టేందుకే జీవోఎం : అశోక్ బాబు
హైదరాబాద్ : ప్రజలను మభ్యపెట్టేందుకు జీవోఎంను తెరమీదకు తెచ్చారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఆయన మంగళవారమిక్కడ ఏపీ ఎన్జీవో కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులను కలుస్తామన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని వివరిస్తామన్నారు.
పదవుల్లో కొనసాగాలా లేదా అనేది సీమాంధ్ర ఎంపీలే నిర్ణయించుకోవాలని అశోక్ బాబు అన్నారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేస్తే యూపీఏ సర్కారుపై ఒత్తడి పెరుగుతుందని ఆయన తెలిపారు. త్వరలో అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తామన్నారు. హెల్త్ కార్డుల ట్రస్ట్లో ఉద్యోగులకు ఎక్కువ భాగస్వామ్యం ఉండాలని ప్రభుత్వాన్ని కోరినట్లు అశోక్ బాబు తెలిపారు.