సాక్షి, విజయవాడ : ఉద్యోగుల పెన‍్షన్ సాధన కోసం దేశవ్యాప‍్తంగా ఉద‍్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ ఎన్‌జీవోల సంఘం అధ‍్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. సీపీఎస్ విధానం రద్దు కోసం శనివారం విజయవాడలో జరిగిన సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర‍్భంగా అశోక్‌బాబు మాట్లాడుతూ అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పెన‍్షన్ సాధన కోసం పెన‍్షన్ సాధన సమితిని ఏర్పాటు చేశామని, పెన‍్షన్ సాధన కోసం దేశవ‍్యాప‍్తంగా ఉద‍్యమాలు తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు.
ఉద్యోగుల పెన‍్షన్ అంశాన్ని అవసరమైతే రాజకీయ అంశంగా మారుస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్‌ను సాధించుకుంటామని చెప్పారు. ఏపీ సర్కార్ కేంద్రంలో భాగస్వామిగా ఉన‍్నందున ముఖ‍్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని సీపీఎస్ కేంద్రం పరిధా, లేక రాష్ట్రం పరిధిలోనిదా తేల్చాలని విజ‍్ఞప్తి చేశారు. ముఖ‍్యమంత్రిని కలిసి ఈ విషయమై చర్చించనున‍్నట‍్లు ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులకు పెన‍్షన్ ఇవ‍్వడం ప్రభుత‍్వ బాధ‍్యత అని కేంద్ర ప్రభుత‍్వ ఉద్యోగుల ఫేడరేషన్ చైర‍్మన్ నాగేశ‍్వరరావు గుర్తుచేశారు. సీపీఎస్ విధానం రద్దు చేయకపోతే నిరవధిక నిరాహార దీక్షలకు దిగుతామని ఆయన హెచ‍్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment