ఆ ఉద్యోగులంతా ఏపీ ఎన్జీవోలో సభ్యులే.. | AP NGO President Chandra Sekhar Reddy Comments On Village And Ward Secretariat Employees | Sakshi
Sakshi News home page

ఆ ఉద్యోగులంతా ఏపీ ఎన్జీవోలో సభ్యులే..

Published Thu, Dec 24 2020 3:31 PM | Last Updated on Thu, Dec 24 2020 6:31 PM

AP NGO President Chandra Sekhar Reddy Comments On Village And Ward Secretariat Employees - Sakshi

సాక్షి, విజయవాడ : గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ ఇంతకుముందే ఏర్పడిందని, 2020లో రిజిస్ట్రర్‌ అయిన దాని నెంబర్ 138 అని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. ఫెడరేషన్ రిజిస్ట్రర్ కాకముందు ఈ ఉద్యోగులు సంఘంగా ఉండేవారని తెలిపారు. ఈ ఫెడరేషన్ కేవలం గ్రామ, వార్డు, సచివాలయాల ఉద్యోగులదేకాదని, ఏపీ ఎన్జీవోది కూడా అని అన్నారు. ఆ ఫెడరేషన్‌లో ఉన్న ఉద్యోగులంతా ఏపీ ఎన్జీవోలో కూడా సభ్యులేనని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ‘‘ గ్రామ, వార్డు, సచివాలయాల వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదు. ( ఏపీలో కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లేవు)

రాష్ట్ర ప్రజలకు నలుదిశలా సేవలందించడంలో లక్షా 30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కరోనా వైరస్ ప్రారంభ దశలో పాజిటివ్ వ్యక్తులను గుర్తించడంలో ఈ గ్రామ, వార్డు, సచివాలయాల వ్యవస్థ కీలకపాత్ర పోషించింది. స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశంసించారు. ఈ వ్యవస్థను ఇతర రాష్ట్రాలలో అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారునికి అందించడంలో ఈ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వ్యవస్థలో చిన్న చిన్న లోటుపాట్లుంటాయి. వాటిని పరిష్కరించడంలో ఏపీ ఎన్జీవో ముందుంటుంద’’ని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement