chandra sekhar
-
పెద్దిరెడ్డిని చూస్తే చంద్రబాబుకు భయం.. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్
-
కూటమి పాలనలో అప్పుల జాతర.. సంక్షేమానికి పాతర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఐదు నెలల పాలన ‘అప్పుల జాతర–సంక్షేమానికి పాతర‘ అన్నట్లుగా ఉందని వైఎస్సార్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని చెప్పారు. ప్రశ్నించిన వారిని అక్రమంగా నిర్బంధించడం తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదు నెలల్లో రూ.57వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీలను కూడా గాలికొదిలేసిందని చెప్పారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధికి అసలు కేటాయింపులే చేయలేదని వివరించారు. తల్లికి వందనం పథకానికి రూ.12,600 కోట్లు కావాల్సి ఉండగా, బడ్జెట్లో కేవలం రూ.5,380 కోట్లు కేటాయించడం చూస్తే లబ్ధిదారుల్లో సగం మందికి కోత పడే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. ఉచిత సిలిండర్ పథకానికి రూ.850 కోట్లు, రైతులకు పెట్టుబడి సాయం కోసం కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన జూన్ నుంచి అక్టోబర్ వరకు ఐదు నెలల్లో ఆడబిడ్డలపై జరిగిన ఘోరాలకు సంబంధించి 7,393 కేసులు నమోదయ్యాయని, అంటే రోజుకు సగటున 48 ఘటనలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. నేరాలను అదుపు చేయలేని ఈ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని, వెంటనే సీఎం, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
EVM బ్యాటరీ వెరిఫికేషన్ కు అంగీకరించని అధికారులు
-
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మామ సీరియస్ కామెంట్స్
టాలీవుడ్లో మెగా కాంపౌండ్, అల్లు అర్జున్ మధ్య విబేధాల గురించి అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ ఎప్పుడైతే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారో ఆ సమయం నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, బన్నీ మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. కానీ, గత ఎన్నికల్లో తన మిత్రుడు శిల్పా మోహన్ రెడ్డి కోసం బన్నీ నంద్యాలకు వెళ్లడంతో మెగా కాంపౌండ్‌లో పెద్ద దుమారమే రేగింది. దీంతో బన్నీ, పవన్ అభిమానుల మధ్య పెద్ద రచ్చే జరిగింది.ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం బెంగళూరు పర్యటనలో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరోల పాత్రల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అటవీ సంపదను కాపాడేవారని ఇప్పుడు అదే హీరోలు చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ అల్లు అర్జున్ను ఉద్దేశించే పవన్ చేశారని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇప్పటికీ ఆ గొడవ జరుగుతూనే ఉంది. అయితే, తాజాగా అల్లు అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. పవన్ క్లారిటీ ఇవ్వాలి: చంద్రశేఖర్ రెడ్డిపవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. ఈ వివాదంలో పవన్ కాల్యాణే వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. పవన్ ఏ అంశం మీద అలా మాట్లాడారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. 'ఒక సినిమా కోసం మాత్రమే అల్లు అర్జున్ నటించాడనే విషయం పవన్ కల్యాణ్‌కు కూడా తెలుసు కదా.. అలాంటప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది..? ఇప్పటికైన పవన్ జోక్యం చేసుకుని తన వ్యాఖ్యలకు క్లారిటీ ఇవ్వాలి. తాను మాట్లాడింది పుష్ప సినిమా గురించి కాదని చెప్పి ఉంటే బాగుండేది. అప్పుడే ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడుతుంది. అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ వచ్చింది పాలిటిక్స్‌లో కాదు.. సినిమాల్లో అని గుర్తుంచుకోవాలి. బన్నీ చాలా మెచ్యూర్ నటుడు. తను సినిమాల్లో మాత్రమే ఉన్నారని గ్రహించాలి. ఆయన అభిమానులకు, స్నేహితులకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఉంటారు. నమ్మిన వారి కోసమే బన్నీ ఉంటారు.' అని ఆయన వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం
-
టీడీపీ మేనిఫెస్టోని మోదీయే నమ్మడం లేదు..
-
5కే,10కే రన్ చేసేటప్పుడు దయచేసి ఇలాంటి తప్పులు చేయొద్దు
-
1,650 జనాభా ఉన్న గ్రామంలోనే 270 మందికి పింఛన్లా!
సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్: రాష్ట్ర ప్రభుత్వం 1,650 మంది (448 ఇళ్లు) జనాభా ఉన్న గుంటూరు జిల్లా చింతలపూడిలో 252 మందికి నెలనెలా పింఛన్లు ఇస్తోందని అధికారులు తెలపడంతో కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అదనపు కార్యదర్శి చంద్రశేఖర్‌కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ఆయన ప్రశంసించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాల సమీక్షతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆయన మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చారు. తాడేపల్లిలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాల అమలును స్వయంగా పరిశీలించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష సర్వే, స్వమిత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామ కంఠాల పరిధిలోని ఉండే ఇళ్లకు సంబంధించి యాజమాన్య హక్కుపత్రాలు ఇచ్చే ప్రక్రియ పురోగతిని పరిశీలించారు. గ్రామ పంచాయతీకి కేటాయించిన 15వ ఆర్థికసంఘం నిధుల వినియోగంపై ఆరా తీశారు. పంచాయతీ ఆధ్వర్యంలో వివిధ పనులు చేపట్టిన అనంతరం ప్రస్తుతం పంచాయతీ ఖాతాలో ఇంకా రూ.3.89 లక్షలు ఆర్థికసంఘ నిధులు మిగిలి ఉన్నాయని అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీకి కేటాయించిన నిధులను కేవలం సీసీ రోడ్ల నిర్మాణానికే పరిమితం కాకుండా గ్రామంలో సోలార్ విద్యుత్ ఏర్పాటు వంటి వినూత్న కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు పెట్టాలని చంద్రశేఖర్‌కుమార్ సూచించారు. పంచాయతీపై భారం లేకుండా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోందని అధికారులు ఆయనకు వివరించారు. గ్రామంలో డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి తెలిపిందని చెప్పారు. డిజిటల్ ల్రైబరీల ఏర్పాటు ద్వారా గ్రామంలోని పేద విద్యార్థులు, నిరుద్యోగులు సైతం ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర పోటీపరీక్షలకు సమర్థంగా ప్రిపేరయ్యే అవకాశం ఉంటుందని ఆయన మెచ్చుకున్నారు. అనంతరం ఆయన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో పర్యటించి అక్కడ అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ కమిషనర్ సూర్యకుమారి, అదనపు కమిషనర్ సుధాకర్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, గుంటూరు జెడ్పీ సీఈవో మోహనరావు, డీపీవో కేశవరెడ్డి, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రూప్లానాయక్, దుగ్గిరాల తహశీల్దార్ మల్లేశ్వరి, చింతలపూడి సర్పంచ్ రామకృష్ణ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మా కుటుంబానికి కళంకం తెచ్చాడు..
-
టెక్ స్టార్టప్ సంస్థలకు ఇన్నోవేషన్ ఫండ్
న్యూఢిల్లీ: డీప్ టెక్ స్టార్టప్ సంస్థలకు తోడ్పాటు అందించేందుకు కేంద్రం డిజిటల్ ఇండియా ఇన్నోవేషన్ ఫండ్‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహా య మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. దేశ అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు ప్రతి భారతీయుడికి తగు అవకాశాలు కల్పించేలా నవ భరతం ఉండాలన్నది ప్రధాని ఆకాంక్షని ఆయన చెప్పారు. కేరళలోని క్యాథలిక్ బిషప్ హౌస్ క్యాంపస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ఈ విషయాలు తెలిపారు. -
ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అనుమానాస్పద మృతి.. హత్యకేసుగా..
సాక్షి, బెంగళూరు(బనశంకరి): హొన్నాళి ఎమ్మెల్యే రేణుకాచార్య సోదరుడి కుమారుడు చంద్రశేఖర్ (24) అనుమానాస్పద మృతికి సంబంధించి హొన్నాళి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు. తుంగా కాలువలో బయటపడిన కారులో వెనుకసీట్లో చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైంది. అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. దీంతో హొన్నాళి పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. కుందూరులో చంద్రశేఖర్ అంత్యక్రియలు దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా కుందూరు గ్రామంలోని రేణుకాచార్య తల్లిదండ్రులు సమాధుల వద్ద శుక్రవారం చంద్రశేఖర్ అంత్యక్రియలను వీరశైవ లింగాయత్ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. జిల్లా ఆసుపత్రిలో గురువారం అర్థరాత్రి శవపరీక్షలు నిర్వహించారు. ఎఫ్ఎస్ఎల్కు నివేదిక పంపించారు. అంతిమ దర్శనం కోసం తరలివచ్చిన ప్రజలు హొన్నాళి పట్టణంలోని రేణుకాచార్య ఇంట్లో చంద్రశేఖర్ అంతిమ దర్శనం కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మాజీ మంత్రి కేఎస్.ఈశ్వరప్ప, కుమారుడు కేఎస్.కాంతేశ్, పార్టీ నేతలు కార్యకర్తలు అంతిమ దర్శనం చేసుకున్నారు. చదవండి: (తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం.. రోదించిన ఎమ్మెల్యే) స్పీడోమీటర్‌లో 100 కిలోమీటర్ల వేగం నమోదు చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైన ఘటన స్థలాన్ని శుక్రవారం ఏడీజీపీ అలోక్ కుమార్ పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. అక్టోబరు 30 తేదీ రాత్రి 11.58 నిమిషాలకు న్యామతి వద్ద చంద్రశేఖర్ కారు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు రికార్డయింది. అదేరోజు రాత్రి 12.06 నిమిషాలకు చంద్రశేఖర్ మొబైల్ స్విచ్చాఫ్ వచ్చింది. మృతదేహం లభించిన స్థలానికి న్యామతికి 10 కిలోమీటర్లు దూరం ఉంది. కాల్ హిస్టరీ, సీడీఆర్‌తో పాటు అన్నింటిని తనికీ చేసి వీటితో డయాటైమ్ టెస్ట్‌సైతం చేశామని తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తరువాత విషయాలు వెల్లడవుతాయన్నారు. దావణగెరె ఎస్పీ రిష్యంత్ నేతృత్వంలో దర్యాప్తు వేగంగా జరుగుతోందన్నారు. మాజీ సీఎం యడియూరప్ప నివాళి హొన్నాళి ఎమ్మెల్యే రేణుకాచార్య నివాసానికి శుక్రవారం మాజీ సీఎం యడియూరప్ప వచ్చి చంద్రశేఖర్ పార్థివదేహాన్ని దర్శించుకుని నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో యడియూరప్ప మాట్లాడారు. చంద్రశేఖర్‌ను ఎవరో కిడ్నాప్ చేశారని రేణుకాచార్య చెప్పినట్లు నిజమైంది. సీఎం బొమ్మై, హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర చొరవతో దర్యాప్తు వేగంగా సాగుతోందన్నారు. -
తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం.. రోదించిన ఎమ్మెల్యే
సాక్షి, బెంగళూరు(బనశంకరి): దావణగెరె జిల్లా హొన్నాళి నియోజకవర్గ ఎమ్మెల్యే రేణుకాచార్య సోదరుడి కుమారుడు చంద్రశేఖర్ (24) అదృశ్యమైన ఘటన గురువారం విషాదాంతమైంది. చంద్రశేఖర్ కారు తుంగా ప్రధాన కాలువలో లభ్యమైంది. అందులో చంద్రశేఖర్ మృతదేహం బయటకు తీశారు. ఐదురోజులు క్రితం అదృశ్యమైన అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. కడదగట్టి గ్రామం వద్ద కారు ఆనవాళ్లు దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా కడదగట్టి గ్రామం తుంగా కాలువ వద్ద చంద్రశేఖర్ కారు సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాలువ వద్దకు చేరుకున్న పోలీసులు కారుతో పాటు అందులో ఉన్న చంద్రశేఖర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అక్కడే ఘటనస్థలంలో ఉన్న ఎమ్మెల్యే రేణుకాచార్య తీవ్రంగా రోదించారు. సోదరుడి కుమారుడు అదృశ్యమై ఐదు రోజులు గడిచినప్పటికి ఎలాంటి ఆచూకీ లభించలేదు. చంద్రశేఖర్ కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. చంద్రశేఖర్ మొబైల్ స్విచ్చాఫ్ వచ్చింది. చంద్రశేఖర్ మృతి కేసులో ట్విస్ట్.. కారులో ఉన్న ఆ ఇద్దరు ఎవరూ ? ఈ సంఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో ఇద్దరు ఉన్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. న్యామతి వద్ద చంద్రశేఖర్ కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్న దృశ్యాలు రికార్డు అయింది. చంద్రశేఖర్ పక్కన మరొకరు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. అదే కారులో చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైంది. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. హొన్నాళి నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం లభించింది. ఇది హత్య, ఆత్మహత్య అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పరాగ్, విజయపై అయిష్టత ఎందుకు? ట్విటర్ డీల్‌పై భారత్ స్పందన ఏంటి?
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ చేతికి ట్విటర్ వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో తనను బాగా ఇబ్బంది పెట్టారని భావిస్తున్న ట్విటర్ సీఈవో పరాగ్ అగ్రవాల్, లీగల్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దెతో పాటు సీఎఫ్‌వో నెడ్ సెగాల్, జనరల్ కౌన్సిల్ షాన్ ఎడ్జెట్‌లపై తక్షణం వేటు వేసిన సంగతివ తెలిసిందే.. వారిలో ఒకరిని అవమానకరమైన రీతిలో .. ట్విటర్ ఆఫీసు నుండి దాదాపు గెంటివేసినంత పని చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పరాగ్, విజయ అంటే అందుకే అయిష్టం అయితే ఉద్వాసనకు గురైన పరాగ్ అగ్రవాల్ .. గతేడాది నవంబర్లోనే సంస్థ సహ-వ్యవస్థాపకుడు జాక్ డోర్సే స్థానంలో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. బాంబే ఐఐటీలోనూ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోనూ విద్యాభ్యాసం చేసిన అగ్రవాల్ .. దాదాపు దశాబ్దం క్రితం ట్విటర్లో చేరారు. తర్వాత సీఈవోగా ఎదిగారు. ట్విటర్ టేకోవర్ వ్యవహారంలో మస్క్‌తో బహిరంగంగాను, ప్రైవేట్‌గాను అగ్రవాల్ పోరాటం సాగించారని, అందుకే ఆయనపై మస్క్ కత్తిగట్టారని న్యూయార్క్ టైమ్స్ పోస్ట్ పేర్కొంది. అలాగే హైదరాబాదీ అయిన లీగల్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దె (48) విషయానికొస్తే .. అభ్యంతరకర ట్వీట్లు చేస్తున్నారంటూ ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను రద్దు చేయడం ద్వారా ఆమె వార్తల్లోకెక్కారు. ’కంటెంట్‌ను క్రమబద్ధీకరించడంలో ట్విటర్ నిర్ణయాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నారు’ అంటూ విజయపై కూడా మస్క్ విమర్శలు గుప్పించారు. కంపెనీ తన చేతికి వచ్చీ రాగానే ఆమెను తప్పించారు. అయితే, ఉద్వాసనకు గురైన టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు భారీగానే పరిహారం ముట్టనుంది. వారి వాటాలను కొనుగోలు చేసేందుకు, అర్ధాంతరంగా తొలగించినందుకు గాను పరిహారం కింద ఆయా ఉద్యోగులకు మస్క్ దాదాపు 200 మిలియన్ డాలర్లు చెల్లించుకోవాల్సి రానుంది. (Parag Agrawal పరాగ్ అగర్వాల్‌కు ఎన్ని వందల కోట్లు వస్తాయంటే?) కాగా దాదాపు ఆరేడు నెలలకు పైగా నడుస్తున్న మస్క్–ట్విటర్ ప్రహసనానికి ఎట్టకేలకు తెరపడింది. 44 బిలియన్ డాలర్ల డీల్‌ను మస్క్ పూర్తి చేశారు. డీల్ పూర్తయిన వెంటనే తన ప్రణాళికలను కూడా చకచకా అమలు చేయడం ప్రారంభించారు. అయితే కంపెనీని కొంటే 75 శాతం మందిని తీసేస్తానంటూ మస్క్ గతంలో చేసిన ప్రకటనతో ఉద్యోగుల్లో ఇంకా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, అలాంటిదేమీ ఉండబోదంటూ మస్క్ హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు, మస్క్ చేతికి చేరిన నేపథ్యంలో శుక్రవారం నుండి ట్విటర్ షేర్లలో ట్రేడింగ్ నిల్చిపోయింది. నిబంధనలు పాటించాల్సిందే: భారత్ ట్విటర్ ఎవరి చేతిలో ఉన్నా భారత్‌లో కార్యకలాపాలు సాగించాలంటే నిబంధనల ప్రకారం పనిచేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. కంపెనీని మస్క్ టేకోవర్ చేసినంత మాత్రాన దేశంలో నిబంధనలు మారిపోవని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా కంపెనీలకు భారత్ భారీ మార్కెట్‌గా ఉంటోంది. అయితే, ఇటీవలి కొత్త ఐటీ నిబంధనల విషయంలో ట్విటర్‌కి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. టెస్లా కార్ల దిగుమతి సుంకాలు, స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల విషయంలో ప్రభుత్వంతో మస్క్‌కు కూడా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి. -
సరళ వాస్తు గురూజీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి..
హుబ్లీ: రాష్ట్రంతో పాటు ముంబై తదితర ప్రాంతాల్లో సరళ వాస్తు గురూజీగా పేరొందిన చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్య రాష్ట్రంలో కలకలం సృష్టించింది. మంగళవారం హుబ్లీలో ప్రెసిడెంట్ హోటల్లో ఆయనను శిష్యులు మహంతేష్, మంజునాథ్ కత్తులతో పొడిచి చంపడం తెలిసిందే. పోలీసులు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగుచూశాయి. స్థిరాస్తుల విషయంలో నిందితులు, ఎంతో కాలంగా విశ్వాసంగా ఉన్న మహంతేష్ దంపతులతో గురూజీకి ఆస్తుల గురించి వివాదం తలెత్తింది. ఇటీవల మహంతేష్ ఆస్తులను అమ్మగా రూ. 5 కోట్లు వచ్చిందని తెలిసింది. ఆ రూ.5 కోట్ల మొత్తం తిరిగి ఇవ్వాలని మహంతేష్‌ను గురూజీ ఒత్తిడి చేశాడని, ఇదే హత్యకు కారణమైందని పోలీసులు అనుమానిస్తున్నారు. తన శిష్యులను బినామీ ఆస్తులకు వారసులుగా పెట్టడమే స్వామీజీ చేసిన పెద్ద తప్పు అని తెలుస్తోంది. ముఖ్యంగా ముంబైలో సరళవాస్తు కార్యాలయం పూర్తి బాధ్యతలను మహంతేష్ చూసేవాడు. మరో నిందితుడు మంజునాథ్‌ను కూడా పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. హుబ్లీలో ఇద్దరినీ ఒకే చోట ఉంచి తమదైన శైలిలో నిజాలు రాబట్టేందుకు విచారణ చేస్తున్నారు. గురూజీ హత్య తనకెంతో బాధ కలిగించిందని జిల్లా ఇన్చార్జి మంత్రి శంకర్ పాటిల్ మునేనకొప్ప తెలిపారు. చదవండి: (సరళ వాస్తు గురూజీ దారుణ హత్య.. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి) నా భర్తకు శిక్ష పడాలి – నిందితుడు మహంతేష్ భార్య గురూజీని హత్య చేయడం తన భర్త మహంతేష్ చేసిన ఘోరమని నిందితుని భార్య వనజాక్షి తెలిపారు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. భర్త అకృత్యం వల్ల తాను పోలీసు స్టేషన్‌కు రావాల్సి వచ్చిందన్నారు. విచారణ జరిపిన తర్వాత తనను ఇంటికి పంపించారన్నారు. తన పిల్లలతో కలిసి జీవిస్తానని, చేసిన పాపాన్ని భర్త అనుభవించక తప్పదన్నారు. ఇలాంటి దారుణానికి పాల్పడతారని తాను ఊహించలేదు, ఇంత దారుణంగా చంపేంత ద్వేషం ఏముందో తెలియదని ఆమె అన్నారు. అయితే తన పేరున మాత్రం గురూజీ ఎలాంటి ఆస్తులు చేయలేదన్నారు. తన భర్త పేరిట ఆస్తులు చేసిన విషయం కూడా తనకు తెలియదన్నారు. ఇప్పటికీ తాను కొన్న ఫ్లాట్‌కు వాయిదాల ద్వారా డబ్బులు చెల్లిస్తున్నానన్నారు. తామిద్దరూ పని చేస్తున్న సందర్భంలోనే గురూజీ విశాల హృదయంలో తమ పెళ్లి చేశారన్నారు. తన స్వంత పిల్లల్లా తమని చూశారని తెలిపారు. -
సరళ వాస్తు గురూజీ దారుణ హత్య.. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి
హుబ్లీ (కర్ణాటక): సరళవాస్తు ద్వారా రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో ఖ్యాతి పొందిన చంద్రశేఖర్ గురూజీ మంగళవారం పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. హుబ్లీ ప్రెసిడెంట్ హోటల్లో ఈ దారుణం జరిగింది. ఆయన శిష్యులే ఈ ఘాతుకానికి పాల్పడడంతో గురువుకే వాస్తు దోషం కలిగిందా? అన్న ప్రశ్న తలెత్తింది. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి చంద్రశేఖర్ దగ్గర పని చేస్తున్న మహంతేష్ శిరూర్, మంజునాథలను నిందితులుగా గుర్తించారు. వీరిలో గురూజీకి ఒకరు కాళ్లకు మొక్కుతున్నట్లుగా నటించగా, మరొకరు చాకుతో పొడిచాడు. కిందకు పడినా కూడా వదలకుండా సుమారు 40 సార్లకు పైగా కత్తితో పొడిచి హోటల్ నుంచి తప్పించుకున్నారు. పోలీసులు వెంటాడి బెళగావి జిల్లా రామదుర్గ వద్ద ఈ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. హత్య జరిగిన 4 గంటల్లోనే నిందితులు పట్టుబడ్డారు. హుబ్లీ పోలీస్ కమిషనర్ లాభురాం మాట్లాడుతూ గురూజీ ప్రెసిడెంట్ హోటల్లో బస చేశారు. ఇద్దరు వ్యక్తులు వచ్చారని తెలిసి వారిని కలవడానికి లాబీలోకి వచ్చారు. ఈ సమయంలో కత్తితో దాడి చేసి పరారయ్యారు అని చెప్పారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. హత్య దృశ్యాలు హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితులు మంజునాథ, మహంతేష్ ఆస్తి వివాదమే కారణమా? హత్యకు ఆస్తి వివాదమే కారణమని చెబుతున్నారు. చంద్రశేఖర్ గురూజీ శిష్యుల పేరిట బినామీ ఆస్తులు పెట్టారని, నిందితుడు మహంతేష్ పేరున కోట్లాది రూపాయల ఆస్తి చేశారని చెబుతున్నారు. ఉద్యోగం నుంచి తొలగించాక తన ఆస్తిని తిరిగి ఇచ్చేయాలని గురూజీ ఒత్తిడి చేసేవాడు. అయితే తిరిగి ఇవ్వడం కుదరదని మహంతేష్ తెగేసి చెప్పాడు. ఇదే విషయమై మాట్లాడడానికి హోటల్‌కు వచ్చి ఆయన్ను హత్య చేశారు. కాగా చంద్రశేఖర్ గురూజీ అంత్యక్రియలు సుళ్య గ్రామంలో బుధవారం నెరవేరనున్నాయి. అత్యంత ప్రజాదరణ సొంతం సరళ్ వాస్తు సూత్రాలతో గురూజీ ప్రసిద్ధి చెందారు. అనేక టీవీ చానెళ్లలో నిత్యం కనిపిస్తూ ఉండేవారు. సరళమైన జీవనం గురించి ఉపన్యాసాలిస్తుంటారు. యూట్యూబ్‌లో ఆయన వీడియోలకు లక్షలాది వ్యూస్ రావడం బట్టి ఆయన ప్రజాదరణ ఏమిటో అర్థమవుతుంది. గురూజీ వయసు గురించి ఎప్పుడూ చెప్పేవారు కాదు. సుమారు 55 ఏళ్లకు పైగా వయసు ఉంటుందని అంచనా. ఆయన స్వస్థలం బాగల్‌కోట జిల్లా. తల్లి పేరు నీలమ్మ అంగడి. భార్య, కుటుంబ విషయాలు గుట్టుగా ఉంచారు. చదవండి: (టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ కన్నుమూత) -
పచ్చ పన్నాగం: భర్త మోసం చేస్తే.. మధ్యవర్తితం పేరుతో టీడీపీ నేత..
సాక్షి, ఏలూరు: ఆమెది ఈ దేశం కాదు. అయితే కట్టుకున్న వాడికోసం దేశం కాని దేశం నుంచి వచ్చి కలహాల కాపురంలో కష్టాలు ఈదుతోంది. మధ్యవర్తిత్వం నెపంతో వచ్చిన ఓ పచ్చ కామాంధుడి చేతిలో నలిగిపోతోంది. వివరాల్లోకెళ్తే.. శ్రీలంకకు చెందిన విజయలక్ష్మి, ఏలూరు జిల్లా వీరవాసరం మండల పడమటి పాలెంకు చెందిన పితాని వెంకట సత్యనారయణను 2011లో కువైట్‌లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత వారు కొన్ని రోజులు హైదరాబాద్‌లో ఉన్నారు. అనంతరం పడమటిపాలెం వచ్చి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉన్నారు. అయితే భర్త ఆమెకు తెలియకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా సత్యనారాయణ కుటుంబ సభ్యులు కొంత బంగారంతో పాటు, ఐదు లక్షల నగదు తీసుకుని తనపై దాడి చేశారని విజయలక్ష్మి వాపోతోంది. అయితే మాజీ ఎంపీపీ, టీడీపీ నేత వీరవల్లి చంద్రశేఖర్ 2021లో అత్త ఇంటివారి నుంచి రెండున్నర లక్షలు ఇచ్చే విధంగా సెటిల్మెంట్ చేశాడని బాధితురాలు తెలిపింది. కానీ మధ్యవర్తిత్వం చేసి రూ.25వేలు ఇప్పించాడు. మిగిలిన సొమ్ము ఇప్పించమని అడగగా ఇంటికి పిలిచి తనను లోబరుచుకోవడానికి యత్నించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. టీడీపీ నేత చంద్రశేఖర్ లైంగిక వేధించి, బెదిరించాడని శ్రీలంకకు చెందిన విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ('డబ్బే ముఖ్యమని హింసించారు.. నన్ను అర్థం చేసుకోలేదు') -
తెలంగాణలో బొగ్గు కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం 5 రోజుల కు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం లేదని సింగరేణి బొగ్గు గనుల సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, ఎన్.బలరామ్ స్పష్టంచేశారు. సింగరేణితో ఒప్పందం చేసుకున్న అన్ని రాష్ట్రాల థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాల మేరకు బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం ఇక్కడి సింగరేణి భవన్లో అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపకుండా తీసుకోవాల్సిన చర్యలు, వర్షాలు తగ్గుముఖం పట్టినందున నిర్దేశిత లక్ష్యం మేరకు ఉత్పత్తి సాధించే విషయంలో దిశానిర్దేశం చేశారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచడంలో ఏరియాలకు ఎదురవుతున్న ఇబ్బందులు, అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై డెరైక్టర్లు అన్ని ఏరియాల జీఎంలకు మార్గనిర్దేశం చేశారు. ఒప్పందం ఉన్న ప్లాంట్లకు సరఫరా.. సింగరేణితో ఒప్పందం చేసుకున్న తెలంగాణ జెన్కో థర్మల్ ప్లాంట్లతో పాటు ముద్దనూరు(ఏపీ జెన్కో), పర్లీ(మహారాష్ట్ర జెన్కో) రాయచూర్ కేపీసీఎల్ (కర్ణాటక), మెట్టూర్ టాన్ జెడ్కో (తమిళనాడు), రామగుండం ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. సింగరేణి రోజూ ఉత్పత్తి చేసే బొగ్గు లో 1.5 లక్షల టన్నులను (86 శాతం) థర్మల్ కేంద్రాలకే సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. -
తెలంగాణ వస్తే కేసీఆర్ నన్ను సీఎం చేస్తానన్నారు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత ఎ.చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే తనను సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను సీఎం అయింది ఎంత నిజమో.. దళితబంధు కూడా అంతే నిజం.. కేసీఆర్ హామీకి మాజీ స్పీకర్ మధుసూదనాచారే సాక్ష్యం’’ అని అన్నారు. -
ఆ ఉద్యోగులంతా ఏపీ ఎన్జీవోలో సభ్యులే..
సాక్షి, విజయవాడ : గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ ఇంతకుముందే ఏర్పడిందని, 2020లో రిజిస్ట్రర్ అయిన దాని నెంబర్ 138 అని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. ఫెడరేషన్ రిజిస్ట్రర్ కాకముందు ఈ ఉద్యోగులు సంఘంగా ఉండేవారని తెలిపారు. ఈ ఫెడరేషన్ కేవలం గ్రామ, వార్డు, సచివాలయాల ఉద్యోగులదేకాదని, ఏపీ ఎన్జీవోది కూడా అని అన్నారు. ఆ ఫెడరేషన్లో ఉన్న ఉద్యోగులంతా ఏపీ ఎన్జీవోలో కూడా సభ్యులేనని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గ్రామ, వార్డు, సచివాలయాల వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదు. ( ఏపీలో కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లేవు) రాష్ట్ర ప్రజలకు నలుదిశలా సేవలందించడంలో లక్షా 30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కరోనా వైరస్ ప్రారంభ దశలో పాజిటివ్ వ్యక్తులను గుర్తించడంలో ఈ గ్రామ, వార్డు, సచివాలయాల వ్యవస్థ కీలకపాత్ర పోషించింది. స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రశంసించారు. ఈ వ్యవస్థను ఇతర రాష్ట్రాలలో అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారునికి అందించడంలో ఈ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వ్యవస్థలో చిన్న చిన్న లోటుపాట్లుంటాయి. వాటిని పరిష్కరించడంలో ఏపీ ఎన్జీవో ముందుంటుంద’’ని అన్నారు. -
టీఆర్ఎస్ అభ్యర్థిగా చంద్రశేఖర్‌గౌడ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పో టీ చేస్తున్న గ్రూప్–1 మాజీ అధికారి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు టీఆర్ఎస్ అధికారికంగా మద్దతు ప్రకటించింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో పార్టీ తరపున అధికారికంగా అభ్యర్థిని నిలబెట్టమని ప్రకటించిన టీఆర్ఎస్ అధిష్టానం.. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను బేరీజు వేసుకుని వ్యూహాత్మకంగా చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతుగా నిలిచింది. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎం. సంజయ్ కుమార్ (జగిత్యాల), సుంకె రవిశంకర్ (చొప్పదండి), ఎమ్మెల్సీ ఎన్.లక్ష్మణ్‌రావు రంగప్రవేశం చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు, సానుభూతిపరుల దాఖలు చేసిన నామి నేషన్లను ఉపసంహరింపజేశారు. పార్టీ ఆదేశాల మేరకే చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతుగా నిలిచినట్లు వారు చెప్పారు. ఈ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి బరిలో నిలిచారు. ఆయన ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకునేందుకు చంద్రశేఖర్ గౌడ్‌కు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
హైదరాబాద్‌లో నాస్కామ్ ఏఐ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్వేర్ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్... హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు మొదలుపెట్టామని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలియజేశారు. ఫిబ్రవరిలో జరగనున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికే నాస్కామ్ ఏఐ సెంటర్ ఒకటి బెంగళూరులో ఉందని.. దేశంలో మరో రెండు మూడు ఏఐ కేంద్రాల అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని.. వీటిల్లో ఏఐతో పాటూ డేటా అనలిటిక్స్, మిషన్ లెర్నింగ్, త్రీడి ప్రింటింగ్ వంటి 8 విభాగాలను గుర్తించామని, వీటిలో నైపుణ్యమున్న ఉద్యోగుల అవసరముందని వివరించారు. ఈ ఏఐ సెంటర్ల ద్వారా ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీల్లో శిక్షణ, నైపుణ్యాలు అభివృద్ధి చేయటం వంటివి ఉంటాయని తెలిపారు. వీటితో పాటు ఈ ఏఐ సెంటర్ స్థానిక స్టార్టప్ సంస్థలు, మెంటార్లు, విద్యావేత్తలు, వెంచర్ క్యాపిటలిస్ట్‌లతో అనుసంధానమై ఉంటుందని.. స్థానిక సమస్యలకు టెక్నాలజీతో పరిష్కార మార్గాలను అన్వేషిస్తుందని వివరించారు. -
హెచ్–1బీ వీసా షరతులు ఆందోళనకరం
న్యూఢిల్లీ: అమెరికన్ల ఉద్యోగాలను కాపాడే పేరిట.. ప్రతిపాదిత హెచ్–1బీ వీసా బిల్లులో అమెరికా అసాధ్యమైన షరతులను పొందుపర్చిందని దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. ఇటు భారతీయ ఐటీ కంపెనీలతో పాటు అటు హెచ్–1బీ వీసాలు ఉపయోగించే క్లయింట్లకు కూడా కఠినతరమైన నిబంధనలు ఇందులో ఉన్నాయని ఆయన చెప్పారు. దీనిపై తమ ఆందోళనను అమెరికా సెనేటర్లు, అధికారులకు తెలియజేశామని, ప్రతిపాదిత చట్టంపై రాబోయే రోజుల్లో మరిన్ని చర్చలు జరపనున్నామని చంద్రశేఖర్ వివరించారు. ‘అమెరికన్ ఉద్యోగాలను కాపాడే పేరుతో.. ఈ నిబంధనలను వీసాలపై ఎక్కువగా ఆధారపడే కంపెనీలకు.. అంటే భారతీయ కంపెనీలకు మాత్రమే వర్తింపచేసేలా ఉండటం మరింత ఆందోళన కలిగించే విషయం’ అని ఆయన పేర్కొన్నారు. సదరు నిబంధనల ప్రకారం హెచ్–1బీ వీసాలపై నియమించుకున్న వారికి అధిక వేతనాలు ఇవ్వడంతో పాటు వారి రాక వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగి ఉద్యోగానికి అయిదారేళ్లపాటు ఎలాంటి ఢోకా ఉండబోదంటూ క్లయింటు ధృవీకరించాల్సి ఉంటుంది.ఈ బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించాల్సి ఉంది. -
కూకట్‌పల్లిలో డ్రగ్స్ కలకలం!
-
ఏఐపై నాస్కామ్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్
ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్సెస్ వంటి కొంగొత్త టెక్నాలజీలపై మరింతగా అవగాహన పెంపొందించే దిశగా దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ పలు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు (సీవోఈ) ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్, బెంగళూరులో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. ఇవి అంతర్జాతీయంగా ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని స్టార్టప్స్‌ని ప్రోత్సాహం అందించడం తదితర కార్యకలాపాలు సాగిస్తాయని వివరించారు. అయితే, ఇందుకోసం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నదీ, ఎప్పట్లోగా ఏర్పాటు చేయనున్నది మాత్రం చంద్రశేఖర్ వెల్లడించలేదు. కొత్త సాంకేతికాంశాలపై నియంత్రణలపై స్పందిస్తూ.. నియంత్రణ ముఖ్యమే అయినప్పటికీ మారే టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు విధి విధానాలు తగు రీతిలో సవరించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తదితరులు టెక్నాలజీపై నియంత్రణలకు మద్దతునిస్తుండగా టెక్ దిగ్గజం ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ మొదలైన వారు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. -
‘ఈ దేశానికి మేమే శాసకులం’
‘మేరే సాత్ కహో–హమ్ ఇస్ దేశ్కా శాసక్ హై (నాతో గొంతు కలిపి చెప్పండి. మనం ఈ దేశానికి పాలకులం) అంటూ ‘భీమ్ ఆర్మీ’ నాయకుడు, 30 ఏళ్ల యువకుడు చంద్రశేఖర్ ఇటీవల జంతర్ మంతర్ వద్ద పిలుపునివ్వగానే వేలాది మంది యువకులు ‘హమ్ ఇస్ దేశ్కా శాసక్ హై’ అంటూ నినదించారు. ప్రస్తుతం ఉవ్వెత్తున లేచిన భీమ్ ఆర్మీ ఉద్యమాన్ని ఎలా ఆపాలి లేదా ఎలా తమ సానుకూలంగా మలుచుకోవాలనే అంశంపై ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతలు అంతర్గత చర్చలు జరపడమే అందుకు సాక్ష్యం. భీమ్ ఆర్మీని ఇప్పటికే బీజేపీ తొత్తు సంస్థగా ఆరోపణలు చేసి నాలుక కరుచుకున్న బీఎస్పీ నాయకురాలు మాయావతి వారిని ఎలా తన వైపు తిప్పుకోవాలనే అంశంపై ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం యూపీకే పరిమితమైన భీమ్ ఆర్మీ ఢిల్లీలో లక్షలాది మంది యువకులతో భారీ సమావేశాన్ని నిర్వహించడం ద్వారా తాము ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తామన్న సంకేతాలను ఇచ్చింది. లా డిగ్రీ చదివిన చంద్రశేఖర్ రెండేళ్ల క్రితం, అంటే 2015లో ‘ది గ్రేట్ చామర్స్ ఆఫ్ దడ్కౌలి వెల్కమ్స్ యు’ అన్న బోర్డును ఇంటిముందు వేలాడదీయడం ద్వారా అందరినీ ఆకర్షించారు. ఆయనది సహరాన్పూర్ పరిధిలోని దడ్కౌలి గ్రామమే. ఆయన ఇంటికి దళిత యువకులు ఎక్కువగా రావడం మొదలైంది. దాంతో ఆయన ‘భీమ్ ఆర్మీ’ని ఏర్పాటు చేశారు. దళితులు అభివృద్ధి చెందాలంటే ముందుగా చదువులో రాణించాలని ఆశించిన చంద్రశేఖర్ దళితులకు ఉచితంగా చదువు చెప్పే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో అలాంటివి దాదాపు 300 కేంద్రాలు నడుస్తున్నాయి. ఇంతకాలం చదువు మీదనే దృష్టిని కేంద్రీకరించిన ఈ ఆర్మీ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రయ్యాక రాజకీయ, సామాజిక అంశాలపై తమ దృష్టిని కేంద్రీకరించింది. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో మే 9వ తేదీన ఠాకూర్లకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ర్యాలీ ద్వారా భీమ్ ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ కాస్త ఒక్కసారిగా పెద్ద నాయకుడై చంద్రశేఖర్ ఆజాద్‌గా అభిమానులు పిలుచుకునే స్థాయికి ఎదిగిపోయారు. చంద్రశేఖర్ మాత్రం తనకు తాను రావన్ అని చెప్పుకుంటారు. మే 6న దళితులకు చెందిన 25 గుడిసెలను ఠాకూర్లు దహనం చేయడాన్ని నిరసిస్తూ 9వ తేదీన భీమ్ ఆర్మీ ర్యాలీని నిర్వహించింది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కూడా ఠాకూర్ కులానికి చెందినవారు కావడంతో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ర్యాలీని అణచివేతలో ఓ దళిత యువకుడు మరణించారు. మే ఐదో తేదీన ఓ ఠాకూర్ యువకుడిని దళితులు కొట్టి చంపడం వల్లనే తాము వారి గుడిసెలను తగులబెట్టామని ఠాకూర్లు అంటున్నారు. ఠాకూర్లపై ఒక్క కేసు కూడా నమోదు చేయని స్థానిక పోలీసులు చంద్రశేఖర్‌పై మాత్రం 24 ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. అల్లర్లను అరికట్టడంలో విఫలమయ్యారంటూ జిల్లా కలెక్టర్‌ను, జిల్లా పోలీసు అధికారిని ముఖ్యమంత్రి యోగి విధుల నుంచి సస్పెండ్ చేశారు. జిల్లా బీజేపీ నాయకులను, క్రియాశీలక కార్యకర్తలను కొంతకాలం సహరాన్‌పూర్‌కు దూరంగా ఉండాలంటూ కూడా యోగి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ దశలో చంద్రశేఖర్‌ను అణచివేసేందుకు ప్రయత్నిస్తే అనవసరంగా అతను పెద్ద నాయకుడవతారన్నది ఆయన ఆందోళనట. భీమ్ ఆర్మీ తమ ఉనికిని కూడా దెబ్బతీసే ప్రమాదం ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ కులాల విభాగం చైర్మన్ కొప్పుల రాజు వ్యాఖ్యానించారు. ఇంతకాలం దళితులను ఓటు బ్యాంకుగా పరిగణిస్తూ వచ్చిన జాతీయ పార్టీలకు భీమ్ ఆర్మీ ఓ మేలుకొలుపని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి వ్యాఖ్యానించారు. తీవ్ర అణచివేతకు గురైనప్పుడు, పార్టీలు వారి ప్రయోజనాలను పట్టించుకోనప్పుడు భీమ్ ఆర్మీ లాంటి ఉద్యమాలు పుట్టుకొస్తాయని సీపీఐ సీనియర్ నాయకుడు డి. రాజా వ్యాఖ్యానించారు. భీమ్ ఆర్మీ వల్ల బీజేపీకి కూడా భారీ నష్టమేనేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ పార్టీ నాయకుడు వ్యాఖ్యానించారు. గోరక్షకుల దాడుల వల్ల ఇప్పటికే దళితులు పార్టీకి దూరమవుతున్నారన్నారు. అయినా భీమ్ ఆర్మీ లాంటి ఉద్యమాలు ఏదో ఒక పార్టీని ఆశ్రయిస్తే తప్ప ఎక్కువకాలం మనుగడ సాగించలేవన్నారు. రానున్న గుజరాత్, కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టకొని ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వెళ్లిన చోటల్లా దళితుల గురించే మాట్లాడుతున్నారు. భీమ్ ఆర్మీలోకి మైనారిటీలైన ముస్లిం యువకులను ఆహ్వానించడం రాజకీయ పార్టీలకు కొరుకుడు పడని మరో అంశం. ఇప్పటికే భీమ్ ఆర్మీలో ఏడు శాతం ముస్లిం యువకులు ఉన్నారు. ప్రస్తుతం 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులనే భీమ్ ఆర్మీలోకి తీసుకుంటున్నారు. -
నయీమ్ కంపెనీలో ఖాకీలు!
గ్యాంగ్‌స్టర్‌తో పోలీసు అధికారులు కలసి ఉన్న ఫొటోలు బహిర్గతం - దొరికిపోయిన ఐదుగురు అధికారులు.. పోలీసు శాఖలో కలవరం - వారిని తప్పించే ప్రయత్నం చేసిన ఓ మీడియా అధిపతి, పక్క రాష్ట్ర పెద్దలు - ఇంతకుముందే ఆధారాల్లేవంటూ కేసును మూసేసే ప్రయత్నం - చర్యలపై తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాల్లేవన్న ఓ సీనియర్ ఐపీఎస్ ఈ ఫొటోలో ఉన్నది అదనపు ఎస్పీ చంద్రశేఖర్. 1989 బ్యాచ్ ఎస్సైగా ఎంపికైన ఆయన... ప్రస్తుతం కీలకమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్లో ఇన్చార్జి ఎస్పీగా ఉన్నారు. గతంలో మావోయిస్టు వ్యవహారాలను పర్యవేక్షించే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో చాలా కాలం పనిచేశారు. ఆ సమయంలోనే నయీమ్‌తో సంబంధాలు ఏర్పరచుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి నయీమ్ ఎన్కౌంటర్ వరకు కూడా సన్నిహిత సంబంధాలు నెరిపారని.. నయీమ్‌తో కలసి సెటిల్మెంట్లు చేశారని ఆరోపణలున్నట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి. చంద్రశేఖర్‌కు ఎడమవైపు కూర్చున్న అధికారి సైదులు. ప్రస్తుతం ఆయన సీఐ హోదాలో ఉన్నారు. నయీమ్ ఇచ్చిన దావత్‌కు చంద్రశేఖర్‌తో కలసి వెళ్లినట్టు తెలిసింది. ఇటీవలి వరకు నిజామాబాద్‌లో సీఐగా పనిచేసిన సైదులు.. ఇటీవలే సీఐడీకి బదిలీ అయ్యారు. ఎస్సైగా పనిచేసిన సమయంలో నయీమ్‌తో సంబంధాలు ఏర్పర్చుకున్నట్లు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సన్నిహిత సంబంధాలున్న పలువురు పోలీసుల బండారం బయటపడింది. నయీమ్‌తో ఏకంగా నాన్ కేడర్ అదనపు ఎస్పీ స్థాయి పోలీసు అధికారులు కూడా కలసి ఉన్న ఫొటోలు బయటపడడం సంచలనం రేపుతోంది. దాదాపు పదిహేనేళ్ల పాటు పోలీస్ శాఖలో పెత్తనం చెలాయించిన నయీమ్, అతడికి సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారుల ఫొటోలు గురువారం సోషల్ మీడియాలో వెల్లువెత్తడం పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వ వర్గాలను అతలాకుతలం చేసింది. ఇంతకీ ఆ అధికారులెవరు? నయీమ్‌తో ఎక్కడ ఫోటోలు దిగారు? నయీమ్‌తో వారి సాన్నిహిత్యం ఏమిటి, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేదా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేసు విచారణ పరిస్థితేమిటి? నయీమ్ ఎన్కౌంటర్ జరిగి ఆరు నెలలు గడిచింది. పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, రాజకీయ నేతలకు నయీమ్‌తో సంబంధాలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై సీపీఐ నేత నారాయణ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే ఆ పిటిషన్ విచారణ సందర్భంగా.. ఇప్పటివరకు నయీమ్‌తో పోలీసులెవరికీ సంబంధాలున్నట్లు ఆధారాలు లభించలేదంటూ హోంశాఖ హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇక నయీమ్ కేసులో విచారణ చాలించాలని, నయీమ్‌కు సహకారం అందించిన చిన్నా చితకా కానిస్టేబుళ్లు, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసు శాఖకు సూచించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు సిట్ చార్జిషీట్లు వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో నయీమ్‌తో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కలసి ఉన్న ఫొటోలు బయటకు రావడం చర్చనీయాంశమైంది. అసలు ఈ కేసు మూసివేతకు ప్రయత్నిస్తున్న సందర్భంలో కీలక ఆధారాలు బయటకు రావడం పోలీసు అధికారులను ఊపిరిపీల్చుకోకుండా చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫొటోలో నయీమ్ తో ఉన్న వ్యక్తి సీఐ వెంకట్ రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్ లోని మలక్‌పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. తను నయీమ్ డిగ్రీ క్లాస్మేట్ అని సిట్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఆ సాన్నిహిత్యంతోనే నయీమ్‌ను కలవాల్సి వచ్చిందని, అంతకు మించి తనకు ఎలాంటి సంబంధాలూ లేవని చెప్పినట్లు తెలిసింది. అసలు గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీమ్‌ను ఎందుకు కలవాల్సి వచ్చింది, ఎంత క్లాస్మేట్ అయినా పోలీసు అధికారిగా ఉన్నప్పుడు మర్యాద పూర్వక భేటీలు ఎందుకన్న దానికి మాత్రం సమాధానమివ్వలేదని సిట్ వర్గాలు పేర్కొన్నాయి. మిగతా వాళ్ల సంగతేంటి? తాము మాత్రమే నయీమ్‌తో అంటకాగలేదని.. మరో నలుగురు కూడా నయీమ్‌తో కలసి భారీ స్థాయిలో సెటిల్మెంట్లు చేసి, కోట్లు దండుకున్నారని ఫోటోల్లో ఉన్న ఓ అధికారి స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న మరో అధికారి, హైదరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ముగ్గురు డీఎస్పీలు నయీమ్‌తో అంటకాగారని ఆయన ఆరోపించారు. తమకు త్వరలో పదోన్నతి ఉందని తెలిసి, అడ్డుకునేందుకే ఈ ఫోటోలను బయటకు లీక్ చేశారన్నారు. తమను సిట్ విచారిస్తే కీలకమైన అధికారుల పేర్లు బయట పెడతామని, వారి సంగతి కూడా తేల్చాల్సిందేనని వ్యాఖ్యానించారు. తాము విచారణ ఎదుర్కొంటామన్నారు. ఓ మీడియా ఎండీ లాబీయింగ్? నయీమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు తమపై చర్యలు తీసుకోకుండా భారీగా లాబీయింగ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఓ మీడియా ఎండీ నేరుగా కల్పించుకున్నారని, తమ సంబంధీకులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చారని విచారణ ఎదుర్కొంటున్న ఓ డీఎస్పీ వెల్లడించినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు ఆధారాలు బయటపడడంతో.. పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పెద్దల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా పేర్కొన్నట్లు సమాచారం. ఇక నయీమ్ ఇంట్లో దొరికిన ఆధారాల్లో చాలా వరకు చింపేసి, దొరక్కుండా చేశారని.. ప్రస్తుతం ఫోటోల్లో ఉన్న ఓ అదనపు ఎస్పీ ఏకంగా తన టీమ్‌తోనే అల్కాపురికాలనీ ఇంట్లో సోదాలు చేయించి ఆధారాలను తగలబెట్టారని ఆ డీఎస్పీ వెల్లడించినట్లు తెలిసింది. సస్పెన్షన్‌పై మాకెలాంటి ఆదేశాల్లేవు: సీనియర్ ఐపీఎస్ నయీమ్ కేసుకు సంబంధించి తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ లేవని సీనియర్ ఐపీఎస్ ఒకరు వెల్లడించారు. నయీమ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని, దానిపై ఇంకా నిర్ణయం వెలువడలేదని పేర్కొన్నారు. నయీమ్‌తో పోలీసు అధికారులున్న ఫొటోలు బయటపడిన నేపథ్యంలో దీనిపై విచారణ జరుపుతారా, లేదా అన్నది సిట్ పరిధిలోని అంశమని తెలిపారు. నయీమ్ ‘సన్నిహితుల’పై సిట్ దృష్టి నయీమ్ కేసులను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక అంశాలపై దృష్టి పెట్టింది. గ్యాంగ్‌స్టర్‌తో సన్నిహితంగా మెలిగిన పోలీసు అధికారుల్లో... పోలీసు శాఖ కోసం పనిచేసిందెవరు? వ్యక్తిగత ప్రయోజనాల కోసం దోస్తీ చేసిందెవరనేది తేల్చేపనిలో పడింది. ఎన్కౌంటర్ తర్వాత నయీమ్ డెన్లలో లభించిన డైరీలు, ఫొటోలను.. అరెస్టు చేసిన, విచారించిన వారి వాంగ్మూలాలతో సరిచూస్తోంది. ఇప్పటికే ముగ్గురు పోలీసు అధికారులపై స్పష్టమైన ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. నయీమ్ నేరాలతో సంబంధమున్న, అతడితో అంటకాగిన అధికారులపై వచ్చే వారంలో చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నయీమ్‌తో ఉన్న పోలీసు అధికారి మద్దిపాటి శ్రీనివాసరావు. 1989 బ్యాచ్ ఎస్సై అయిన ఈయన ప్రస్తుతం సీఐడీలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. భువనగిరి సబ్ డివిజన్లో ఎస్సై నుంచి ఇన్స్పెక్టర్ వరకు పనిచేశారు. ఎస్ఐబీలోనూ కొద్ది రోజులు విధులు నిర్వర్తించారు. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ ఏసీపీగా, మాదాపూర్ అదనపు డీసీపీగా కూడా పనిచేశారు. ఈ ఫొటోలో నయీమ్ పక్కన నిల్చున్న పోలీసు అధికారి పేరు తిరుపత న్న. ఆయన కూడా 1989 బ్యాచ్‌కు చెందిన ఎస్సై. ప్రస్తుతం సంగారెడ్డి టౌన్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన భువనగిరి సబ్ డివిజన్లో ఎస్సైగా, సీఐగా పనిచేశారు. భువనగిరిలో సీఐగా పనిచేస్తున్న సమయంలో నయీమ్‌తో కలసి వినాయక విగ్రహానికి పూజలు చేసినట్టు సిట్ అధికార వర్గాల ద్వారా తెలిసింది. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
లేపాక్షి : చిలమత్తూరు మండలం దేమకేతేపల్లికి చెందిన బేల్దారి చంద్రశేఖర్ (48) ఆదివారం స్వగ్రామం నుంచి లేపాక్షి వైపు ద్విచక్రవాహనంలో వెళుతున్నాడు. లేపాక్షి నంది విగ్రహం వెనుక వైపునకు వచ్చే సరికి ఎదురుగా హిందూపురం నుంచి గోరంట్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 28 జెడ్ 5224) వస్తోంది. అదే సమయంలో మరో ద్విచక్రవాహనదారుడు అతివేగంతో వెళ్తున్నాడు. అతడిని తప్పించడానికి ఆర్టీసీ డ్రైవర్ ప్రయత్నిస్తుండగానే చంద్రశేఖర్ ద్విచక్రవాహనం బస్సుకు తగిలి వెనుకచక్రం కింద పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్ద మృతితో ఇక తమకు దిక్కు ఎవరని కుటుంబ సభ్యులు విలపించారు. లేపాక్షి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను హిందూపురం ఆర్టీసీ డిపో మేనేజర్ గోపినాథ్, స్థానిక కంట్రోలర్ ఆర్ఎస్కే బాషా ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రమాద వివరాల గురించి ఎస్ఐ శ్రీధర్‌ను అడిగి తెలుసుకున్నారు. -
పోస్టాఫీసుల్లో నగదు మార్పిడి ఉండదు
అనంతపురం రూరల్ : కేంద్రం పెద్దనోట్ల రద్దు చేసిన నేపథ్యంలో పోస్టాఫీసుల్లో పాతనోట్లను తీసుకుని కొత్త నోట్లు ఇచ్చేవారు. ఈప్రక్రియ నిలిపివేసినట్లు తపాలా శాఖ ఎస్పీ చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి పోస్టాఫీసుల్లో ఖాతాలు కలిగిన వారు మాత్రం పెద్దనోట్లను తమ సేవింగ్ ఖాతాల్లో జమ చేసుకోవచ్చన్నారు. -
బాధ్యతలు చేపట్టిన తపాలా ఎస్పీ
అనంతపురం రూరల్: అనంతపురం డివిజన్ తపాలా ఎస్పీగా చంద్రశేఖర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తపాలా సేవలను ఖాతాదారులకు మరింత చేరువయ్యే విధంగా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడితే శాఖ పరమైన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఈ సందర్భంగా తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. -
డెంకాడ ఎంపీపీ కారు దహనం
డెంకాడ: ఇంట్లో పార్క్ చేసి ఉన్న ఓ ప్రజాప్రతినిధి కారు కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలం అక్కివరం గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎంపీపీ కంది చంద్రశేఖర్ ఇంటి మందు పార్క్ చేసి ఉన్న కారును దుండగులు తగలబెట్టారు. ఇది గుర్తించిన స్థానికులు ఎంపీపీని అప్రమత్తం చేసేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. దీంతో చంద్రశేఖర్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బాధితుడికి పోలీసుల వేధింపులు
-
బాధితుడికి పోలీసుల వేధింపులు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. పోలీసులు నిందితులను పట్టుకోవాల్సిందిపోయి.. బాధిత రైతును విచారణ పేరుతో వేధిస్తూ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు. రాజధాని కోసం భూములు ఇవ్వనందుకు తుళ్లూరు మండలం మల్కాపురం రైతు గద్దె చంద్రశేఖర్‌కు చెందిన ఐదెకరాల చెరకు తోటను దుండగులు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం బాధిత రైతు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం మల్కాపురం సందర్శించి చంద్రశేఖర్ చెరకు తోటను పరిశీలించారు. వైఎస్ జగన్ అక్కడ నుంచి వెళ్లగానే రైతు కుటుంబ సభ్యులకు పోలీసుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. విచారణకు రావాలని పోలీసులు చంద్రశేఖర్‌కు కబురంపారు. సోమవారం రాత్రి 12 గంటలకు వరకు తనను పోలీస్ స్టేషన్లోనే ఉంచుకున్నారని చంద్రశేఖర్ వాపోయారు. ఆ రోజు ఉదయం కూడా పోలీసులు ఫోన్ చేసి విచారణకు రావాలని చెప్పినట్టు వెల్లడించారు. గత మూడు రోజులుగా ప్రతి అరగంటకు తాను ఏం చేసిందీ, ఎక్కడ ఉన్నదీ చెప్పాలని పోలీసులు అడిగారని బాధిత రైతు చెప్పారు. నిందితులను పట్టుకోవాల్సింది పోయి తనను విచారించడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులను సంప్రదించిన అనంతరం పోలీసులను కలుస్తానని చెప్పారు. -
వెంకటాచలంలో వ్యక్తి దారుణ హత్య
నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాగుటూరు గ్రామంలో ఎఫ్‌సీఐ గోడౌన్ సమీపంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి అదే గ్రామానికి చెందిన డబ్బుగుంట చంద్రశేఖర్(26)గా గుర్తించారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
తనయుడితో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం
చందంపేట: భార్య, అత్త, మామ, స్నేహితుడి వేధింపులు తట్టుకోలేక ఓ తండ్రి కొడుకుతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామశివారులో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా బల్మూర్ మండలం పొలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన పానుగంటి చంద్రశేఖర్ హైదరాబాద్‌లోని బండ్లగూడలో నివాసం ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన లలితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. గత ఆరు నెలల నుంచి భార్యాభర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం మొదలయ్యింది. భార్య లలిత బల్మూరు పోలీస్‌స్టేషన్‌లో చంద్రశేఖర్‌పై ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఎస్ఐ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ వారి మధ్య ఘర్షణలు ఆగలేదు. తన చావుకు భార్య, అత్త, మామలు, స్నేహితుడు నాగరాజులే కారణమని సూసైడ్ నోట్ రాసి, చందంపేట మండలం పోలేపల్లి శివారులోని చెరిపల్లి అంతయ్యబావి వద్ద తాను విషం తాగి కుమారుడు రత్నాకర్‌కు తాగించాడు. ఇద్దరూ స్పృహ కోల్పోతూ రోడ్డుపై కనిపించడంతో చందంపేట నుంచి దేవరకొండకు వస్తున్న మాతంగి కాశయ్య అనే ప్రయాణికుడు చూసి రత్నాకర్‌ను వివరాలు అడగ్గా.. తండ్రి స్పృహ కోల్పోయాడని.. పురుగుల మందు తాగామని చెప్పాడు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. -
ఆంధ్రప్రభ ఇన్చార్జ్ ఎడిటర్ అరెస్టు
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఆంధ్రప్రభ పత్రిక ఇన్చార్జి ఎడిటర్ చంద్రశేఖర్, భద్రాచలం విలేకరి షేక్‌మహబూబ్, సబ్ ఎడిటర్ విజయలక్ష్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మహ్మద్ ప్రవక్త బొమ్మను వేశారంటూ పలు ముస్లిం సంస్థలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. నాలుగు రోజుల నుంచి పలువురు ముస్లింలు పత్రికా కార్యాలయం వద్ద, పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాయి. -
చికిత్స కోసం వెళితే చితకబాదారు
హెదరాబాద్(కుషాయిగూడ): కడుపునొప్పితో బాధపడుతున్న కుమారుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిన ఓ తండ్రిని ఆసుపత్రికి చెందిన డాక్టర్లు, సిబ్బంది చితకబాదిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. వివరాలు.. వాసవి శివనగర్ కు చెందిన చంద్రశేఖర్ ఆదివారం రాత్రి సమయంలో కడుపునొప్పితో బాధపడుతున్న తన కుమారుడు రితీష్ (12)ను స్థానిక రాఘవేంద్రా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తన కుమారుడికి వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందిని కోరి ఆరోగ్యశ్రీ వార్డులో చేర్పించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ ప్రవీణ్, రితీష్‌ను పరీక్షించారు. బాలుడు అపెంటీసైడ్ నొప్పితో బాధపడుతున్నాడని 24 గంటల్లో ఆపరేషన్ చేయక పోతే బాబు ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. అందుకు తండ్రి చంద్రశేఖర్ ప్రస్తుతానికి వైద్యం అందించి ఆరోగ్యశ్రీ అనుమతి వచ్చాక ఆపరేషన్ చేయాలంటూ వేడుకున్నాడు. దీంతో బాలుడి ప్రాణానికి ప్రమాదం ఉందంటే ఆరోగ్యశ్రీ అనుమతులు అంటావా ? అంటూ అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. అంతా మాత్రాన పిల్లలను కనడం ఎందుకంటూ దూషించడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఈ క్రమంలో డాక్టర్ ప్రవీణ్‌తో పాటుగా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది చంద్రశేఖర్‌ను గదిలో బంధించి చితకబాదారు. డాక్టర్ స్టెతస్కోప్‌తో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. కాగా ఇరువురు ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రాథమికంగా విచారణ చేపట్టి ఆసుపత్రిలోని సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నర్సింగరావు తెలిపారు. అయితే డాక్టరు 24 గంటల్లో ఆపరేషన్ చేయాలి లేదంటే ప్రాణాలు దక్కవని చెప్పిన బాలుడు రితీష్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండటం కొసమెరుపు. -
‘కేసీఆర్ సినిమా సిటీ’ అని పేరు పెట్టాలి: కృష్ణ
సాక్షి, హైదరాబాద్: రెండు వేల ఎకరాల్లో సినిమా సిటీని నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సినీ కేంద్రంగా హైదరాబాద్ మారబోతుందనడానికి ఇదొక శుభసూచకమని అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ స్థాయిలో సినీ స్టూడియోలను నిర్మించే సత్తా కేసీఆర్‌కి ఉందనీ, అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఇతర దేశాల నుంచి కూడా సినిమా షూటింగులు చేసుకోవడానికి ఇక్కడకు వస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ నిర్మించనున్న సినిమా సిటీకి ‘కేసీఆర్ సినిమా సిటీ’ అని నామకరణం చేస్తే బావుంటుందని కృష్ణ సూచించారు. -
‘కాలం చెల్లిన మందుల’పై విచారణ
మద్నూర్ : మండలంలోని సోముర్‌లోని అంగన్వాడీ కేంద్రంలోని ఓ గదిలో కొంత కాలంగా కాలం చెల్లిన మందులు పడిఉన్నాయి. దీనిపై ఈ నెల 25న ‘ సాక్షిలో ’లో ‘ కాలం చెల్లినా కనిపించవా? ’ అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనిపై ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా ఎస్పీహెచ్వో ( సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారి ) చంద్రశేఖర్ శనివారం సోముర్ అంగన్వాడీ కేంద్రంలో విచారణ చేపట్టి, ఏఎన్ఎం స్వరూపకు మెమో అందించారు. అంగన్వాడీ కేంద్రంలో మందులను విచ్చలవిడగా ఎందుకు పారేశారని, వాటిని చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి చక్కెర బిల్లలు అనుకొని తింటే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలు అంగన్వాడీ కేంద్రంలో మందులు ఎందుకు ఉంచారని ఆయన ప్రశ్నించారు.అంతే కాకుండా కాలం చెల్లిన ఐ డ్రాప్‌లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎందుకు ఉన్నాయని, వెంటనే ఎందుకు పారేయలేదన్నారు. మందులు కాలం చెల్లకుంటే ముందే గ్రామాల్లో తిరిగి అవసరం ఉన్న వారికి పంపిణీ చేయాలని, ఇలా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమయ్యేలా చూడొద్దని సూచిం చారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని, ఇది చిన్న విషయం కాదని హెచ్చరించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని ఆయన తెలిపారు. ఆయనతో పాటు డోంగ్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు మమత,హెచ్ఈ సంజీవ్‌రెడ్డి, అంగన్వాడీ కార్యకర్త శోభ ఉన్నారు. -
పులుల మనుగడకు ప్రత్యేక చర్యలు
రుద్రవరం, న్యూస్‌లైన్ : నల్లమల్ల అడవిలో పులుల మనుగడ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా స్క్వాడ్, నంద్యాల ఇన్చార్జ్ డీఎఫ్ఓ చంద్రశేఖర్ తెలిపారు. చాగలమర్రి, అహోబిలం, రుద్రరవం అటవీ కార్యాలయాల సమీపంలోని బేస్ క్యాంపులు, చెక్ పోస్టులను సోషల్ ఫారెస్టు నర్సరీ, రుద్రవరం కార్యాలయ సమీపంలోని మరో నర్సరీని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఫారెస్టు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండ్ల బ్రహ్మేశ్వరం అడవి నుంచి రుద్రరవం మీదుగా తిరుపతి వరకు అడవిని కారిడార్‌గా గుర్తించాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు తెలిపారు. నంద్యాల అటవీ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాల ద్వారా ఎనిమిది, పాదముద్రల ద్వారా మరో నాలుగు పెద్ద పులులున్నట్లు గుర్తించామన్నారు. వీటి మనుగడ కోసం రుద్రవరం, చెలిమా రేంజిలను కారిడార్లుగా గుర్తించి అడవిలోకి ఎవ రూ ప్రవేశించకుండా చర్యలు తీసుకునే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. నంద్యాల అటవీ డివిజన్ పరిధిలోని చెలిమా రేంజిలో 10 హెక్టార్లు, రుద్రవరం రేంజి పరిధిలో 30, బండి ఆత్మకూరు రేంజిలో 10 హెక్టార్లలో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రశేఖర్ చెప్పారు. ఇందుకోసం నారవేపి, ఎర్రచందనం, ఊసరి, నల్లమద్ది, ఎగిసా, జుట్టేగా, రోజ్‌హుడ్ తదితర మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయన వెంట రేంజర్ రాంసింగ్, డీఆర్ఓ సౌదర్యరాజు, సెక్షన్ ఆఫీసర్లున్నారు. -
కోరిక తీర్చనందుకే హతమార్చాడు
కొత్తకోట టౌన్, న్యూస్‌లైన్ : తన కోరిక తీర్చలేదనే కోపంతో డిగ్రీ విద్యార్థిని లక్ష్మీదేవి (19) ని వరుసకు సోదరుడైన చంద్రశేఖర్ గొడ్డలితో దాడి చేసి హతమార్చాడని వనపర్తి డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కేసు వివరాలను శుక్రవారం కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో ఆయన తెలిపారు. మండలంలోని రామనంతాపురానికి చెందిన చంద్రశేఖర్ వడ్డెర వృత్తిని కొనసాగిస్తూ వివిధ ప్రాంతాలు తిరిగేవాడు. అప్పుడప్పుడూ స్వగ్రామానికి వచ్చేవాడు. పలుసార్లు అసభ్యంగా ప్రవర్తించగా బాధితురాలి సోదరులు, తల్లిదండ్రులు మందలించా రు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం ఆ యువతి సమీపంలోని తమ పొలానికి వెళుతుండగా వెంబడించి కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. నిరాకరించిన ఆమెపై గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. బాధిత కుటుం బ సభ్యుల ఫిర్యాదు మేరకు అతడిని పోలీ సులు అరెస్టు చేసి శుక్రవారం సాయంత్రం వనపర్తి కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో కొత్తకోట సీఐ రమేష్‌బాబు, పెద్దమందడి ఎస్ఐ మురళీగౌడ్ పాల్గొన్నారు. విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం కొత్తకోట రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని రామనంతాపురంలో దారుణ హత్య కు గురైన డిగ్రీ విద్యార్థిని లక్ష్మీదేవి (19) మృతదేహానికి శుక్రవారం వనపర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసుల బందోబస్తుతో స్వ గ్రామానికి తరలించారు. మృతదేహాన్ని చూసిన బంధువులు, గ్రామస్తులు ఆగ్రహా వేశాలకు లోనై నిందితుడి ఇంటిపై దాడికి యత్నించారు. ఒక దశలో అతని ఇంటి ఎదుటే పూడ్చాలని పట్టుపట్టారు. వారికి కొత్తకోట సీఐ రమేష్‌బాబు, పెద్దమందడి ఎస్ఐ మురళీగౌడ్ నచ్చజెప్పి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. -
గడ్చిరోలి ఎన్కౌంటర్ బూటకం: ఏపీసీఎల్సీ
గత వారం గడ్చిరోలిలో జరిగినది బూటకపు ఎన్కౌంటర్ అని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల కమిటీ మండిపడింది. ఆ సంఘటనలో పాల్గొన్న పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈనెల 18వ తేదీన మావోయిస్టులకు, సి-60 కమాండో దళాలకు కోర్చి తాలూకా బెట్కార్తి గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. అనంతరం ఏపీసీఎల్సీ నిజ నిర్ధారణ బృందం అక్కడకు వెళ్లి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ బృందంతో కలిసి సంఘటనపై విచారణ జరిపింది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ఏపీసీఎల్సీ ప్రధాన కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మావోయిస్టులను పోలీసులు ఓ వాహనంలో తెచ్చారని, అప్పటికే వాళ్లకు విషం ఇచ్చారని, ఆ తర్వాత దగ్గరనుంచి కాల్చి చంపారు తప్ప పోలీసులు కథ అల్లుతున్నట్లుగా అక్కడ ఎన్కౌంటర్ ఏమీ జరగలేదని అన్నారు. సంఘటన స్థలంలో ఎక్కడా బుల్లెట్ల ఆనవాళ్లు లేవని, అలాగే మృతదేహాలకు పంచనామా చేయడం గానీ, స్థానిక మీడియాకు చెప్పడంగానీ జరగలేదని ఆయన ఆరోపించారు. మృతదేహాలను నేరుగా గడ్చిరోలి ప్రభుత్వాస్పత్రికి తెచ్చారన్నారు. ఆ సంఘటనలో పాల్గొన్న పోలీసులపై హత్యకేసు నమోదుచేసి, జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
శ్రీశైలంలో నేడు గిరిప్రదక్షిణ
శ్రీశైలం, న్యూస్‌లైన్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలంలో శుక్రవారం మాఘశుద్ధపౌర్ణమిని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు ఈఓ చంద్రశేఖర ఆజాద్ గురువారం విలేకరులకు తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 8గంటలకు ఆలయ రాజగోపురం వద్ద పల్లకీలో ఉత్సవమూర్తులను కొలువుంచి ప్రత్యేకపూజలను నిర్వహిస్తారన్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ఆర్టీసీ బస్టాండ్ ముందుభాగం, ట్రైబల్ మ్యూజియం వెనుక భాగం నుంచి దేవస్థానం టోల్ గేట్, యజ్ఞవాటిక, శ్రీగిరి కాలనీ వెనుకభాగం, గోశాల, హేమారెడ్డి మల్లమ్మ మందిరం మీదుగా గంగాభవాని స్నానఘట్టాల మీదుగా సాగుతుందన్నారు. ఈ ప్రదక్షిణలో భాగంగా పంచమఠాలు, వీరభద్ర మఠం, హేమారెడ్డి మల్లమ్మ, సిద్ధిరామప్పకొలను ఎగువభాగం తదితర చోట్ల స్వామి అమ్మవార్లకు నీరాజనాలను అర్పిస్తున్నట్లు తెలిపారు. వివిధ జన్మల్లో చేసిన పాపాలన్నీ ప్రదక్షిణలో ఒక్కొక్క అడుగుతో తొలగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయన్నారు. భగవంతునికి అర్పించే కైంకర్యాలలో ప్రదక్షిణ పరిపూర్ణమైనదన్నారు. ఆలయాలలోనే కాకుండా పుణ్యక్షేత్రాలకు నిలయమైన ఆయా పర్వతాల చుట్టూ, గిరుల చుట్టూ ప్రదక్షిణ చేసే సంప్రదాయం కూడా ఉందన్నారు. భక్తులలో భక్తిభావాలను పెంపొందిండంతో పాటు క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మికత కేంద్రంగా తీర్చిదిద్దేందకు, ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమి రోజున ఈ గిరి ప్రదక్షిణ నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని ఈవో తెలిపారు. -
ఖోఖో పోటీలకు ఏర్పాట్లు పూర్తి
కీసర, న్యూస్‌లైన్: కీసరలో నేటినుంచి మూడు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్ర శేఖర్ తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఖోఖో పోటీలు కీసరలోని సెరినిటీ పాఠశాల ఆవరణలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఈ మేరకు గ్రౌండ్‌ను సిద్ధం చేశామని చెప్పారు. పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి అండర్ -14 విభాగంలో బాల బాలికలు పాల్గొంటారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రతి జిల్లా నుంచి 2 జట్లు (బాలురు, బాలికలు)పాల్గొంటాయని మొత్తం 552 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థులకు సెరినిటీ పాఠశాల, అరుంధతి పాఠశాల్లో వసతి సౌక ర్యం కల్పించినట్లు ఆయన తెలిపారు. క్రీడాకారులకు మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ ఉచితంగా భోజన వసతి కల్పించారని చెప్పారు. క్రీడల నిర్వహణలో 120 మంది పీఈటీలు పాల్గొంటారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
పుష్కరానికో కాన్పు!
మెదక్ రూరల్, న్యూస్‌లైన్ : మామూలుగా ఏ ఆస్పత్రిలోనైనా వారంలో మూడు కాన్పులు కామన్. ఈ ఆస్పత్రికి ఎవరూ రారంటే వారంలో కనీసం ఒక్క చిన్నారైనా కేర్ మంటాడు. కానీ ఆస్పత్రి ప్రారంభించి 12 సంవత్సరాలైనా ఒక్క చిన్నారి ఏడుపు కూడా వినిపించని ఆస్పత్రి ఒకటుంది. ఎక్కడాని ఆలోచించకండి మన జిల్లాలోనే.. మెదక్ మండలంలోని సర్దన పీహెచ్సీ ఈ రికార్డు సాధించింది. ఇంతకీ ఈ గొప్ప ఇపుడెందుకు బయటకొచ్చిందంటే గురువారం సర్దన ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఓ మహిళ పండంటి బిడ్డను ప్రసవించింది. ఇటీవల బదిలీపై ఇక్కడికొచ్చిన డాక్టర్ చంద్రశేఖర్ గురువారం సర్దన గ్రామానికి చెందిన గౌరీలక్ష్మికి పురుడుపోశారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. ఇప్పటి వరకూ తలనొప్పి, జలుబు, దగ్గు, జ్వరం తదితర వాటికే మందులిచ్చి పంపే ఆస్పత్రి సిబ్బంది కూడా తొలికాన్పు చేసి సంతోషపడిపోయారు. ఇకనుంచి సర్దన పీహెచ్సీలో కాన్పులు చేస్తామని వైద్యుడు చంద్రశేఖర్ తెలిపారు. -
శంఖారావంతో ఢిల్లీ పీఠం కదులుతుంది
సమైక్య శంఖారావం సభతో ఢిల్లీ పార్లమెంట్ కదలబోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోట చంద్రశేఖర్ అన్నారు. సీమాంధ్రకు చెందిన 19 మంది ఎంపీలు రాజీ నామా చేయాలని, అప్పుడే మైనార్టీలో ఉన్న కేంద్రప్రభుత్వం కుప్ప కూలి విభజన ఆగుతుందని ఆయన చెప్పారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించడం ద్వారానే విభజన ఆపగలమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు ప్యాకేజీలకు లొంగిపోవడం దుర్మార్గమని, కేవలం 12 పార్లమెంటు సీట్ల కోసం కక్కుర్తి పడి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందని మండిపడ్డారు. దేశంలోని ఎక్కడాలేని విధంగా అప్రజాస్వామికంగా రాష్ట్ర విభజనకు యూపీఏ పూనుకుంటోందని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగితే అన్ని వర్గాలు నష్టపోతాయని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగ్‌కు మద్దతు పలికి సమైక్యశంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.