
న్యూఢిల్లీ: అమెరికన్ల ఉద్యోగాలను కాపాడే పేరిట.. ప్రతిపాదిత హెచ్–1బీ వీసా బిల్లులో అమెరికా అసాధ్యమైన షరతులను పొందుపర్చిందని దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. ఇటు భారతీయ ఐటీ కంపెనీలతో పాటు అటు హెచ్–1బీ వీసాలు ఉపయోగించే క్లయింట్లకు కూడా కఠినతరమైన నిబంధనలు ఇందులో ఉన్నాయని ఆయన చెప్పారు.
దీనిపై తమ ఆందోళనను అమెరికా సెనేటర్లు, అధికారులకు తెలియజేశామని, ప్రతిపాదిత చట్టంపై రాబోయే రోజుల్లో మరిన్ని చర్చలు జరపనున్నామని చంద్రశేఖర్ వివరించారు. ‘అమెరికన్ ఉద్యోగాలను కాపాడే పేరుతో.. ఈ నిబంధనలను వీసాలపై ఎక్కువగా ఆధారపడే కంపెనీలకు.. అంటే భారతీయ కంపెనీలకు మాత్రమే వర్తింపచేసేలా ఉండటం మరింత ఆందోళన కలిగించే విషయం’ అని ఆయన పేర్కొన్నారు.
సదరు నిబంధనల ప్రకారం హెచ్–1బీ వీసాలపై నియమించుకున్న వారికి అధిక వేతనాలు ఇవ్వడంతో పాటు వారి రాక వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగి ఉద్యోగానికి అయిదారేళ్లపాటు ఎలాంటి ఢోకా ఉండబోదంటూ క్లయింటు ధృవీకరించాల్సి ఉంటుంది.ఈ బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment