ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్ల తీర్మానం
వాషింగ్టన్: అమెరికాలో ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) గడువు 180 రోజుల నుంచి అటోమేటిక్‌గా 540 రోజులకు పెరిగేలా వెసులుబాటు కల్పిస్తూ జో బైడెన్ ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. దీనివల్ల హెచ్–1బీ వీసాదార్ల జీవిత భాగస్వాములకు ప్రయోజనం చేకూరుతోంది. జో బైడెన్ ప్రభుత్వం పాలనలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది జనవరి 13న డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఫైనలైజ్ చేసింది.
అయితే, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. వలసదార్ల విషయంలో నూతన అధ్యక్షుడు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. వర్క్ పర్మిట్ల రెన్యూవల్ గడువును 180 నుంచి 540 రోజులకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు జాన్ కెన్నెడీ, రిక్ స్కాట్ గురువారం కాంగ్రెస్‌లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు. ఈఏడీ గడువు పెంచడాన్ని రద్దు చేయకపోతే అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్నవారిని గుర్తించడం చాలా కష్టమవుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment