వాషింగ్టన్ : 2025-26 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 7నుంచి ప్రారంభమై మార్చి 24న ముగియనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విభాగం అధికారికంగా ప్రకటించింది.
భారత్ నుంచి ఎక్కువ డిమాండ్ ఉండే హెచ్-1బీ వీసా ఉద్యోగులకు ఆయా కంపెనీలు స్పాన్సర్ చేస్తుంటాయి. అందుకు అయ్యే ఈ-రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీ మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంది. ఉద్యోగికి ఏదైనా సంస్థ హెచ్-1బీ వీసా ఇచ్చేందుకు ఈ-రిజిస్ట్రేషన్ చేయాలంటే కంపెనీలు పది డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ కంపెనీలే ఏకంగా ఏడాదికి 125 డాలర్ల రుసుము చెల్లించాల్సి వస్తుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
The initial registration period for the fiscal year 2026 H-1B cap will run from noon ET on March 7 to noon ET on March 24. Prospective petitioners & representatives must use a USCIS online account to register each beneficiary ... (1/3)
— USCIS (@USCIS) February 5, 2025
హెచ్-1బీ రిజిస్ట్రేషన్
గతేడా జోబైడెన్ ప్రభుత్వం బెనిఫిషియరీ సెంట్రిక్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఆ విధానం ఈ ఏడాది కొనసాగుతుంది. ఈ విధానంలో ప్రతి దరఖాస్తుదారుడి తరఫున ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసినా ఒక్కసారి మాత్రమే అతడి పేరు లాటరీలో నమోదవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment