కీసర, న్యూస్‌లైన్:
కీసరలో నేటినుంచి మూడు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్ర శేఖర్ తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఖోఖో పోటీలు కీసరలోని సెరినిటీ పాఠశాల ఆవరణలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఈ మేరకు గ్రౌండ్‌ను సిద్ధం చేశామని చెప్పారు. పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి అండర్ -14 విభాగంలో బాల బాలికలు పాల్గొంటారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రతి జిల్లా నుంచి 2 జట్లు (బాలురు, బాలికలు)పాల్గొంటాయని మొత్తం 552 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థులకు సెరినిటీ పాఠశాల, అరుంధతి పాఠశాల్లో వసతి సౌక ర్యం కల్పించినట్లు ఆయన తెలిపారు. క్రీడాకారులకు మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ ఉచితంగా భోజన వసతి కల్పించారని చెప్పారు. క్రీడల నిర్వహణలో 120 మంది పీఈటీలు పాల్గొంటారని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఖోఖో పోటీలకు ఏర్పాట్లు పూర్తి
Published Fri, Nov 8 2013 12:00 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement