![Karnataka BJP MLA Renukacharya nephew found Dead in Car - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/11/4/ka.jpg.webp?itok=MpQmcSyX)
ఎమ్మెల్యే రేణుకాచార్య, మృతుడు చంద్రశేఖర్
సాక్షి, బెంగళూరు(బనశంకరి): దావణగెరె జిల్లా హొన్నాళి నియోజకవర్గ ఎమ్మెల్యే రేణుకాచార్య సోదరుడి కుమారుడు చంద్రశేఖర్ (24) అదృశ్యమైన ఘటన గురువారం విషాదాంతమైంది. చంద్రశేఖర్ కారు తుంగా ప్రధాన కాలువలో లభ్యమైంది. అందులో చంద్రశేఖర్ మృతదేహం బయటకు తీశారు. ఐదురోజులు క్రితం అదృశ్యమైన అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు.
కడదగట్టి గ్రామం వద్ద కారు ఆనవాళ్లు
దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా కడదగట్టి గ్రామం తుంగా కాలువ వద్ద చంద్రశేఖర్ కారు సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాలువ వద్దకు చేరుకున్న పోలీసులు కారుతో పాటు అందులో ఉన్న చంద్రశేఖర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అక్కడే ఘటనస్థలంలో ఉన్న ఎమ్మెల్యే రేణుకాచార్య తీవ్రంగా రోదించారు. సోదరుడి కుమారుడు అదృశ్యమై ఐదు రోజులు గడిచినప్పటికి ఎలాంటి ఆచూకీ లభించలేదు. చంద్రశేఖర్ కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. చంద్రశేఖర్ మొబైల్ స్విచ్చాఫ్ వచ్చింది.
చంద్రశేఖర్ మృతి కేసులో ట్విస్ట్.. కారులో ఉన్న ఆ ఇద్దరు ఎవరూ ?
ఈ సంఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో ఇద్దరు ఉన్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. న్యామతి వద్ద చంద్రశేఖర్ కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్న దృశ్యాలు రికార్డు అయింది. చంద్రశేఖర్ పక్కన మరొకరు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. అదే కారులో చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైంది. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. హొన్నాళి నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం లభించింది. ఇది హత్య, ఆత్మహత్య అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment