Tunga
-
తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం.. రోదించిన ఎమ్మెల్యే
సాక్షి, బెంగళూరు(బనశంకరి): దావణగెరె జిల్లా హొన్నాళి నియోజకవర్గ ఎమ్మెల్యే రేణుకాచార్య సోదరుడి కుమారుడు చంద్రశేఖర్ (24) అదృశ్యమైన ఘటన గురువారం విషాదాంతమైంది. చంద్రశేఖర్ కారు తుంగా ప్రధాన కాలువలో లభ్యమైంది. అందులో చంద్రశేఖర్ మృతదేహం బయటకు తీశారు. ఐదురోజులు క్రితం అదృశ్యమైన అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. కడదగట్టి గ్రామం వద్ద కారు ఆనవాళ్లు దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా కడదగట్టి గ్రామం తుంగా కాలువ వద్ద చంద్రశేఖర్ కారు సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాలువ వద్దకు చేరుకున్న పోలీసులు కారుతో పాటు అందులో ఉన్న చంద్రశేఖర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అక్కడే ఘటనస్థలంలో ఉన్న ఎమ్మెల్యే రేణుకాచార్య తీవ్రంగా రోదించారు. సోదరుడి కుమారుడు అదృశ్యమై ఐదు రోజులు గడిచినప్పటికి ఎలాంటి ఆచూకీ లభించలేదు. చంద్రశేఖర్ కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. చంద్రశేఖర్ మొబైల్ స్విచ్చాఫ్ వచ్చింది. చంద్రశేఖర్ మృతి కేసులో ట్విస్ట్.. కారులో ఉన్న ఆ ఇద్దరు ఎవరూ ? ఈ సంఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో ఇద్దరు ఉన్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. న్యామతి వద్ద చంద్రశేఖర్ కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్న దృశ్యాలు రికార్డు అయింది. చంద్రశేఖర్ పక్కన మరొకరు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. అదే కారులో చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైంది. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. హొన్నాళి నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం లభించింది. ఇది హత్య, ఆత్మహత్య అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
హామీలు తుంగలో తొక్కిన సీఎం
పోరుమామిళ్ల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని బద్వేలు ఎమ్మెల్యే జయరాములు ధ్వజమెత్తారు. శుక్రవారం వైఎస్ఆర్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు గోవిందరెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనసభ సమావేశాలపైన ఆయన మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ కుటుంబాన్ని విమర్శించేందుకే సగం సమయం వృథా చేశారన్నారు. బడ్జెట్ సామాన్యులకు మేలు చేసేదిగా లేదన్నారు. రైతురుణ మాఫీపై నేటికీ స్పష్టత లేదన్నారు. డ్వాక్రా రుణాలు, బంగారు తాకట్టు రుణాల్లో మెలిక పెడుతున్నారని మండిపడ్డారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేన్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో సభలో చర్చించి అందరి ఆమోదంతో ప్రకటించి ఉంటే బాగుండేదన్నారు. అది ప్రజల రాజధాని కాదని, రియల్ ఎస్టేట్ రాజధాని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాన్ని తీసుకోలేదన్నారు. ప్రజలకు మేలుచేసే అంశాలను సభలో చర్చించలేదని పేర్కొన్నారు. ప్రజల్లో ఆయనపై విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. సాఫ్ట్వేర్ పేరుతో 850 ఎకరాలు రహేజాకు కట్టబెట్టిన ఘనుడు చంద్రబాబు అన్నారు. సమస్యల పరిష్కారానికి పోరు సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాడతామని ఎంపీపీ చిత్తా విజయప్రతాప్రెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు దొరికినకాడికి దోచుకునేందుకు సిద్ధమయ్యారన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ఇమామ్హుసేన్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ముత్యాల ప్రసాద్, మండల నాయకులు రవిప్రకాష్రెడ్డి, రమణ పాల్గొన్నారు.