సమైక్య శంఖారావం సభతో ఢిల్లీ పార్లమెంట్ కదలబోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోట చంద్రశేఖర్ అన్నారు. సీమాంధ్రకు చెందిన 19 మంది ఎంపీలు రాజీ నామా చేయాలని, అప్పుడే మైనార్టీలో ఉన్న కేంద్రప్రభుత్వం కుప్ప కూలి విభజన ఆగుతుందని ఆయన చెప్పారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించడం ద్వారానే విభజన ఆపగలమని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రులు ప్యాకేజీలకు లొంగిపోవడం దుర్మార్గమని, కేవలం 12 పార్లమెంటు సీట్ల కోసం కక్కుర్తి పడి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందని మండిపడ్డారు. దేశంలోని ఎక్కడాలేని విధంగా అప్రజాస్వామికంగా రాష్ట్ర విభజనకు యూపీఏ పూనుకుంటోందని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగితే అన్ని వర్గాలు నష్టపోతాయని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగ్‌కు మద్దతు పలికి సమైక్యశంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
శంఖారావంతో ఢిల్లీ పీఠం కదులుతుంది
Published Thu, Oct 24 2013 4:45 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement