పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై అల్లు అర్జున్‌ మామ సీరియస్‌ కామెంట్స్‌ | Allu Arjun's Uncle Chandrasekhar Reddy Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై అల్లు అర్జున్‌ మామ సీరియస్‌ కామెంట్స్‌

Published Sun, Aug 25 2024 2:51 PM | Last Updated on Sun, Aug 25 2024 3:36 PM

Allu Arjun's Uncle Chandrasekhar Reddy Comments On Pawan Kalyan

టాలీవుడ్‌లో మెగా కాంపౌండ్‌, అల్లు అర్జున్ మధ్య విబేధాల గురించి అందరికీ తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడైతే రాజకీయాల్లో  ఎంట్రీ ఇచ్చారో ఆ సమయం నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, బన్నీ మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. కానీ, గత ఎన్నికల్లో తన మిత్రుడు శిల్పా మోహన్ రెడ్డి కోసం బన్నీ నంద్యాలకు వెళ్లడంతో మెగా కాంపౌండ్‌లో పెద్ద దుమారమే రేగింది. దీంతో బన్నీ, పవన్‌ అభిమానుల మధ్య పెద్ద రచ్చే జరిగింది.

ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం బెంగళూరు పర్యటనలో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  సినిమాల్లో హీరోల పాత్రల గురించి  కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అటవీ సంపదను కాపాడేవారని ఇప్పుడు అదే హీరోలు చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  ఈ కామెంట్‌  అల్లు అర్జున్‌ను ఉద్దేశించే పవన్‌ చేశారని ఫ్యాన్స్‌ ఫైర్‌ అయ్యారు. ఇప్పటికీ ఆ గొడవ జరుగుతూనే ఉంది. అయితే, తాజాగా అల్లు అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి రియాక్ట్‌ అయ్యారు.  

పవన్‌ క్లారిటీ ఇవ్వాలి: చంద్రశేఖర్‌ రెడ్డి
పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి ఖండించారు. ఈ వివాదంలో పవన్‌ కాల్యాణే వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. పవన్‌ ఏ అంశం మీద అలా మాట్లాడారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. 'ఒక సినిమా కోసం మాత్రమే అల్లు అర్జున్‌ నటించాడనే విషయం పవన్‌ కల్యాణ్‌కు కూడా తెలుసు కదా.. అలాంటప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది..? ఇప్పటికైన పవన్‌ జోక్యం చేసుకుని తన వ్యాఖ్యలకు క్లారిటీ ఇవ్వాలి. తాను మాట్లాడింది పుష్ప సినిమా గురించి కాదని చెప్పి ఉంటే బాగుండేది. 

అప్పుడే ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడుతుంది. అల్లు అర్జున్‌కు నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది పాలిటిక్స్‌లో కాదు.. సినిమాల్లో అని గుర్తుంచుకోవాలి. బన్నీ చాలా మెచ్యూర్‌ నటుడు. తను సినిమాల్లో మాత్రమే ఉన్నారని గ్రహించాలి. ఆయన అభిమానులకు, స్నేహితులకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఉంటారు. నమ్మిన వారి కోసమే బన్నీ ఉంటారు.' అని ఆయన వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement