అనంతపురం రూరల్: అనంతపురం డివిజన్ తపాలా ఎస్పీగా చంద్రశేఖర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తపాలా సేవలను ఖాతాదారులకు మరింత చేరువయ్యే విధంగా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడితే శాఖ పరమైన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. ఈ సందర్భంగా తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.