'ఉద్యోగులపై దాడులు కొత్తేమీకాదు' | attacks on employees in not newthing, says ashok babu | Sakshi
Sakshi News home page

'ఉద్యోగులపై దాడులు కొత్తేమీకాదు'

Published Tue, Aug 4 2015 4:42 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

'ఉద్యోగులపై దాడులు కొత్తేమీకాదు'

'ఉద్యోగులపై దాడులు కొత్తేమీకాదు'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరగడం కొత్తేమీకాదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కూడా దాడులు జరిగాయని చెప్పారు. తహశీల్దార్ వనజాక్షిపై ఇటీవలి దాడి జరిగిన ఘటన నేపథ్యంలో అశోక్ బాబు పైవిధంగా స్పందించారు. వనజాక్షిపై దాడి ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీ వేసిందని తెలిపారు.

ఏపీలో ఉద్యోగుల బదిలీలను ఆగస్టులో చేయడం సరికాదని అశోక్ బాబు అన్నారు. విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఉద్యోగులను కూడా సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలను కట్టిన తర్వాత రాజధానిని తరలించాలని గతంలోనే కోరామని చెప్పారు. ఏయే శాఖలు, ఎంత మంది ఉద్యోగులను తరలిస్తారో తెలపాలని కోరారు. ఉద్యోగులు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలియజేస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement