
సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిన పార్లమెంట్
న్యూఢిల్లీ : సమైక్యాంధ్ర నినాదాలతో పార్లమెంట్ సోమవారం మార్మోగింది. దీంతో ప్రారంభమైన కాసేపటికే పార్లమెంట్ ఉభయసభలూ రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఈరోజు ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. సభ్యుల నినాదాల మధ్యే లోక్సభలో ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టింది. సభా కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుండటంతో స్పీకర్ మీరాకుమార్ లోక్‌సభను వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా పడ్డాయి.