అందరి చూపు ఢిల్లీవైపే... సర్వత్రా ఉత్కంఠ | telangana bill: All eyes on delhi | Sakshi
Sakshi News home page

అందరి చూపు ఢిల్లీవైపే... సర్వత్రా ఉత్కంఠ

Published Mon, Feb 17 2014 10:21 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

అందరి చూపు ఢిల్లీవైపే... సర్వత్రా ఉత్కంఠ - Sakshi

అందరి చూపు ఢిల్లీవైపే... సర్వత్రా ఉత్కంఠ

న్యూఢిల్లీ : పార్లమెంట్ చివరి సమావేశాలు ముగిసేందుకు మిగిలింది అయిదు రోజులే. నేటి నుంచి జరుగనున్న చివరి విడత సమావేశాలే తెలంగాణ భవితవ్యాన్ని తేల్చనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సోమవారం ఉదయం హుటా హుటీన హస్తిన వెళ్లారు. మరోవైపు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో పాటు ఆ పార్టీ నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించేందుకు అవసరమయిన మద్దతును కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు.

ఢిల్లీలో ఎప్పుడేం జరుగుతుందో... ఏ పార్టీ ఎప్పుడు ఏ వైఖరి తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి  నెలకొనడంతో తెలంగాణ భవితవ్యం మీద సందిగ్ధం నెలకొంది. అలాగే నేడు, రేపు ఢిల్లీలో సమైక్య ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనల ప్రభావం తెలంగాణ అంశం మీద ఎలా ఉంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది. సమైక్య ఆందోళనల ప్రభావంతో తెలంగాణ వెనక్కి పోకుండా మరింత పట్టుదలతో కృషి చేయాలని తెలంగాణవాదులు భావిస్తున్నారు. మంగళవారం కానీ, బుధవారంకానీ బిల్లు మీద చర్చ జరిగే అవకాశం ఉండటంతో ఈ రెండు రోజులే కీలకంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement