ఇన్నాళ్లు వేటు ఎందుకు వేయలేదు: వెంకయ్య
ఇన్నాళ్లు వేటు ఎందుకు వేయలేదు: వెంకయ్య
Published Tue, Feb 11 2014 1:37 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ వేటు వేయడంపై బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న సీమాంధ్ర ఎంపీలను ఇన్నాళ్లు ఎందుకు బహిష్కరించలేదు అని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలో భాగమే సీమాంధ్ర ఎంపీల వేటు అని వెంకయ్య విమర్శించారు.
రాష్ట్ర విభజనకు బీజేపీ ఎప్పడూ అనుకూలమే అని వెంకయ్య అన్నారు. అయితే సీమాంధ్ర ప్రాంత ప్రజల అనుమానాలు, సందేహాలు తీర్చాలని.. ఆప్రాంతానికి న్యాయం జరగాలని బీజేపీ కోరుకుంటోంది అని వెంకయ్య నాయుడు అన్నారు.
Advertisement
Advertisement