ప్రశ్నోత్తరాలను అడ్డుకుంటాం: సీమాంధ్ర ఎంపీలు | we will obstruct question hour: Seemandhra MPs | Sakshi
Sakshi News home page

ప్రశ్నోత్తరాలను అడ్డుకుంటాం: సీమాంధ్ర ఎంపీలు

Published Mon, Aug 12 2013 10:51 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM

we will obstruct question hour: Seemandhra MPs

న్యూఢిల్లీ: సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవాలని సీమాంధ్ర ఎంపీలు నిర్ణయించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు ఉదయం ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. 

భేటీ అనంతరం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంట్లో కేవలం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని అడ్డుకుంటామని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ఎంపీలు హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎస్పీవై రెడ్డి, కనుమూరి బాపిరాజు తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement