Question hour
-
కేజ్రీవాల్ పై సీబీఐ ప్రశ్నల వర్షం
-
తెలంగాణకు రూ.5,238.93 కోట్లు.. పార్లమెంటులో చెప్పిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ద్వారా ఆరు జాతీయ జలమార్గాలు వెళ్తున్నాయని అందులో గోదావరి– కృష్ణానది మినహా మిగతా ఐదు జాతీయ జలమార్గాలైన భీమా, మంజీరా, పెన్‌గంగ–వార్ధా, తుంగభద్ర, పెన్‌గంగ–ప్రాణహిత నదుల వ్యవస్థ జాతీయ జలమార్గాలు షిప్పింగ్, నావిగేషన్ కోసం సాంకేతిక–వాణిజ్యపరంగా ఆచరణీయం కాదని అధ్యయనంలో తేలిందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ప్రస్తుతం నల్లగొండలోని సిమెంట్ పరిశ్రమల నుంచి సిమెంట్ తరలింపు కోసం ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దుకు సమీపంలో ఉన్న ముక్త్యాల టెర్మినల్‌ను ఉపయోగించవచ్చా అని బీఆర్ఎస్ ఎంపీ డి.దామోదర్‌రావు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు. జాతీయ జలమార్గం–4 ఫేజ్–1లో భాగంగా కృష్ణా నదిపై ముక్త్యాల–విజయవాడ స్ట్రెచ్ (82 కి.మీ.) దశలవారీ పనుల అభివృద్ధికి ఇన్‌ల్యాండ్ భారత జలమార్గాల ప్రాధికార సంస్థ రూ.96 కోట్లు కేటాయించిందని వివరించారు. రాష్ట్రానికి రూ.5,238.93 కోట్లు.. తెలంగాణలో 2014–15 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం వరకు జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.5,238.93 కోట్లు విడుదల చేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. కాగా, రాష్ట్ర వాటాతో కలిపి రూ.8,584.98 కోట్లు వాడినట్లు వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 2014లో 668 ఉండగా, 2020లో 863కు చేరిందని బీఆర్ఎస్ ఎంపీ డి.దామోదర్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గ్రామ సడక్ యోజన కింద 2,427.50 కి.మీ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన–3 కింద 2,427.50 కి.మీ రహదారి నిర్మాణానికి కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి తెలిపారు. కాగా ఇందులో డిసెంబర్ 14 నాటికి 2,395.84 కి.మీ పొడవుతో 356 రోడ్డు పనులు ఇప్పటికే రాష్ట్రానికి మంజూరు చేశామని బీఆర్ఎస్ ఎంపీలు రంజిత్‌రెడ్డి, మాలోత్ కవిత అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి బదులిచ్చారు. 45 దరఖాస్తుల ఆమోదం ఆంధ్రప్రదేశ్ నుంచి 47, తెలంగాణ నుంచి 42 ఖేలో ఇండియా సెంటర్ల ఏర్పాటుకు దరఖాస్తులు అందగా అందులో ఏపీకి చెందిన 26, తెలంగాణకు చెందిన 19 దరఖాస్తులను ఆమోదించామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. చదవండి: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇష్టం వచ్చినట్లు సీట్ల పెంపు కుదరదు -
అప్డేట్స్: శనివారానికి తెలంగాణ అసెంబ్లీ వాయిదా
►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి. ►తెలంగాణలో మత కల్లోలాలు లేవని, ప్రజలందరూ ప్రశాంతంగా నిద్ర పోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. పోలీసులు సమర్థవంతంగా పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కిరణ్ మాట్లాడారు. ►తెలంగాణలో మద్యం అమ్మకాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తప్పుబట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు శాసనసభలో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ప్రతి పాన్ షాపు బెల్ట్ షాపే.. ప్రతి కిరాణ షాపు బెల్ట్ షాపే అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పద్మారావు గౌడ్ స్పందిస్తూ.. తప్పుడు ఆరోపణలు చేయొద్దని శ్రీధర్ బాబుకు సూచించారు. హైదరాబాద్ సిటీలో ఎక్కడా బెల్ట్ షాపు ఉండదని అన్నారు. ►‘మండల్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఎక్కడో ఒక చోట, 10 కిలోమీటర్ల దూరంలో వైన్ షాపు ఉంటది. అక్కడికి వెళ్లి తెచ్చుకునేందుకు ఇబ్బంది పడుతారని చెప్పి.. అదేదో తెచ్చి గ్రామాల్లో పెడుతరు. అయితే గ్రామానికి, కిరణా షాపుల్లో, అక్కడ ఇక్కడ బెల్ట్ షాపులు ఉండు. గతంలో ఎక్సైజ్ మంత్రిగా పని చేశాను.. తాను ఇక్కడ కూర్చొని చెప్పొద్దు కానీ చెప్పాల్సి వస్తుంది’ అని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ► ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేయబోతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేసీఆర్ కిట్ పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు.సీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 2017, జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 13 లక్షల 29 వేల 951 మందికి లబ్ధి చేకూరింది. ► శాసనసభలో ప్రశ్నోత్తారల సందర్భంగా మన ఊరు – మన బడి పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ బడుల్లో 22 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, ఈ స్కూళ్లను మన ఊరు – మన బడి పథకం కింద అభివృద్ధి చేస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ఈ ఒక్క ఏడాదే కొత్తగా 3 లక్షల మంది చేరారని సబిత తెలిపారు. ►సభలో ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా మన ఊరు – మన బడి, కేసీఆర్ కిట్, సింగరేణి కాలరీస్ సంస్థ ప్రయివేటీకరణ, పోడు భూముల పంపిణీ, పల్లెప్రగతి, నూతన ఆస్పత్రుల ఏర్పాటుపై చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిసిన తర్వాత బడ్జెట్ పద్దులపై చర్చ చేపట్టనున్నారు. సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు Telangana Assembly Budget Session 2022 నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. -
‘పార్లమెంట్’పై మోయలేని భారం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా ఎంపీలను రక్షించడంలో భాగంగా వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను కేంద్రం కుదించింది. కేవలం 18 సిట్టింగ్‌లకు మాత్రమే పరిమితం చేసింది. వరుస ప్రభుత్వాల ఆర్థిక అవకతవకలను ఎండగట్టడానికి, ప్రభుత్వాల పనితీరును తూర్పారబట్టడానికి, ప్రజల్లో ఎంపీల పలుకుబడిని పెంచడానికి గత 70 సంవత్సరాలుగా ఎంతో ఉపయోగపడుతూ వస్తోన్న ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మొదటిసారిగా మార్పు చేశారు. ఇరు సభల్లోను మంత్రులను ఎంపీలు మౌఖికంగా అడిగే ప్రశ్నల విధానాన్ని రద్దు చేసి, లిఖిత పూర్వకంగా అడిగి, లిఖిత పూర్వకంగానే సమాధానాలు పొందే విధానాన్ని ప్రవేశపెట్టారు. అలాగే జీరో అవర్‌ను కూడా కుదించారు. జీరో అవర్‌ను 30 నిమిషాలకు పరిమితం చేశారు. ఇక ప్రైవేటు బిల్లులకు సమయాన్నే కేటాయించలేదు. గత కొన్ని పార్లమెంట్ సమావేశాల నుంచి పెండింగ్‌లో పెడుతూ వస్తోన్న 17 బిల్లులను ఈ సమావేశాల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వాటిలో ఆరు బిల్లులను మాత్రమే పార్లమెంటరీ కమిటీలు స్క్రూటినీ చేశాయి. స్క్రూటిని చేయని ఆ 11 బిల్లులను ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎలా ఆమోదిస్తారో ! ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఈ సమావేశాల్లో కొత్తగా మరో 23 బిల్లుల ఆమోదానికి కేంద్రం ప్రతిపాదించింది. వాటిలో 11 బిల్లులు ఆర్డినెన్స్‌లకు సంబంధించినవే ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు అవసరమైన చట్టాలను ఈ ఆర్డినెన్స్‌ల ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులను ఆరు నెలల్లోగా పార్లమెంట్ ఆమోదించక పోయినట్లయితే ఆ ఆర్డినెన్స్‌లు రద్దువుతాయి. (17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్) వీటితోపాటు పలు అనుబంధ పద్దులను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణ కారణంగానైతేనేమీ, దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతీన్న నేపథ్యంలోనేమైతేనేమీ బడ్జెట్ ప్రతిపాదనల్లో లేని విధంగా ఆర్థిక వనరులను ఖర్చు పెట్టడం వల్ల ఈ పద్ధులను పార్లమెంట్ ఆమోదించాల్సి అవసరం ఏర్పడింది. పార్లమెంట్ సమావేశాల్లో కీలక పాత్ర పోషించాల్సిన హోం మంత్రి అమిత్ షా గత ఆరు వారాల్లో మూడు సార్లు ఆస్పత్రి పాలయ్యారు. క్రితం సారి సెప్టెంబర్ 12వ తేదీన ఆస్పత్రి పాలయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయన కోలుకొని ఎప్పటి నుంచి పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాగలరో ఎవరికి అంతు చిక్కడం లేదు. పార్లమెంట్ సమావేశాలపై ఇప్పటికే మోయలేని భారం ఉండగా, కోవిడ్ నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు, దేశ జీడీపీ వృద్ధి రేటు మైనస్ 23.9 శాతానికి పడి పోవడం, సరిహద్దుల్లో యుద్ధానికి కాలు దువ్వుతున్న చైనాను కట్టడికి చర్యలేమిటీ? తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలనుకుంటోన్న ప్రతిపక్షానికి సభా సమయం ఇంకెక్కడి?! (ప్రతి ఎంపీకి డీఆర్డీవో స్పెషల్ కిట్) -
ప్రశ్నోత్తరాల రద్దుపై విపక్షాల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం పట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటుదాని మిత్రపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బ్రిటీష్ హయాం నుంచీ ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయని, సామాన్యుల సమస్యలు లేవనెత్తేందుకు ప్రశ్నోత్తరాలు కీలకమని కాంగ్రెస్ లోక్‌సభపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాలు తొలగించి కొత్త సంప్రదాయానికి తెరలేపారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు చేపట్టాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. సభలో ఎన్నికైన సభ్యులు ప్రశ్నించడం ప్రాథమిక హక్కని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. విపక్షాలు నిరసనల నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా కల్పించుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కరోనా నుంచి మన దేశం త్వరగా కోలుకోవాలని అభిప్రాయపడ్డారు. (ఎంపీలు రెడ్డప్ప, మాధవిలకు పాజిటివ్) చరిత్రలో తొలిసారి ఈ విధంగా సమావేశాలు జరుగుతున్నాయని, అసాధారణ పరిస్థితుల్లో జరిగే సమావేశాలకు సహకరించాలని స్పీకర్ సభ్యులను కోరారు. మధ్యలో పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ కల్పించుకుని సభ్యులకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రశ్నలు లేవనెత్తేందుకు వివిధ రకాల విధానాలు ఉన్నాయన్నారు. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రశ్నోత్తరాల రద్దుపై విపక్ష సభ్యులతోనూ ముందే చర్చించామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గుర్తుచేశారు. సభ్యుల ప్రశ్నలకు తప్పకుండా సమాధానం చెబుతామన్నారు. సభ సజావుగా సాగేందుకు అందరి సహకారం అవసరమని రాజ్‌నాథ్ విజ్ఞప్తి చేశారు. (పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం). -
‘ప్రశ్నోత్తరాల’పై వేటు!
పార్లమెంటు సమావేశాలపుడు రోజూ ఏదో ఒక సమస్యపై వాగ్యుద్ధాలు సాగడం, నినాదాలతో, అరుపులు, కేకలతో దద్దరిల్లడం సర్వసాధారణమైంది. కానీ ఈసారి పార్లమెంటు సమావేశాలకు ముందే అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉండబోదని, జీరో అవర్ వ్యవధి తగ్గిందని లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు ప్రకటించడమే దీనికి మూలం. ప్రశ్నోత్తరాల సమయం అతి ముఖ్యమైనది. చట్టసభల సారమంతా అందులోనే కేంద్రీకృతమైవుంటుంది. దాని నిడివి రోజూ గంట మాత్రమే కావొచ్చు...కానీ అక్కడ ఈటెల్లా దూసుకొచ్చే ప్రశ్నలకు దీటుగా జవాబిచ్చినప్పుడే ప్రభుత్వం సత్తా తేలుతుంది. ఆ సమయాన్ని ఎంత చక్కగా సద్వినియోగపర్చుకున్నారన్నదే విపక్షాల పనితీరుకు గీటురాయి అవుతుంది. వివిధ మంత్రిత్వ శాఖల పనితీరుపై నిశితంగా ప్రశ్నించడం, అవసరమైన సమాచారం రాబట్టడం, సరైన జవాబులు రానిపక్షంలో నిలదీయడం...తగిన చర్యలు తీసుకునేలా వారిని ఒప్పించడం సభ్యులు చేసే పని. ప్రభుత్వం పనితీరు ఎలా వున్నదో, అందులో ఎన్ని లొసుగులు చోటుచేసుకుంటున్నాయో బట్టబయలు చేసేందుకు ఈ ప్రశ్నోత్తరాల సమయం విపక్షాలకు ఆయుధం. చెప్పాలంటే ఇదొక మందుపాతర. పైకి అంతా సవ్యంగా వున్నట్టు కనబడుతుంది. ఉన్నట్టుండి పెనుతుపాను మొదలవుతుంది. ఏదో యధాలాపంగా అడిగినట్టు కనబడే ఒక ప్రశ్న ఒక మంత్రి రాజకీయ భవిష్యత్తును లేదా ఒక ప్రభుత్వం తలరాతను నిర్దేశించే ప్రమాదం కూడా వుంటుంది. పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో హరిదాస్ ముంద్రా అనే వ్యాపారవేత్త కంపెనీలో ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ ఎందుకు పెట్టుబడులు పెట్టాల్సివచ్చిందన్న రాంసుభాగ్ సింగ్ అనే ఎంపీ ప్రశ్న 1957లో ఆనాటి నెహ్రూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఆయనకు అధికారపక్ష ఎంపీగావున్న నెహ్రూ అల్లుడు, ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ తోడవటంతో అది దేశమంతా మార్మోగిపోయింది. ఆ ప్రశ్న వెంబడి చకచకా దూసుకొచ్చిన ప్రశ్నల పరంపరతో ఆ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైంది. తవ్వుతున్నకొద్దీ అదొక కుంభకోణంగా రూపుదిద్దుకుని ఆనాటి ఆర్థికమంత్రి టీటీ కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. చట్టసభల పట్ల ప్రభుత్వాలకుండే జవాబుదారీతనాన్ని బాగా పట్టిచూపేది ప్రశ్నోత్తరాల సమయమే. అక్కడ విపక్షాలు అడిగే ప్రశ్నలు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించవచ్చు. చికాకు పరచవచ్చు. వాటికి నేరుగా జవాబీయకపోవచ్చు. ఏం చేసినా జనానికి ప్రభుత్వ ఆంతర్యం అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రశ్నించేవారు కేవలం తమకుండే సందేహం తీర్చుకోవడం కోసమే ఆ పని చేయరు. ఆ ప్రశ్న ద్వారా, దానిపై తలెత్తే అనేకానేక అనుబంధ ప్రశ్నల ద్వారా ప్రభుత్వ వ్యవహారశైలిని పౌరుల ముందు పరచడం వారి ధ్యేయం. అంతక్రితం మాటేమోగానీ 1991లో లోక్‌సభ, రాజ్యసభల్లోని ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం మొదలుపెట్టాక దీనికి ఎక్కడలేని ప్రాముఖ్యతా వచ్చింది. నేరుగా జనమంతా ఆసక్తిగా చూసేదీ, మీడియా దృష్టి పడేదీ ఈ సమయమే. జీరో అవర్ కూడా ఈ ప్రశ్నోత్తరాల సమయానికి తీసిపోదు. ప్రశ్నోత్తరాల సమయంలో అడిగే ప్రశ్నలకు సంబంధించి పక్షం రోజుల ముందు మంత్రులకు నోటీసు ఇవ్వాల్సివుంటుంది. సభాధ్యక్షుల అనుమతితో అప్పటికప్పుడు ప్రశ్నించడానికి కూడా వీలుంటుంది. జీరో అవర్ కూడా ఇంచుమించు ప్రశ్నోత్తరాల సమయం వంటిదే. అయితే ప్రశ్నోత్తరాల సమయం తరహాలో దీనికి ముందుగా నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదు. సభ్యులు తమ నియోజకవర్గానికి సంబంధించింది అయినా, దేశానికి సంబంధించింది అయినా...ఏ సమస్యనైనా ప్రస్తావించవచ్చు. ప్రభుత్వం ఏమనుకుంటున్నదో తెలుసుకోవచ్చు. ఆ సమస్యపై దృష్టి కేంద్రీకరించేలా చేయొచ్చు. మన పార్లమెంటు సమావేశాలు దాదాపు 175 రోజుల వ్యవధి తర్వాత జరుగుతున్నాయి. గతంలో బడ్జెట్ సమావేశాలకూ, వర్షాకాల సమావేశాలకూ మధ్య ఇంత వ్యవధి ఎప్పుడూ లేదు. కరోనా అనంతర పరిస్థితుల్లో తొలిసారి జరిగే ఈ సమావేశాలు సాఫీగా, సురక్షితంగా సాగడానికి వీలుగా ఉభయసభల అధ్యక్షులూ అన్ని రకాల ముందు జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. సభలో ప్రవేశించే సభ్యులకు, ఇతర అధికారులకు, ఇతరులకు ఆరోగ్య పరీక్షలు చేయడంతో మొదలుపెట్టి, సభలో సభ్యుల స్థానాలమధ్య తగిన దూరం వుండేలా ఏర్పాట్లు చేశారు. సభ్యులు వేర్వేరుచోట్ల కూర్చుని ఆడియో, వీడియో లింకుల ద్వారా సభా కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీలుగా మార్పులు తెచ్చారు. అలాగే ఒకేసారి భారీ సంఖ్యలో ఎంపీలు వుండకుండా చూసేందుకు రోజూ తొలి అర్ధభాగం రాజ్యసభ, మధ్యాహ్నం నుంచి లోక్‌సభ పనిచేసేలా సమావేశాలకు రూపకల్పన చేశారు. సమయాన్ని సమర్థవంతంగా వాడుకోవడానికి వీలుగా ప్రశ్నోత్తరాల సమయం రద్దు, జీరో అవర్ కుదింపు అవసరమయ్యాయన్నది ప్రభుత్వం ఇస్తున్న సంజాయిషీ. అదేమంత సంతృప్తికరంగా లేదు. ఈ సభలో ఆమోదించుకోవాల్సినవి చాలానే వుండొచ్చు. దాదాపు డజను ఆర్డినెన్స్‌ల స్థానంలో ప్రభుత్వం బిల్లులు పెట్టాలి. గత సమావేశాల్లో పెండింగ్ వుండిపోయిన బిల్లులు సరేసరి. సమస్యలైతే చాలానేవున్నాయి. కరోనా కట్టడిలో సాఫల్యవైఫల్యాలు, లాక్డౌన్, రాష్ట్రాలకిచ్చిన తోడ్పాటు, జీఎస్టీ బకాయిలు...ఇలా పెద్ద జాబితా వుంది. ఇప్పుడున్నది అసాధారణ పరిస్థితే కావొచ్చు...కానీ దాన్ని సాకుగా చూపి సభ్యుల నోరు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారన్న నింద పడనీయకుండా చూసుకోవడం కేంద్ర ప్రభుత్వ కర్తవ్యం. ఎందుకంటే ఒక్క చైనా దురాక్రమణ జరిగిన 1962లో తప్ప బ్రిటిష్ కాలంనుంచి ఇంతవరకూ చట్టసభలో ప్రశ్నోత్తరాల సమయం రద్దు లేనేలేదు. అవసరమైతే ఆమోదింపజేసుకునే బిల్లుల సంఖ్యను తగ్గించి అయినా దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలని కేంద్రం గ్రహిస్తే మంచిది. -
గిరిజనులపై నేరాలు.. పట్టించుకోరా?
ఎస్సీ ఎస్టీలపై జరిగే నేరాలు తగ్గినట్లు హోం మంత్రి చెబుతున్నారు గానీ విజయనగరం జిల్లాలో గిరిజనుల మీద నేరాలు ఏమాత్రం తగ్గకపోగా పెరుగుతున్నాయని సాలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. సాలూరులో జనవరిలో ఇద్దరు గిరిజనులను సజీవ దహనం చేశారని, ఫిబ్రవరిలో సాలూరు నియోజకవర్గ పరిధిలోని మెంటాడ మండలంలో గిరిజన మహిళపై లైంగిక దాడి జరిగిందని, మార్చి 19న ఓ గిరిజనుడిని హత్య చేశారని ఆయన చెప్పారు. దళితులు, గిరిజనులపై నేరాలు పదే పదే జరుగుతున్నాయని, అందువల్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. బాధితులను ఆర్థికంగా కూడా ఆదుకోవాలని సూచించారు. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసులు పెట్టి బాధితులకు, ముఖ్యంగా మహిళలకు న్యాయం చేయాలని రాజన్నదొర డిమాండ్ చేశారు. బాధితులలో అమ్మాయిలకు కనీసం ఉపాధి కల్పించాలన్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అత్యాచార బాధితురాలికి పరిహారంగా కేవలం రూ. 50 వేలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని, గిరిజినులు, దళితులపై జరిగే నేరాల్లో బాధితులను ఆర్థికంగా, సామాజికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆయన చెప్పారు. -
త్వరలోనే డీఎస్సీ
హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరనున్నాయి. త్వరలోనే డీఎస్సీ వేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలన్నింటిని భర్తీ చేస్తామని చెప్పారు. మే 1న టెట్ నిర్వహిస్తున్నామని అన్నారు. బుధవారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. గత ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశాయని కడియం అన్నారు. త్వరలోనే విద్యావ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. -
'బ్లాక్‌కు తరలిస్తే జైలు ఊచలు తప్పదు'
హైదరాబాద్: నిత్యావసరాల ధరలకు కళ్లెం వేస్తామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఫుడ్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పారు. బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం ధరల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గతేడాదితో పోలిస్తే బియ్యం ధరలో మార్పులేదని చెప్పారు. ధరలను అదుపుచేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని, ప్రొడక్షన్ పెంచాలని నిర్ణయం తీసుకుందని, ఇందుకోసం రైతులకు ఇంటెన్సివ్ ఇవ్వాలని భావిస్తోందని అన్నారు. అరకొరగా ఉన్న సరుకులను ఎవరైతే బ్లాక్ మార్కెట్ కు తరలించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో వారిపై కేసులు పెడతున్నామని చెప్పారు. పన్నెండు నెలల్లో పన్నెండు సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ధరల నియంత్రణకు సూచనలు చేశారని అన్నారు. ఉల్లి ధరలు పెరిగినప్పుడు సబ్సిడీకే వాటిని అందిచామన్నారు. అక్రమాలకు పాల్పడుతున్నవారిపై గతంలో ఎన్నడూ లేని విధంగా 2500మందిపై కేసులు పెట్టామన్నారు. -
తెలంగాణ బడ్జెట్‌పై కాసేపట్లో వాడి వేడి
హైదరాబాద్: మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుంది. దీని అనంతరం బడ్జెట్‌పై సుధీర్ఘ చర్చ జరగనుంది. నాలుగు రోజులపాటు బడ్జెట్‌పై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ శాసనసభలో 2016-17 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొత్తం రూ.1,30,415 కోట్లతో బడ్జెట్ ప్రకటించారు. ఇందులో ప్రణాళికా వ్యయం రూ.67,630 కోట్లుకాగా, ప్రణాళికేతర వ్యయం 62,785.14 కోట్లుగా ఉంది. వీటిల్లో సాగునీరు, ఆతర్వాత సంక్షేమ రంగానికే అధిక వాటాదక్కింది. -
ఏకపక్ష సభ, పొగడ్తల మోత
ప్రశ్నోత్తరాల సమయం యావత్తూ ‘కీర్త’నలే! హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ శీతాకాల సమావేశాలను బహిష్కరించిన నేపథ్యంలో మంగళవారం సభ వెలవెలబోయింది. కుడివైపు తప్ప ఎడమవైపు ఎవ్వరూ లేకపోవడంతో సభ ఆద్యంతం ఏకపక్షంగా సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పుకోసం అధికార పార్టీ శాసనసభ్యులు ఈ అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుని బృందగానాన్ని తలపించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభలో ప్రవేశిస్తూనే ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. నిత్యం కరవుతో అల్లాడుతున్న రాయలసీమలో ఎల్‌నినో ప్రభావంతో ఇటీవల ఒక్కసారిగా కురిసిన వర్షాలకు భూ గర్భ జలాలు పెరిగితే అది కూడా చంద్రబాబు ‘ప్రతాపమే’ అన్నట్టు కొందరు సభ్యులు పొగిడారు. చంద్రబాబు కృషితో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసిందని ఓ సభ్యుడంటే... ఇంకోసభ్యుడు మరో అడుగు ముందుకేసి రాయలసీమ సహా రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమా పటాలు పెట్టి పూజిస్తున్నారంటూ ప్రభు భక్తి ప్రదర్శించారు. నీరు-చెట్టుపై చంద్రబాబు సోమవారం సభలో ఏమి మాట్లాడారో అవే అంకెల్ని మంత్రి దేవినేని మంగళవారం ఏకరవుపెట్టారు. సాగునీటి పారుదల పథకాలకు గత 16 నెలల కాలంలో రూ.పది వేల కోట్లు కేటాయించిన ఏకైక వ్యక్తి చంద్రబాబేనని చెప్పారు. పట్టిసీమను సాధించిన చంద్రబాబు అపర భగీరథుడని మరో సభ్యుడు పొగడ్తలతో ముంచెత్తారు. సర్ ఆర్ధర్ కాటన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కేఎల్ రావు, శివరామకృష్ణయ్య తర్వాత సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పేరు చంద్రబాబు నాయుడేనని ఓ మంత్రి సాగిలపడ్డారు. ఆ పొగడ్తల్ని విని తట్టుకోలేక సభ నుంచి లాబీల్లోకి వచ్చిన ఓ సీనియర్ నేత... ‘నెల రోజుల కిందటి వరకు మంచినీళ్లు లేక రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అల్లాడిపోయిన విషయం ఏ సభ్యుడికీ గుర్తుకు రాలేదు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పొగడ్తలను చంద్రబాబు వింటే ఆయన సైతం సిగ్గుపడి ఉండేవారేమోనని ఆయన అనడంతో పక్కనున్న వారు పగలబడి నవ్వారు. -
ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు!
-
విపక్ష నేతలను ఆశ్చర్యంలో ముంచిన మోదీ
న్యూఢిల్లీ: లలిత్ గేట్, వ్యాపం కుంభకోణంపై తమ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న ప్రతిపక్ష నాయకులను రాజ్యసభలో నరేంద్ర మోదీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. చైర్మన్ హమిద్ అన్సారీ సభను వాయిదా వేయడానికి ముందు క్వశ్చర్ అవర్ లో మోదీ రాజ్యసభలోకి ప్రవేశించారు. సభ వాయిదా పడిన తర్వాత ప్రతిపక్ష నాయకులకు దగ్గరికి వెళ్లి పేరుపేరునా పలకరించారు. మాజీ ప్రధాని మన్మోహన్ ను పలకరించి చేతులు కలిపారు. తర్వాత ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. వడోదర లోక్ సభ నియోజకవర్గంలో తనపై పోటీ చేసి ఓడిపోయిన మధుసూదన్ మిస్త్రీతో కరచాలనం చేశారు. రాజ్యసభలో విపక్ష ఉపనేత ఆనంద్ శర్మకు నమస్కరిస్తూ పలకరించారు. కరణ్ సింగ్, జయరామ్ రమేశ్ లతో మాట్లాడారు. తర్వాత ట్రెజరీ బెంచీలకు వద్దకు తిరిగొచ్చి సీపీఐ నేత డి.రాజా, తమ పార్టీ ఎంపీలను పలకరించారు. ఈ సందర్భంగా పలువురు గుజరాత్ ఎంపీలు ప్రధానితో మాట్లాడేందుకు పోటీపడ్డారు. పలువురు ఆయన పాదాలను తాకి తమ విధేయత చూపారు. సుష్మ స్వరాజ్, వసుంధర రాజె, శివరాజ్ సింగ్ చౌహాన్ ల రాజీనామాకు పట్టుబడుతూ పార్లమెంట్ ఉభయ సభలను విపక్షాలు అడ్డుకుంటున్న నేపథ్యంలో మోదీ చొరవతో వాతావరణం కాస్త చల్లబడింది. -
ఆడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో క్వశ్చన్ టైమ్
-
రమ్మంటే భయపడుతున్నారు: చంద్రబాబు
-
రమ్మంటే భయపడుతున్నారు: చంద్రబాబు
హైదరాబాద్ : వీలైనంత త్వరగా ప్రభుత్వ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాజధానికి తరలి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఆయన శుక్రవారం శాసనమండలిలో మాట్లాడుతూ త్వరలోనే రాజధాని ప్రాంతంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త రాజధాని ప్రాంతానికి రమ్మంటే అధికారులు భయపడుతున్నారన్నారు. వీలైనంత త్వరలో సిబ్బంది తరలింపు జరుగుతుందన్నారు. గతంలో ఆంధ్రరాష్ట్రానికి మద్రాసు నుంచి కర్నూలుకు అధికారులు కట్టుబట్టలతో వచ్చినట్లుగా ...ఇప్పుడు కొత్త రాజధానికి వచ్చేందుకు అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చంద్రబాబు అన్నారు. పిల్లల చదువులు, హైదరాబాద్‌లో అన్ని ఉండటంతో పాటు 56ఏళ్లుగా ఇక్కడే ఉండటంతో ఏపీ రాజధాని ప్రాంతానికి రమ్మంటేనే భయపడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే గుంటూరు పరిసర ప్రాంతాల్లో సిబ్బందికి అద్దె ఇళ్లు కూడా దొరికే పరిస్థితి లేదన్నారు. కొత్త రాజధానిపై అందరూ ఇష్టాన్ని పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ వచ్చేంతవరకూ పట్టిసీమ పని చేస్తుందని చంద్రబాబు అన్నారు. -
మండలానికి ఒక్క స్కూలే ఉంటే ఎలా?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో క్లస్టర్ స్కూళ్ల ఏర్పాటుతో ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ స్కూళ్ల అంశంపై చర్చ జరిగింది. మండలానికి ఒక్క స్కూలే ఉంటే ఎలా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. పిల్లలకు స్కూల్ దగ్గరగా ఉంటేనే మంచిదని, ఒక కిలోమీటర్‌లోపే పాఠశాల ఉంటే బాగుంటుందన్నారు. స్కూల్ దూరంగా ఉంటే డ్రాప్ అవుట్స్ ఉంటాయని, పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానం ఇస్తూ పిల్లలకు ఇబ్బంది లేకుండా, వారి విద్యకు ఆటంకం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. -
గల్ఫ్ బాధితులను ఆదుకోండి
హైదరాబాద్ : గల్ఫ్ దేశాల్లో తెలుగువారి వెతలపై శుక్రవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన తెలుగువారు అనేక కష్టాలు పడుతున్నారని, శాసనసభ్యులు శ్రీనివాసులు, గొల్లపల్లి సూర్యారావు ...ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. దీనిపై ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమాధానమిస్తూ గల్ఫ్ దేశాల నుంచి 161మందిని వారివారి స్వస్థలాలకు తరలించామన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లినవారిలో ఎక్కువ శాతం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వారే అధికంగా ఉన్నారన్నారు. తాపీ పని, డ్రైవర్లు, పని మనుషులుగా వెళ్లినవారు అధికమని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాయంతో అక్కడ ఉన్నవారిని పైసా ఖర్చు లేకుండా రాష్ట్రానికి తరలించినట్లు చెప్పారు. -
మదనపల్లెలో మరో మెడికల్ కాలేజీకి సహకరిస్తాం
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో ఇప్పటికే రెండు మెడికల్ కాలేజీలున్నాయని అధికార పార్టీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ అన్నారు. మార్కాపురం ఆస్పత్రిని సందర్శించి సమస్యలు తెలుసుకున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జంకె వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ఎవరైనా ఈ జిల్లాలో మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేసేందుకు ముందుకొస్తే సహకరిస్తామని తెలిపారు. మదనపల్లిలో మెడికల్ కాలేజీని పెట్టేందుకు ఎవరైనా వస్తే పరిశీలిస్తామని చెప్పారు. అపోలో వాళ్లు చిత్తూరు జిల్లాలో ఆస్పత్రి పెడతామన్నారని దానికి సహకరిస్తామని చెప్పారు. మదనపల్లెను మెడికల్ హబ్‌గా తీర్చి దిద్దాలని అంతకుముందు తిప్పారెడ్డి డిమాండ్ చేశారు. -
రైతులను అక్రమంగా వేధిస్తున్నారు..
-
రైతులను అక్రమంగా వేధిస్తున్నారు..
హైదరాబాద్ : రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు అంశాలపై అధికార పక్షాన్ని శుక్రవారం ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రైతుల సమస్యలతో పాటు వారిపై అక్రమ కేసులు బనాయించి, వేధిస్తున్నారంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానమిచ్చారు. రైతులపై అక్రమంగా కేసులు బనాయించలేదని, అక్రమాలు జరిగాయనే ఆరోపణలతోనే విచారణ జరుపుతున్నారని, ఒకవేళ అక్రమమని తేలితే రైతులపై కేసులు తీసివేయటం జరుగుతుందన్నారు. -
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధింత మంత్రులు సమాధానమిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. -
నేటితో ముగియనున్న బడ్జెట్ చర్చ
హైదరాబాద్: బడ్జెట్ పై చివరి రోజు చర్చలో భాగంగా గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉదయం ప్రారంభించబోయే ప్రశ్నోత్తరాల సమయం రద్దైంది. దాని స్థానంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై చర్చను కొనసాగించనున్నారు. బడ్జెట్ పై చర్చను ప్రతిపక్షనేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం బడ్జెట్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సమాధానమిస్తారు. బడ్జెట్ పై జరుగుతున్న చర్చ నేటితో ముగియనుంది. -
టీ అసెంబ్లీ ప్రారంభం, కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమైనాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు సమయం కొనసాగుతోంది. బడ్జెట్‌పై ఈరోజు కూడా పలువురు సభ్యులు ప్రసంగించనున్నారు. ఇప్పటికే వివిధ అంశాలపై తెలంగాణ అసెంబ్లీలో పలు రాజకీయ పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వేతన సవరణ బకాయిలు బాండ్ల రూపంలో ఇవ్వడంపై బీజేపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ వాయిదా తీర్మానం ఇచ్చింది. అలాగే వీఆర్ఏల వేతనాల అంశంపై సీపీఎం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. -
సభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
-
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ మధుసూదనా చారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానం ఇస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ తీరుపై చర్చించాలని శాసనమండలిలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. సమావేశాలు ప్రారంభం కాగానే ఈ అంశంపై చర్చకు పట్టుబట్టింది. అయితే ఆ అంశం తన పరిశీలనలో ఉందని కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. -
శుక్ర,శనివారాల్లో ప్రశ్నోత్తరాలు రద్దు
హైదరాబాద్ : .బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 29 వరకూ శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. అలాగే శుక్ర, శనివారాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. అలాగే ఈనెల 28న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ...చివరి రోజున ప్రాధాన్యత గల అంశాలపై చర్చించనుంది. మరోవైపు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై సభలో నేడు చర్చ జరగనుంది. -
వారం తర్వాత సభకు టీ.టీడీపీ సభ్యులు
-
వారం తర్వాత సభకు టీ.టీడీపీ సభ్యులు
హైదరాబాద్ : వారం రోజుల పాటు సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు గురువారం శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. కాగా ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ మధుసుదనా చారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. చెరువుల అభివృద్ధిపై ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. మరోవైపు సస్పెన్షన్‌కు గురై మళ్లీ సభలోకి ఎంటర్ కానున్న వేళ తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిన్న పార్టీ అధినేత చంద్రబాబుతో భేటి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో దాదాపు మూడు గంటలపాటు సమాలోచనలు సాగాయి. అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్ వ్యవహారిస్తున్న తీరును అధినేతకు ఎమ్మెల్యేలు వివరించినట్టు సమాచారం. ఫిరాయింపుల వ్యవహారం ఈ సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించినా ఇంతవరకు స్పీకర్, మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేయకపోవడంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇది తప్పుడు సంకేతాలు పంపుతుందని స్పష్టం చేసినట్టు సమాచారం. తక్షణం ఫిర్యాదు చేయాలని, అవసరమైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. -
అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
-
తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ మధుసుదనా చారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సాగునీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు. కొరట్పల్లి గ్రామాస్తుల వ్యతిరేకత వల్ల ప్రాజెక్ట్ పనులు సాగలేదని తెలిపారు. కాగా అంతకు ముందు ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గంలో ప్రాజెక్టులు చేపట్టాలని కోరారు. మోతె ప్రాజెక్ట్ కింద 2700 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయని అన్నారు. -
తెలంగాణ రాష్ట్రం బలహీన వర్గాలకు నిలయం
-
తెలంగాణ రాష్ట్రం బలహీన వర్గాలకు నిలయం: ఈటెల
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం బలహీన వర్గాలకు నిలయమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ నిరుపేద వర్గాలను ఆదుకోవటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిజమైన లబ్దిదారులకు న్యాయం జరగటం లేదన్నారు. లబ్దిదారుల ఎంపికలో బ్యాంకులను పక్కన పెట్టాలని సూచించారు. -
ఉభయ సభల్లో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు మంగళవారం ప్రారంభమైయ్యాయి. ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ మధుసూదనా చారి ప్రశ్నోత్తరాలకు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవోలతోనే సరిపెట్టిందని, అన్ని సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్నిరకాలుగా ప్రజలను ఆదుకుంటామని ఈటెల ఈ సందర్భంగా సభలో హామీ ఇచ్చారు. కాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై వైఎస్ఆర్ సీపీ, గిరిజనులకు మూడు ఎకరాల భూమి పంపిణీపై సీపీఎం, సీపీఐ, పెన్షన్లు, ఆహార భద్రతపై టీడీపీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, ఉద్యోగుల భర్తీపై బీజేపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. -
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
-
తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు సోమవారం ప్రారంభయ్యాయి. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలకు స్పీకర్ మధుసుదనా చారి అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రుణాలపై బ్యాంకులన్నిటింకి ఏకత్వ ప్రతిపాదన ఉండాలని సభలో కోరారు. రైతులను కొన్ని బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నాయని ఆయన సభ దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం ఇచ్చారు. -
ప్రశ్నోత్తరాల్లో రైతు రుణమాఫీపై ప్రస్తావన
-
ప్రశ్నోత్తరాల్లో రైతు రుణమాఫీపై ప్రస్తావన
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సోమవారం రైతు రుణమాఫీ, ఐటీ రంగ అభివృద్ధి, పంటలకు మద్ధతు ధర, తెలంగాణ కోరంలో పాఠ్యపుస్తకాల సమీక్ష తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. కాగా ఫాస్ట్ పథకానికి సంబంధించి అస్పష్టతపై బీజేపీ, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కాగా నేడు సభలో బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది. మరోవైపు సాయంత్రం నాలుగు గంటలకు రైతు ఆత్మహత్యలు.. విద్యుత్ సంక్షోభంపై చర్చకు అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. ఇక ప్రతిపక్షాలపై ఎదురు దాడికి అధికారపక్షం వ్యూహం సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం టీఆర్ఎస్ వ్యూహరచన కమిటీ సమావేశమైంది. -
బాబు హయాంలో రైతుల్ని పిట్టల్లా కాల్చారు : హరీష్
హైదరాబాద్ : ప్రశ్నోత్తరాలు కార్యక్రమంలో విద్యుత్‌పైనే ప్రశ్నలు ఉన్నాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ విద్యుత్ సమస్యలపై సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయినా విపక్ష సభ్యులు సభను అడ్డుకోవటం సరికాదన్నారు. సభ నుంచి సస్పెండ్ చేయించుకుని బయటకు వెళ్లాలన్నది ప్రతిపక్ష సభ్యుల ఉద్దేశంగా కనిపిస్తోందని హరీష్ రావు అన్నారు. గజ్వేల్ ఘటనలపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. చంద్రబాబు హయంలో కరెంట్ అడిగిన రైతులను పిట్టల్లా కాల్చారని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. చర్చకు తాము వెనక్కి పోవటం లేదని, సభను అడ్డుకోవటానికి టీడీపీ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. సభా సమయాన్ని వృథా చేయాలనుకోవటం లేదన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాన్ని ఇవ్వొద్దని హరీష్ రావు అన్నారు. -
మైనార్టీల సంక్షేమానికి ఏం చేస్తున్నారు?
హైదరాబాద్: మైనార్టీల సంక్షేమంపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, చాంద్‌బాషా, ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని అడిగారు. ఈ ప్రశ్నకు ఐటీ, సమాచార, పౌర సరఫరాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమాధానమిచ్చారు. మైనార్టీలకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం విధివిధానాలు పరిశీలిస్తున్నామని మంత్రి శాసనసభలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగడంతో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలు అంశాలు సభలో లేవనెత్తారు. మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టారు. -
బార్లు వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి
-
రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చేశారు
-
ఒకటి రెండుసార్లు నేను కూడా కొన్నాను
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సోమవారం హైవేలు, రోడ్డు ప్రమాదాల నివారణపై చర్చ జరిగింది. అలాగే జాతీయ రహదారులపై బార్లు వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని విశాఖ ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకు వచ్చారు. వాహనాలు నడిపే డ్రైవర్లు కొందరు మద్యానికి బానిసలై వుండడంతో రాత్రిపూట హైవేలపై ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. బార్లు ఆకర్షించేలా ఉండటం వల్ల ....తాను కూడా ఒకటి, రెండుసార్లు మద్యం కొన్నానని విష్ణుకుమార్ రాజు అన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, బార్లను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యుల అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. హైవేలు, రోడ్డు ప్రమాదాల నివారణకు కచ్చితమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. రోడ్డు ప్రమాదాల్లో రోజూ పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని.. పలువురు సభ్యులు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు ఎ.సురేష్, గొట్టిపాటి రవికుమార్‌తో పాటు, పి.విష్ణుకుమార్‌రాజు, రామారావు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు ఇదే విషయంపై వివరణ కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నామని.. భవిష్యత్‌లో మరింత దృష్టి పెడతామని ప్రభుత్వం సమాధానమిచ్చింది. -
రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చేశారు?
హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం శానససభలో ప్రస్తావించారు. రోడ్డు ప్రమాదాల్లో రోజూ పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. హైవేలు, రహదారులపై ప్రమాదాల నివాణకు కచ్చితమైన చర్యలు తీసుకుంటామని రోడ్లు భవనాలశాఖ మంత్రి శిద్దా రాఘవరావు శిద్దా రాఘవరావు హామీయిచ్చారు. ఇప్పటికే పలు చర్యలు చేపట్టామని, భవిష్యత్ లో మరింత దృష్టి పెడతామని ఆయన తెలిపారు. -
నకిలీ విత్తనాలపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ
అసెంబ్లీ సమావేశాల రెండో రోజున నకిలీ విత్తనాల విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వ్యవసాయ శాఖ మంత్రిని గట్టిగా నిలదీశారు. ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా అడిగిన తొలిప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసి, మరిన్ని అనుబంధ ప్రశ్నలు వేశారు. రవికుమార్ ఏమన్నారంటే.. ''నకిలీ విత్తనాల గురించి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు తయారుచేసి 400-500 రూపాయల వంతున అమాయకులైన రైతులకు అంటగడుతున్నారు. పర్యవేక్షణ బాగా చేస్తున్నామన్నారు. కానీ, ఇది సరిగా లేకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం వాస్తవం కాదా? విత్తనాలు సరఫరా చేసేటప్పుడు పర్యవేక్షణ ఏమాత్రం లేని మాట సంగతేంటి? భారీస్థాయిలో నకిలీ విత్తనాలు సరఫరా అయ్యే అవకాశం ఉందా.. లేదా? కోల్డ్ స్టోరేజిలో నిల్వ ఉంచిన విత్తనాలను అధికారులు రైతులకు సరఫరా చేస్తున్నారు. వాస్తవానికి మంచి రైతుల వద్దకు వెళ్లి వారి నుంచి విత్తనాలు సేకరించి సరఫరా చేయాలి. కానీ నెలల తరబడి నిల్వ ఉంచిన విత్తనాలను సరఫరా చేయడం వల్ల దిగుబడులు ఘోరంగా దెబ్బతింటున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ తరహా సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. విత్తనాల సరఫరా విషయంలో ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యలేంటి? అలాగే ఎన్ని వేల టన్నుల విత్తనాలను జిల్లాలకు సరఫరా చేశారు, నాణ్యత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ సంవత్సరం వ్యవసాయ పరంగా రాష్ట్ర రైతాంగానికి ఏ భరోసా ఇవ్వబోతున్నారు'' అని శరపరంపరగా ప్రశ్నలు సంధించారు. -
ప్రశ్నోత్తరాలను అడ్డుకుంటాం: సీమాంధ్ర ఎంపీలు
న్యూఢిల్లీ: సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవాలని సీమాంధ్ర ఎంపీలు నిర్ణయించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు ఉదయం ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంట్లో కేవలం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని అడ్డుకుంటామని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ఎంపీలు హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎస్పీవై రెడ్డి, కనుమూరి బాపిరాజు తదితరులు హాజరయ్యారు.