తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ మధుసుదనా చారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ మధుసుదనా చారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సాగునీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు. కొరట్పల్లి గ్రామాస్తుల వ్యతిరేకత వల్ల ప్రాజెక్ట్ పనులు సాగలేదని తెలిపారు. కాగా అంతకు ముందు ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గంలో ప్రాజెక్టులు చేపట్టాలని కోరారు. మోతె ప్రాజెక్ట్ కింద 2700 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయని అన్నారు.