'బ్లాక్కు తరలిస్తే జైలు ఊచలు తప్పదు' | eatela rajender warns black markets | Sakshi
Sakshi News home page

'బ్లాక్కు తరలిస్తే జైలు ఊచలు తప్పదు'

Published Wed, Mar 16 2016 10:34 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

'బ్లాక్కు తరలిస్తే జైలు ఊచలు తప్పదు' - Sakshi

'బ్లాక్కు తరలిస్తే జైలు ఊచలు తప్పదు'

హైదరాబాద్: నిత్యావసరాల ధరలకు కళ్లెం వేస్తామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఫుడ్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పారు. బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం ధరల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గతేడాదితో పోలిస్తే బియ్యం ధరలో మార్పులేదని చెప్పారు. ధరలను అదుపుచేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని, ప్రొడక్షన్ పెంచాలని నిర్ణయం తీసుకుందని, ఇందుకోసం రైతులకు ఇంటెన్సివ్ ఇవ్వాలని భావిస్తోందని అన్నారు.

అరకొరగా ఉన్న సరుకులను ఎవరైతే బ్లాక్ మార్కెట్ కు తరలించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో వారిపై కేసులు పెడతున్నామని చెప్పారు. పన్నెండు నెలల్లో పన్నెండు సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ధరల నియంత్రణకు సూచనలు చేశారని అన్నారు. ఉల్లి ధరలు పెరిగినప్పుడు సబ్సిడీకే వాటిని అందిచామన్నారు. అక్రమాలకు పాల్పడుతున్నవారిపై గతంలో ఎన్నడూ లేని విధంగా 2500మందిపై కేసులు పెట్టామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement