eatela rajender
-
'వారితోనే మేం ఉద్యమించింది.. ఎలా విస్మరిస్తాం..'
హైదరాబాద్: నిరుద్యోగ సమస్య ప్రతిపక్షానిది కాదని, అధికార పక్షానిదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఎందుకంటే.. ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారంత ప్రత్యేక రాష్ట్రం కోసం తమతో కలిసి ఉద్యమాలు చేసినవారేనని, వారి సమస్యలను తీర్చడంలో ప్రభుత్వంపరంగా తమపై ఎక్కువగా బాధ్యత ఉందని చెప్పారు. వారిని వెంటేసుకునే ఉద్యమంలో ముందుకు వెళ్లామని ఈటెల చెప్పారు. ప్రతిపక్షం సమస్యల నుంచి లబ్ది పొందాలని ఆశించొద్దని హితవు పలికారు. ఇప్పటి వరకు 11 వేల ఉద్యోగాలు నింపామని, 18 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని, డీఎస్సీ ద్వారా 10 వేలకు పైగా పోస్టులు త్వరలో వేస్తున్నామని ఇలా మొత్తం ఇప్పటికే 50 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని ఆయన సభకు చెప్పారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు 25,589 మంది ఉన్నారని చెప్పారు. ఔట్ సోర్సింగ్ ద్వారా ప్రభుత్వంపై అదనంగా 310కోట్ల భారం పడుతుందని వెల్లడించారు. -
'బ్లాక్‌కు తరలిస్తే జైలు ఊచలు తప్పదు'
హైదరాబాద్: నిత్యావసరాల ధరలకు కళ్లెం వేస్తామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఫుడ్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పారు. బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం ధరల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గతేడాదితో పోలిస్తే బియ్యం ధరలో మార్పులేదని చెప్పారు. ధరలను అదుపుచేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని, ప్రొడక్షన్ పెంచాలని నిర్ణయం తీసుకుందని, ఇందుకోసం రైతులకు ఇంటెన్సివ్ ఇవ్వాలని భావిస్తోందని అన్నారు. అరకొరగా ఉన్న సరుకులను ఎవరైతే బ్లాక్ మార్కెట్ కు తరలించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో వారిపై కేసులు పెడతున్నామని చెప్పారు. పన్నెండు నెలల్లో పన్నెండు సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ధరల నియంత్రణకు సూచనలు చేశారని అన్నారు. ఉల్లి ధరలు పెరిగినప్పుడు సబ్సిడీకే వాటిని అందిచామన్నారు. అక్రమాలకు పాల్పడుతున్నవారిపై గతంలో ఎన్నడూ లేని విధంగా 2500మందిపై కేసులు పెట్టామన్నారు.