హైదరాబాద్: నిరుద్యోగ సమస్య ప్రతిపక్షానిది కాదని, అధికార పక్షానిదని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఎందుకంటే.. ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారంత ప్రత్యేక రాష్ట్రం కోసం తమతో కలిసి ఉద్యమాలు చేసినవారేనని, వారి సమస్యలను తీర్చడంలో ప్రభుత్వంపరంగా తమపై ఎక్కువగా బాధ్యత ఉందని చెప్పారు.
వారిని వెంటేసుకునే ఉద్యమంలో ముందుకు వెళ్లామని ఈటెల చెప్పారు. ప్రతిపక్షం సమస్యల నుంచి లబ్ది పొందాలని ఆశించొద్దని హితవు పలికారు. ఇప్పటి వరకు 11 వేల ఉద్యోగాలు నింపామని, 18 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని, డీఎస్సీ ద్వారా 10 వేలకు పైగా పోస్టులు త్వరలో వేస్తున్నామని ఇలా మొత్తం ఇప్పటికే 50 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని ఆయన సభకు చెప్పారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు 25,589 మంది ఉన్నారని చెప్పారు. ఔట్ సోర్సింగ్ ద్వారా ప్రభుత్వంపై అదనంగా 310కోట్ల భారం పడుతుందని వెల్లడించారు.
'వారితోనే మేం ఉద్యమించింది.. ఎలా విస్మరిస్తాం..'
Published Fri, Mar 18 2016 12:33 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
Advertisement
Advertisement