'ఏటి మల్లన్న.. బోడి మల్లన్న అన్నట్లుంది' | hot debate in telangana assemly about employement | Sakshi
Sakshi News home page

'ఏటి మల్లన్న.. బోడి మల్లన్న అన్నట్లుంది'అ

Published Fri, Mar 18 2016 11:46 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

'ఏటి మల్లన్న.. బోడి మల్లన్న అన్నట్లుంది' - Sakshi

'ఏటి మల్లన్న.. బోడి మల్లన్న అన్నట్లుంది'

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నిరుద్యోగ సమస్యపై వాడి వేడి చర్చ జరిగింది. బీజేపీ నేత కే లక్ష్మణ్ ఈ సమస్యపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీరు ఏరు దాటిందాక ఏటి మల్లన్న ఏరు దాటినంక బోడిమల్లన్న అన్న తీరుగా ఉందని అన్నారు. ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

హేతుబద్దీకరణ పేరిట ఉన్న ఉద్యోగాలు లేకుండా చేసి ప్రభుత్వ పాఠశాలలు మూతపడిపోయేలా చేస్తున్నారే తప్ప ఆ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచి తిరిగి ఉపాధ్యాయ పోస్టులు నింపాలన్న ఆలోచన మాత్రం చేయడం లేదని అన్నారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలేమిటి ఇప్పుడు చేస్తున్నదేమిటి అని ప్రశ్నించారు. లక్షా ఏడు వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిన మీరు అందులో ఎన్ని భర్తీ చేస్తున్నారో ఎప్పుడు భర్తీ చేస్తారో స్పష్టం చేయలేదన్నారు. ఇప్పటి వరకు డీఎస్సీ, జేఎల్, డీఎల్, గ్రూప్స్ పై స్పష్టతనివ్వలేదని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement