employement
-
ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు!
ప్రముఖ ఐటీ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ 2024లో సుమారు 6000 నుంచి 8000 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కంపెనీ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ బాలసుబ్రమణియన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా కంపెనీ వర్క్‌ఫోర్స్‌ను విస్తరించాలని భావిస్తున్నాం. ప్రతిభావంతులైన వ్యక్తులను ఆకర్షించడానికి కంపెనీ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తుంది. ఇండియా, యూఎస్, కెనడా, మెక్సికో, యూకేతో సహా వివిధ దేశాలలో 2024లో 6,000 నుంచి 8,000 మంది ఉద్యోగులను నియమిస్తాం. భారత్‌లో హైదరాబాద్, నోయిడా, కోయంబత్తూర్, దెహ్రాదూన్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని కంపెనీ కార్యాలయాల్లో ఉద్యోగులను నియమించాలని నిర్ణయించాం. టెక్ లీడ్స్, ఆటోమేషన్ టెస్టింగ్ స్పెషలిస్ట్‌లు, ఏఈఎం ఆర్కిటెక్ట్‌లు, బిగ్ డేటా లీడ్స్, వర్క్‌డే ఫైనాన్షియల్ కన్సల్టెంట్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది’ అన్నారు.‘నగరాల వారీగా నిర్దిష్ట నియామకాలు ఉంటాయి. హైదరాబాద్, నోయిడా కార్యాలయాల్లో ఐసీఎస్ఎం, హెచ్ఆర్ఎస్డీ, ఫ్రంట్‌ఎండ్, ఎంఎస్డీ, జావా ఎఫ్ఎస్డీ, డాట్నెట్ ఎఫ్ఎస్డీ విభాగాల్లో ఉద్యోగులను నియమిస్తాం. కోయంబత్తూర్, బెంగళూరులో అజూర్ డేటాబ్రిక్స్, పైథాన్ ఏడీఎఫ్ వంటి టెక్నాలజీ నిపుణులకు ప్రాధాన్యం ఇస్తాం. యూఎస్‌లో ఆటోమేషన్ నైపుణ్యం కలిగిన క్లౌడ్ అప్లికేషన్ ఆర్కిటెక్ట్‌లు అవసరం. జావా ఫుల్-స్టాక్ ఇంజినీర్లు, టెస్ట్ అనలిస్ట్‌లు (ఎస్‌డీఈటీ), సీనియర్ జావా ఫుల్-స్టాక్ డెవలపర్లను నియమించాలని యోచిస్తున్నాం. యూకేలో టెస్ట్ మేనేజర్లను (మాన్యువల్, ఆటోమేషన్), డెవొప్స్(అజూర్), సర్వీస్ డెస్క్ ప్రొఫెషనల్స్, ఫుల్-స్టాక్ డెవలపర్లకు (జావా, డాట్నెట్) అవకాశం ఇస్తాం’ అని బాలసుబ్రమణియన్ తెలిపారు.ఇదీ చదవండి: ఫోన్ పే, జీపే, పేటీఎం.. ద్వారా విద్యుత్తు బిల్లు చెల్లించకూడదుఅంతర్జాతీయంగా ప్రముఖ ఐటీ సంస్థలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు మాత్రం కొత్తవారికి అవకాశం కల్పిస్తుండడం మంచి పరిణామమని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ రానున్న సమావేశాల్లో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే ఐటీ రంగం ఊపందుకుంటుందని అభిప్రాయ పడుతున్నారు. -
బొగ్గు గనుల మూసివేత పరిణామాలేమిటి? కూలీలు ఏం చెయ్యాలి?
చాలామంది కూలీలు ఉపాధి కోసం బొగ్గు గనుల్లో పనులు చేస్తుంటారు. తమ ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను పక్కనపెట్టి ఈ పనుల్లో పాల్గొంటారు. గ్లోబల్ ఎనర్జీ మానిటర్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం బొగ్గు గనుల మూసివేత కారణంగా 9,90,200 మంది ఉపాధి కోల్పోనున్నారు. ప్రపంచంలోని పలు బొగ్గు గనులు 2035కు ముందుగానే మూసివేయనున్నారు. బొగ్గు గనుల మూసివేత ప్రభావం ముఖ్యంగా భారత్, చైనాలపై అధికంగా ఉండనుంది. దీని గరిష్ట ప్రభావం చైనాలోని షాంగ్సీలో కనిపించనుంది. 2050 నాటికి బొగ్గు తవ్వకాలకు సంబంధించి దాదాపు 2,41,900 ఉద్యోగాలు మాయం కానున్నాయి. మన దేశంలో మొత్తం 3,37,000 మంది కార్మికులు బొగ్గు తవ్వకాల పనుల్లో పాల్గొంటున్నారు. కార్మికుల తొలగింపుల విషయానికొస్తే కోల్ ఇండియా కంపెనీ పేరు ముందంజలో వస్తుంది. ఇది రాబోయే ఐదేళ్లలో 73,800 మంది కార్మికులను తొలగించనుందని సమాచారం. శిలాజ ఇంధనాల కాలుష్య స్థాయిలను తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను ఆపడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా ముందడుగు వేస్తూ బొగ్గు వినియోగాన్ని భారీగా తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తామని భారతదేశం గతంలో హామీ ఇచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కోల్ ఇండియా పునరుత్పాదక ఇంధనంపై దృష్టి సారించే లక్ష్యంతో పని చేస్తోంది. ఇదిలావుండగా 2022 నాటికి భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో సుమారు 9.88 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలుస్తోంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇందులో కేవలం 4.66 లక్షల మంది జలవిద్యుత్‌లో ఉపాధి పొందుతుండగా, సోలార్ పివిలో 2.82 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. బొగ్గు గనుల్లో పని చేసే కూలీలు ఉపాధి కోల్పోక ముందుగానే వారికి ఇతర ఉపాధి పనులను నేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తద్వారా వారు జీవనోపాధి పొందగలుగుతారు. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: పెన్షన్ సొమ్ము కోసం భర్తకు నిప్పు! -
రూ.13,000 కోట్ల పీఎల్ఐ ప్రోత్సాహకాలు: 4 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం కింద అర్హత కలిగిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ.13,000 కోట్లను మంజూరు చేయనుంది. ఇక మీదట పీఎల్ఐ కింద ఏటా ఇచ్చే ప్రోత్సాహకాల మొత్తం గణనీయంగా ఉంటుందని పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది ఇలా విడుదల చేసే మొత్తం రూ.13వేల కోట్లుగా ఉండొచ్చన్నారు. పీఎల్ఐ కింద కేంద్ర సర్కారు 14 రంగాలకు ప్రోత్సహకాలను ఇప్పటి వరకు ప్రకటించగా, మరిన్ని రంగాలు సైతం ప్రోత్సాహకాల కోసం డిమాండ్ చేస్తున్నాయి.(గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) టెలీకమ్యూనికేషన్స్, వైట్ గూడ్స్, టెక్స్టైల్స్, వైద్య ఉపకరణాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఫుడ్ ఉత్పత్తులు, అధిక సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్లు, ఫార్మా రంగాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయితే వీటిల్లో సోలార్ పీవీ మాడ్యూళ్లు, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలు, టెక్స్టైల్ ఉత్పత్తులు, స్పెషాలిటీ స్టీల్ రంగాలకు పీఎల్ఐ కింద ప్రోత్సాహకాల విడుదల మొదలు కావాల్సి ఉంది. దేశీయ తయారీని పెంచడం, దిగుమతులు తగ్గించడం, అంతర్జాతీయంగా ఎగుమతుల్లో పోటీ పడడం అనే లక్ష్యాలతో కేంద్ర సర్కారు 2021లో పీఎల్ఐ పథకాన్ని తీసుకురావడం గమనార్హం. (Fraud Alert: కస్టమ్స్ డ్యూటీ, వారికి బలైపోకండి!) 4 లక్షల మందికి ఉపాధి.. పర్యావరణ అనుమతుల్లో జాప్యం, చైనా నుంచి నిపుణుల సాయం పొందేందుకు వీసా మంజూరులో సమస్యలను భాగస్వాములు ప్రస్తావించారని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. పీఎల్ఐ కింద ఇప్పటికే రూ.78వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రూ.6 లక్షల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయని వెల్లడించారు. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చినట్టు తెలిపారు. ఆటబొమ్మలు, ఇతర రంగాలకు పీఎల్ఐ అభ్యర్థనలు అంతర్గత మంత్రిత్వ శాఖల పరిశీలనలో ఉన్నట్టు సింగ్ పేర్కొన్నారు. ఇటీవలే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు అమలు చేయగా, తర్వాత అక్టోబర్ 31 వరకు వాయిదా వేయడం తెలిసిందే. దీనిపై సింగ్ మాట్లాడుతూ.. ఇది స్వేచ్ఛాయుత లైసెన్సింగ్ విధానమని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. దీని పట్ల పెద్దగా ఆందోళన అవసరం లేదన్నారు. -
ఒడిశా ప్రమాదం.. రైలు బండి నడిపే వారెక్కడ?
దక్షిణమధ్య రైల్వేలో రోజూ సుమారు 600 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 10 లక్షల మందికిపైగా ప్రయాణం సాగిస్తుంటారు. అన్ని డివిజన్ల పరిధిలో 3,800 వరకు లోకో పైలెట్లు, సహాయ లోకోపైలెట్లు, షంటర్లు పని చేయవలసి ఉండగా ప్రస్తుతం 2384 మంది మాత్రమే ఉన్నారు.1,416 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే కనీసం వెయ్యి మంది అదనంగా ఉండాల్సిన చోట వెయ్యి మందికిపైగా కొరత ఉండడం గమనార్హం. కొంతకాలంగా లోకోపైలెట్ల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో ఉన్నవాళ్లపైనే పనిభారం అధికమవుతోంది. ‘లింక్’ లేని డ్యూటీలు సాధారణంగా ఒక లోకోపైలెట్ తన విధి నిర్వహణలో 8 గంటలు పనిచేసి 6 గంటల విశ్రాంతి తీసుకోవాలి. తరువాత మరో 8 గంటలు పని ఉంటుంది. తిరిగి 6 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. డ్యూటీ ముగిసిన తరువాత 16 గంటల పాటు విశ్రాంతి ఉండాలి. ప్రతి 72 గంటలకు ఒక రోజు సెలవు చొప్పున, ప్రతి 14 రోజులకు ఒక 24 గంటల పూర్తి విశ్రాంతి చొప్పున లోకోపైలెట్ లింక్ (విధి నిర్వహణ) ఉండాలి. ►కానీ ఈ లింక్‌కు పూర్తి విరుద్ధంగా 6 గంటలకు బదులు 4 గంటల విశ్రాంతే లభిస్తోందని లోకోపైలెట్లు అంటున్నారు. వరుసగా రాత్రిళ్లు పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వారానికి ఒకరోజు రాత్రి పూర్తిగా విశ్రాంతి ఉండాలి. కానీ ప్రస్తుతం రాత్రి పూట నిద్రకు నోచని ఎంతోమంది తీవ్ర ఒత్తిళ్ల నడుమ పనిచేస్తున్నారు. ►అనారోగ్యం కారణంగా కూడా సెలవులు లభించడం లేదు. లాలాగూడ రైల్వే ఆసుపత్రి డాక్టర్లు ఫోన్లోనే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. బాగానే ఉన్నావు డ్యూటీకి వెళ్లొచ్చని చెబుతున్నారు.’.. అని సికింద్రాబాద్ డిపోకు చెందిన అసిస్టెంట్ లోకోపైలెట్ ఒకరు చెప్పారు. ‘సేఫ్టీ’ ఎలా.. ►సిగ్నల్స్ కనిపెట్టడం, కాషన్ ఆర్డర్స్‌ను అనుసరించడం, ట్రాక్‌లు మార్చడం, వేగాన్ని అదుపు చేయడం.. ఇలా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇందుకు లోకోపైలెట్లకు ఏకాగ్రత, ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. ►కానీ ప్రతి క్షణం వెంటాడే ఒత్తిడి, నిద్ర లేమి వల్ల రైల్వే మాన్యువల్‌కు విరుద్ధమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నామని రైఅంటున్నారు. ఒత్తిడే ప్రమాదాలకు కారణం? ►తరచూ హెచ్చరిక సిగ్నళ్లను (సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్) సైతం ఉల్లంఘిస్తూ రైలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. రైళ్లు పట్టాలు తప్పే సందర్భాల్లో ఇలాంటి ఒత్తిడే ప్రధాన కారణమవుతున్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సికింద్రాబాద్ డిపోలోనూ కొరత దక్షిణమధ్య రైల్వేలోనే కీలకమైన సికింద్రాబాద్ డిపోలో 578 మంది లోకోపైలెట్లు పని చేయవలసి ఉండగా 343 మంది మాత్రమే ఉన్నారు. 235 ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో గూడ్స్ రైళ్లు నడపాల్సిన వాళ్లు ఎక్స్‌ప్రెస్‌లు, మెయిల్ సర్వీసులు నడుపుతున్నారు. షంటర్లు ఎంఎంటీఎస్‌లు, ప్యాసింజర్ రైళ్లు నడుపుతున్నారు. -
ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు?.. మీ పనికీ, జీవితానికీ మధ్య సమతుల్యత ఉందా?
మీరు ఉద్యోగం ఎందుకు చేస్తున్నారని ఎవరినైనా అడిగామనుకోండి! జీతం కోసం పని చేస్తున్నామని కొందరు, మెరుగైన జీవితం కోసమని మరికొందరు సమాధానం చెబుతారు. ఇలా పది మందిని అడిగితే ఎవరికి తోచిన సమాధానం వారు చెబుతారు. మరి... ఆర్థిక మాంద్యం, ఉద్యోగ భయం వెన్నాడుతున్న ప్రస్తుత తరుణంలో ఉద్యోగుల మనోభావాలేంటి?బడాబడా కంపెనీలే వేలకు వేల మందికి క్షణాల్లో ఉద్వాసన పలుకుతున్న సందర్భంలో ఉద్యోగులు ఏమనుకుంటున్నారు? ఉన్న ఉద్యోగం ఊడకుండా ఉంటే చాలు భగవంతుడా అని అంటున్నారా? ఏమైనా ఫరవాలేదని ధీమాగా ఉన్నారా? రాండ్‌స్టాడ్స్ అనే కంపెనీ 15 దేశాల్లో సుమారు 35 వేల మందిని ప్రశ్నించి మరీ కనుక్కున్న ఆ విషయాలేంటో చూద్దాం. అత్యధికుల్లో కనిపించని బెంగ ఆర్థిక మాంద్యం వచ్చేస్తోందన్న భయం ఉద్యోగుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఉద్యోగం పోతుందన్న బెంగ ఉందని 37 శాతం మంది చెప్పగా, అత్యధికులు మాత్రం తాము ఉద్యోగం పోతుందని భయపడటం లేదని సర్వేలో చెప్పడం గమనార్హం. ఈ అధ్యయనం జరగడానికి ఆరు నెలల ముందుతో పోలిస్తే తమ పరిస్థితి ఇప్పటికీ మెరుగ్గానే ఉందని 25 శాతం మంది చెప్పారు. ఇదే సమయంలో పెరిగిపోతున్న ఖర్చులను తట్టుకోవాలంటే రోజూ మరికొన్ని అదనపు గంటలు పనిచేయాలని అనుకుంటున్నట్లు 23 శాతం మంది తెలిపారు. లాటిన్ అమెరికాలో 60 శాతం మంది ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తే, యూరప్ వాయవ్య ప్రాంతంలో కేవలం 24 శాతం మంది మాత్రమే ఆందోళనగా ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఫీలింగ్ ఉండాలబ్బా.. మూడేళ్లలో సంభవించిన పరిణామాల ఫలితమో లేక ఇంకో కారణమో గానీ.. చాలామంది ఉద్యోగులు తాము పనిచేసే కంపెనీతో ఒకరకమైన అనుబంధం ఏర్పడాలని ఆశిస్తున్నట్లు ఈ అధ్యయనం ద్వారా స్పష్టమైంది. అందుకే చాలామంది తాము చేసే ఉద్యోగం విలువ, అవసరాలను మదింపు చేసుకుంటున్నారని ఈ సర్వే వెల్లడించింది. కంపెనీ మనదన్న ఫీలింగ్ లేకపోతే అక్కడ పని మానేసేందుకైనా సిద్ధమని 54 శాతం మంది చెప్పారు. అలాగే పనిచేసే కంపెనీ కూడా కొన్ని విలువలు పాటించాలని లేదంటే ‘బై బై’ చెప్పేస్తామని 42 శాతం మంది స్పష్టం చేశారు. ఏంటా విలువలని ప్రశ్నిస్తే 77 శాతం మంది వైవిధ్యం, పారదర్శకత, సస్టెయినబిలిటీలను ప్రస్తావించారు. అందరిదీ ఒకే కోరిక ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఎలా ఉన్నా ఈ అధ్యయనంలో ఒక విషయమైతే స్పష్టమైంది. పనికీ, జీవితానికీ మధ్య సమతుల్యత ఉండాలని ఎక్కువ మంది చెప్పారు. ఈ సమతుల్యత లేకపోతే ఉద్యోగం వదులుకోవడానికీ వెనుకాడబోమని 61 శాతం మంది చెప్పడం, వీరందరూ 18– 34 మధ్య వయస్కులు కావడం విశేషం. పనిచేసే వాతావరణం బాగా లేదనిపిస్తే రాజీనామా చేసేస్తామని 34 శాతం మంది అభిప్రాయపడ్డారు. జీవితాన్ని అనుభవించలేని పరిస్థితులు తలెత్తితే ఉద్యోగం అవసరం లేదని 48 శాతం మంది చెప్పారు. మళ్లీ పనుల బాటలో.. మనదేశం మాటెలా ఉన్నా... ఈ అధ్యయనం నిర్వహించిన చాలా దేశాల్లో పదవీ విరమణ చేసిన వృద్ధులు మళ్లీ ఉద్యోగాలు వెతుక్కునే పనిలో ఉన్నారట. ఆర్థిక పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణం. భారత్‌లో ఉద్యోగాలకు వయో పరిమితి ఉంది కానీ, పాశ్చాత్య దేశాల్లో చాలా తక్కువ. కాలూ చేయి ఆడినంత కాలం పని చేస్తూంటారు. నచ్చినప్పుడు రిటైరవడమన్నది అక్కడ సాధారణం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో 65 ఏళ్లకు రిటైరవుదామని అనుకున్న వారు కూడా మరి కొంతకాలం పనిచేయాలని యోచిస్తున్నారు. గత ఏడాది 61 శాతం మంది పదవీ విరమణ ఆలోచన చేస్తే, ఈ ఏడాది ఆ సంఖ్య 51 శాతానికి పడిపోవడం గమనార్హం. యునైటెడ్ కింగ్డమ్లో గణాంకాలను పరిశీలిస్తే ఇటీవలి కాలంలో 65 ఏళ్లు పైబడ్డ వారు మళ్లీ ఉద్యోగాల వేటలో ఉన్న విషయం స్పష్టమవుతుంది. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 32 శాతం మంది తమకు ఉద్యోగాలు అవసరమని చెప్పారు. కేవలం వేతనాల కోసమే కాదు, ఇతరులతో సంబంధాలు కలిగి ఉండేందుకు, వచ్చే జీతం తమదీ అన్న ఒక భావన పొందేందుకూ ఏదో ఒక ఉద్యోగం అవసరమన్నది వారి అభిప్రాయంగా ఉంది. యజమానులు ఆదుకోవాలి ఖర్చులు పెరిగిపోతుండటంతో చాలామంది ఉద్యోగులు.. యజమానులు తమను ఏదోవిధంగా ఆదుకోవాలని ఆశిస్తున్నట్లు 39 శాతం మంది అభిప్రాయపడ్డారు. జీతాలైనా పెంచాలని, లేదంటే ఆర్థిక సాయం అందించాలని వీరు కోరుతున్నారు. ఏడాదికి ఒకసారి ఇచ్చే పెంపునకు అదనంగా ఈ సాయం చేయాలన్నది వారి భావన. పెట్రోల్, గ్యాస్ ఖర్చుల విషయంలో ఆదుకున్నా ఫర్వాలేదని, లేదంటే ఆఫీసుకు వచ్చిపోయేందుకు అవసరమైన రవాణా, తదితర ఖర్చులను కంపెనీలు భరించినా ఓకేనని దాదాపు 30 శాతం మంది తెలిపారు. ఆసక్తికరమైన విషయమేంటంటే.. 50 శాతం మంది తాము ఇప్పటికే ఈ రకమైన సాయం అందుకుంటున్నట్లు చెప్పడం. ఆర్థిక అంశాలను పక్కన పెడితే ఉద్యోగులను బాగా కలవరపెడుతున్న అంశం వర్క్ ఫ్లెక్సిబిలిటీ. సుమారు 45 శాతం మంది తమకు అనుకూలంగా ఉన్న సమయంలో పనిచేసేందుకు ఇష్టం చూపితే 40 శాతం మంది ఆఫీసులకు వెళ్లేందుకు బదులు రిమోట్ లేదా హైబ్రిడ్ పద్ధతుల్లో పనిచేసేందుకు ఆసక్తికనబరిచారు. తమకు అనుకూలంగా లేదన్న కారణంతో 27 శాతం మంది ఉద్యోగాలు వదులుకున్నట్లు తెలిపారు. పనివేళలు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని 83 శాతం మంది అభిప్రాయపడగా, పనిచేసే ఊరు, ప్రాంతం విషయంలోనూ ఈ వెసులుబాటు ఉండాలని 71 శాతం మంది చెప్పారు. ఇలా చెప్పిన వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. సర్వే జరిగిందిలా.. కోవిడ్ తదనంతరం ప్రపంచం మొత్తమ్మీద ఆర్థిక మాంద్యం భయం కనిపిస్తున్న తరుణంలో ఉద్యోగులు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు రాండ్‌స్టాడ్స్ ఈ సర్వే నిర్వహించింది. ‘వర్క్ మానిటర్’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో 15 దేశాలకు చెందిన 35 వేల మంది పాల్గొన్నారు. వారానికి 24 గంటలపాటైనా పనిచేసే వారు లేదా వ్యాపారాలు చేసుకునేవారు, ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న వారిని ఆన్లైన్లో ప్రశ్నించారు. ఒక్కో దేశంలో కనీసం 500 మందితో ఈ సర్వే నడిచింది. గత అక్టోబరు 18–30 మధ్య భారత్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆ్రíస్టియా, బెల్జియం, బ్రెజిల్, కెనడా, చిలీ, చైనా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హాంకాంగ్, దక్షిణాఫ్రికా, హంగేరీ, ఇటలీ, జపాన్, లగ్జెంబర్గ్, మలేసియా, మెక్సికో, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, పోలండ్, పోర్చుగల్, రుమేనియా, సింగపూర్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, అమెరికాల్లో ఈ సర్వే నిర్వహించారు. -కంచర్ల యాదగిరిరెడ్డి -
ప్రైవేటుకే ఉపాధి కల్పన.. ఉద్యోగాల నియామకాలకు జాబ్ మేళాలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఉపాధి కల్పనా శాఖ కార్పొరేట్, ప్రైవేటు రంగాలకు కల్పతరువుగా మారింది. ఆయా సంస్థల కోసం జాబ్ మేళాలను నిర్వహిస్తూ ఉద్యోగులను వెతికి పెడుతోంది. ఒకప్పుడు నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఈ శాఖ ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగాల భర్తీలో బిజీగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్హతలతో సహా పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులు లక్షల్లో ఉన్నా.. వయోపరిమితి దాటిపోయే వరకు ఒక్క ఉద్యోగం కూడా కలి్పంచలేని పరిస్థితి నెలకొంది. కనీసం ప్రభుత్వ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో ఏజెన్సీ ఎంప్యానల్‌మెంట్‌కే పరిమితమైంది. పొరుగు సేవల్లో అంతంతే.. ► ఉపాధి కల్పనా శాఖ ప్రైవేటుపై దృష్టి సారించింది. సాధారణంగా కార్పొరేట్, ప్రైవేటు సంస్థలు వ్యాపార ఆర్థిక లావేదేవీలను బట్టి ఉద్యోగుల సంఖ్యను కుదించడం, పెంచడం చేస్తుంటాయి. కరోనా నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడగానే తిరిగి నిపుణులైన ఉద్యోగుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పనా శాఖ ఆయా సంస్థలకు ఉద్యోగులను వెతికిపెట్టే బాధ్యతను భుజానా ఎత్తుకుంది. జాబ్ మేళాలు నిర్వహిస్తూ చిరు ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగుల ఎంపిక కోసం సంధాన కర్తగా వ్యవహరిస్తోంది. ► ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం కేవలం ఏజెన్సీల నమోదుకు పరిమితమైంది. కొత్త ఉద్యోగ భర్తీ లేక పొరుగుసేవల కింద నియామకాలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఉపాధి కల్పన కేంద్రంలో నమోదు చేసుకున్న నిరుద్యోగుల్లో అర్హులైన వారికి సమాచారం అందించి ఎంపిక చేయాలి. ఇందు కోసం ఏర్పాటు చేసిన కమిటీకి ఉపాధి కల్పనా శాఖ అధికారి కో కనీ్వనర్‌గా వ్యవహరించాలి. పొరుగుసేవల ఉద్యోగాలు నియామకాలు సాగుతున్నా.. అవి ఉపాధి కల్పనా శాఖ ద్వారా ఎంపిక జరిగిన దాఖలాలు మాత్రం లేవు. ఫలితంగా ఏజెన్సీలు తమకు నచ్చిన వారిని ఎంపిక చేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అచేతనంగా.. రెండు దశాబ్దాల వరకు ఉపాధి కల్పనా శాఖ నిరుద్యోగుల పాలిట కల్పతరువుగా వెలిగి ప్రస్తుతం అచేతనంగా తయారైంది. అప్పట్లో ఏ శాఖకు లేని ప్రతిష్ట ఈ శాఖ ఉండేది. సర్కారు కొలువులకు ఉపాధి కల్పన శాఖలో నమోదు తప్పనిసరిగా ఉండేది. దీంతో నిరుద్యోగులు ఈ ఆఫీస్‌కు క్యూ కట్టి నమోదు చేసుకున్నారు. అభ్యర్థులకు సీనియారిటీ ప్రకారం విద్యార్హతలను బట్టి ఆయా శాఖల్లో ఉన్న ఉద్యోగాల ఇంటర్వ్యూల కోసం వర్తమానం అందేది. ప్రభుత్వ నోటిఫికేషన్ విధానం అందుబాటులో రావడంతో శాఖకు వన్నె తగ్గినట్లయింది. ప్రస్తుతం కేవలం అభ్యర్థుల పేర్లు నమోదు, పునరుద్ధరణ, ప్రైవేటు సేవలకు పరిమితమైంది. ఆశల్లోనే అభ్యర్థులు.. ఉపాధి కల్పనా శాఖపై అభ్యర్థుల్లో ఆశలు సన్నగిల్లలేదు. సర్కారు కొలువుపై ఆశతో నమోదు, పునరుద్ధరణ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అభ్యర్థుల నమోదు కొంత మేరకు పెరిగింది. రాష్ట్రం మొత్తం మీద 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు సుమారు 2,72,124 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఆ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో పురుషులు 1,62,928 ఉండగా, మహిళా అభ్యర్థులు 1,09,196 ఉన్నారు. ఒక్క కాల్ లెటర్ రాలేదు ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ఉపాధి కల్పనా శాఖలో విద్యార్హతతో పేరు నమోదు చేసుకున్నా.. ఒక్క కాల్ లేటర్ రాలేదు. కేవలం ప్రైవేటు ఉద్యోగాల జాబ్ మేళాలకే ఉపాధి కల్పనా శాఖ పరిమితమైంది. సర్కారు కొలువుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి – సీలం దీపిక, హైదరాబాద్ అవుట్ సోర్సింగ్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి అవుట్సోర్సింగ్ లోనైనా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి. సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం కలి్పంచి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి. – పి.ప్రవీణ్ కుమార్ చదవండి: సమ్మోహన తీరం.. సరికొత్తగా హుస్సేన్ సాగర్ -
సంస్థలకు భారీ షాక్ ఇవ్వనున్న ఉద్యోగులు!
న్యూఢిల్లీ: దేశీయంగా 30 శాతం మంది ఉద్యోగులు తాము పనిచేస్తున్న కంపెనీ నుంచి మారడానికే ఆసక్తి చూపుతున్నట్లు పీడబ్ల్యూసీ ఇండియా పేర్కొంది. ఇక 71 శాతం మంది అయితే ఉద్యోగ గమనంలో ఉపేక్షకు గురవుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో గత రెండేళ్లుగా దేశీ ఉపాధి రంగంలో అటు ఉద్యోగులు, ఇటు యాజమాన్యాల ఆలోచనా ధోరణి మార్పులకు లోనైనట్లు నివేదిక వివరించింది. ‘వర్క్‌ఫోర్స్ భయాలు, ఆశలు– 2022’ పేరిట పీడబ్ల్యూసీ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం యాజమాన్యాలు(ఎంప్లాయర్స్) నిలకడైన మానవవనరుల ఏర్పాటు వ్యూహాలపైనే దృష్టి పెడుతున్నాయి. ఇక ఉద్యోగులైతే ఆర్థిక అండతోపాటు.. అవకాశాలు, నూతన కల్పనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సర్వేలో 2,608 మంది ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో 93 శాతం మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులుకావడం గమనార్హం! 19 శాతమే దేశీయంగా సర్వేలో పాల్గొన్న 34 శాతంమంది కొత్త కంపెనీకి మారేందుకు అత్యంత ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 19 శాతమే. కాగా.. దేశీయంగా మరో 32 శాతం మంది ప్రస్తుత కంపెనీని వీడే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. మిల్లీనియల్స్‌లో అత్యధిక శాతం మంది కొత్త ఉపాధి కోసం ఉత్సాహం చూపుతున్నారు. రానున్న 12 నెలల్లోగా కంపెనీ మారే సన్నాహాల్లో ఉన్నట్లు తెలియజేశారు. జెన్ జెడ్ ఉద్యోగులలో కంపెనీ మారేందుకు విముఖత చూపారు. అయితే పని గంటల తగ్గింపునకు డిమాండ్ చేయడం ప్రస్తావించదగ్గ విషయం!! సర్వేలో సగంమంది ఉద్యోగులు అవకాశాలలేమిపై విచారం వ్యక్తం చేశారు. ఇదేవిధంగా సహచరుల నుంచి నైపుణ్యాలను నేర్చుకునే విషయంపై పెదవి విరిచారు. -
బీహారీలకు ‘బిగ్’ న్యూస్ చెప్పిన సీఎం నితీష్
Nitish Kumar Announcement.. బీహార్‌లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత నితీష్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం నితీష్ కుమార్.. బీహార్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. తమ సంకీర్ణ ప్రభుత్వ హామీల మేరకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా మరో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పన కోసం తాము పెద్ద ఎత్తున కృషి చేస్తామని వెల్లడించారు. కాగా, సీఎం నితీష్ వ్యాఖ్యల మేరకు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. @NitishKumar ने गांधी मैदान से अपने भाषण में दस लाख लोगों को नौकरी के साथ बीस लाख लोगों को रोज़गार देने की महत्वपूर्ण घोषणा की@ndtvindia @Anurag_Dwary pic.twitter.com/8GfkRLEY0B — manish (@manishndtv) August 15, 2022 ఇదిలా ఉండగా.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్జేడీ కనుక అధికారంలోకి వస్తే.. 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. కానీ, ఆర్జేడీ మాత్రం అధికారంలోకి రాలేదు. ఇక, తాజాగా జేడీయూతో కలిసి ఆర్జేడీ అధికారంలోకి రావడంతో అప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చేలా సీఎం నితీష్.. నేడు ఇలా గుడ్ న్యూస్ చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. अभिभावक आदरणीय मुख्यमंत्री श्री नीतीश कुमार जी का 76वें स्वतंत्रता दिवस के अवसर पर पटना के गाँधी मैदान से ऐतिहासिक ऐलान:- 10 लाख नौकरियों के बाद 10 लाख अतिरिक्त नौकरियां दूसरी अन्य व्यवस्थाओं से भी दी जाएगी। जज़्बा है बिहारी जुनून है बिहार उत्तम बिहार का सपना करना है साकार — Tejashwi Yadav (@yadavtejashwi) August 15, 2022 ఇది కూడా చదవండి: మీ రాజకీయాల కోసం.. చరిత్రను వక్రీకరించకండి: సోనియా ఫైర్ -
ఇంకోసారి, ఉద్యోగుల తొలగింపుపై బాంబు పేల్చిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగి!
ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో సారి వందల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జులై నెలలో పునర్వ్యవస్ధీకరణ పేరుతో 1800 మంది ఉద్యోగులను తొలగించగా..తాజా లే ఆఫ్స్ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఓ సీనియర్ డిజైనర్ ఉద్యోగుల తొలగింపుపై లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేశారు. ఈ వారంలో ముఖ్యంగా మోడ్రన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ టీం (ఎంఎల్‌ఎక్స్) ఉద్యోగుల్ని ఫైర్ చేయనుందని ఓ బాంబు పేల్చారు. సీనియర్ డిజైనర్‌తో పాటు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం ప్రతినిధులు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎంఎల్‌ఎక్స్ టీం తో పాటు ప్రపంచంలోని మైక్రోసాఫ్ట్ కు చెందిన లోకేషన్లలో విధులు నిర్వహించే హెచ్ ఆర్ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ సభ్యుల్ని తొలగించే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. 2018లో 2018లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఉత్పత్తుల్ని వినియోగించుకునే కస్టమర్లు..మళ్లీ తిరిగి వాటిని ఉపయోగించేలా మోడ్రన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ టీం (ఎంఎల్‌ఎక్స్) విభాగాన్ని ఏర్పాటు చేసింది. తొలిసారి ఈ ఎంఎల్‌ఎక్స్ సభ్యులు ఎఫెక్టీవ్ వేలో హెల్దీ ఆన్ లైన్ హ్యాబిట్స్‌తో వినియోగదారులు వారి రోజూవారీ కార్యకలాపాల్ని చక్కదిద్దే లక్ష్యంతో ఎక్స్ బాక్స్ తరహా ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్‌ను డెవలప్ చేశారు. జూన్ 2020లో మనీ ఇన్ ఎక్స్ఎల్ అనే టెంప్లెట్‌ను మార్కెట్‌కు పరిచయం చేశారు. ఈ మనీ ఎక్స్ అనే టెంప్లెట్ సాయంతో వినియోగదారులు మైక్రోసాఫ్ట్ ఎక్స్ ఎల్ నుంచి డైరెక్ట్‌గా వారి బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ అకౌంట్లలో ఎంటర్ అవ్వొచ్చు. పెట్టుబడులు సైతం పెట్టుకోవచ్చు. కాగా, ఈ మనీ ఇన్ ఎక్సెఎల్ అనే టెంప్లెట్ వచ్చే ఏడాది జూన్ 30న షట్ డౌన్ చేయనుంది. ఉద్యోగుల తొలగింపు సాధారణమే ఆర్ధిక మాంద్యంతో ఇక టిక్‌టాక్, ట్విట్టర్, నెట్‌ఫ్లిక్స్ ఇతర సంస్థలు ఉద్యోగుల్ని తొలగించాయి. ఆ సమయంలో ఉద్యోగుల తొలగించడం సాధారణమని మైక్రోసాఫ్ట్ చెప్పుకొచ్చింది. కంపెనీకి చెందిన 1.8 లక్షల మంది ఉద్యోగుల్లో కేవలం 1 శాతం లోపు ఉద్యోగులనే తొలగించామని తెలిపింది. చదవండి👉వేలమంది ఉద్యోగులపై వేటు,టెక్కీలకు గడ్డుకాలం..వరస్ట్ ఇయర్‌గా 2022 -
అయిదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలతో కలిసి పని చేస్తామని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) దక్షిణ ప్రాంత చైర్పర్సన్ సుచిత్ర ఎల్లా తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ద్విముఖ వ్యూహాన్ని రూపొందించామని బుధవారమిక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆమె చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలను ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా ప్రమోట్ చేయడంతోపాటు, వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం ఇప్పటికే ఉన్న పరిశ్రమలతో కలిసి పనిచేస్తామని వివరించారు. -
శ్రీలంక ఉద్యోగుల పనితీరు భేష్! హెచ్‌సీఎల్ ప్రశంసల వర్షం!
న్యూఢిల్లీ: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో వ్యాపార కార్యకలాపాల కొనసాగింపునకు తగిన ప్రణాళికలున్నట్లు ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా వెల్లడించింది. అదనపు పనిభారాన్ని నిర్వహించేందుకు ఇండియా, తదితర ప్రాంతాలలోని ఉద్యోగులకు అవసరమైనంత అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలియజేసింది. శ్రీలంకలో కంపెనీ తరఫున 1,500 మంది విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ సమస్యలున్నప్పటికీ సర్వీసులు కొనసాగిస్తున్నట్లు కంపెనీ సీఈవో విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇందుకు మద్దతుగా దేశీ బృంద సభ్యులు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సవాళ్ల నేపథ్యంలోనూ శ్రీలంకలోని ఉద్యోగులు సక్రమంగా బాధ్యతలు నెరవేరుస్తున్నట్లు ప్రశంసించారు. -
భవిష్యత్తులో ఎక్కువ ఉద్యోగాలు ‘గిగ్’లోనే లభిస్తాయట
ఒకప్పుడు ఉద్యోగమంటూ డిగ్రీ పట్టా చేతపట్టుకుని పదుల కొద్ది ఇంటర్యూలకు హాజరవ్వాలి. ఉద్యోగం దొరికితే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీసుల్లో కూర్చుని పని చేయాలి. కానీ ఇప్పుడు జమానా మారింది. ఉద్యోగం కావాలంటే డిగ్రీలు అక్కర్లేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో ఉండక్కర్లేదు. నచ్చినప్పుడు నచ్చినంత సేపు పని చేస్తే చాలు జీవనోపాధి చేతిలో ఉన్నట్టే. నిజమే ఈ కామర్స్ రంగం పుంజుకున్నకా మనకు కనిపించే డెలివరీ బాయ్స్ చేసేది ఇదే పని. వీళ్లను గిగ్ వర్క్‌ఫోర్స్‌గా పిలుచుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అధిక ఉపాధి అందించేదిగా గిగ్ ఎకానమీ రూపుదిద్దుకోబోతుంది. ఏకంగా 2.35 కోట్లు నీతి అయోగ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2029-30 నాటికి దేశంలో వర్క్‌ఫోర్స్‌లో గిగ్ వర్కర్ల సంఖ్య ఏకంగా 2.35 కోట్లకు చేరనుంది. దీంతో గిగ్ వర్క్‌ఫోర్స్ వాటా ఏకంగా 4.1 శాతానికి చేరుకోనుంది. వ్యవసాయేతర రంగాలను పరిగణలోకి తీసుకుంటే గిగ్ఫోర్స్ వాటా ఏకంగా 6.7 శాతంగా ఉంటుందని నీతి అయోగ్ అంటోంది. రాబోయే రోజుల్లో ఈ దేశ యువతకు ఉపాధికి అతిపెద్ద దిక్కుగా గిగ్ ఎకానమీ అవతరించనుంది. ప్రస్తుతం 77 లక్షలు నీతి అయోగ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరం వివరాలను పరిశీలిస్తే... గిగ్ వర్క్‌ఫోర్స్‌గా దేశంలో 77 లక్షల మంది పని చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా రిటైల్ అండ్ సేల్స్ విభాగంలో 26 లక్షల మంది, ట్రాన్స్‌పోర్టేషన్‌లో 13 లక్షల మంది, ఫైనాన్స్ అండ్ ఇన్సురెన్సులో 6.3 లక్షల మంది, మాన్యుఫ్యాక్చరింగ్‌లో 6.2 లక్షల మంది, ఎడ్యుకేషన్‌లో లక్ష మంది ఉపాధి పొందుతున్నట్టుగా తేలింది. పెద్ద దిక్కుగా గిగ్ గిగ్ ఎకానమీలో ఉపాధి పొందుతున్న వర్క్‌ఫోర్స్ నైపుణ్యాలను పరిశీలిస్తే.. ఇందులో అత్యధిక మంది మీడియం స్కిల్డ్ వర్కర్లుగా తేలారు. వీరి వాటా 47 శాతంగా ఉంది. ఆ తర్వాత స్థానంలో లో స్కిల్డ్ కేటగిరీలో 31 శాతం మంది ఉన్నారు. చివరగా హై స్కిల్డ్క్ కేటగిరిలో కేవలం 22 శాతం మందే ఉన్నారు. వీటిని పరిశీలిస్తే సాధారణ స్కిల్స్ లేదా స్కిల్స్ లేని వారికి అతి పెద్ద ఉపాధి వనరుగా గిగ్ నిలుస్తోందనే భావన కలుగుతోంది. చదవండి: మార్కెట్లో లాభాలు.. అంతా ఆశామాషీ కాదు గురూ! -
నైపుణ్యం ఉన్నోళ్లకు 21 వేల ఉద్యోగాలు సిద్ధం
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం మీ చేతుల్లో ఉంటే తక్షణం ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 1,275 కంపెనీలు ఈ ఏడాదికి వివిధ అంశాల్లో నైపుణ్యం కలిగిన 21 వేల మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ఏడాదికి పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల అవసరాల వివరాలను పరిశ్రమల శాఖ సేకరించింది. ప్రతి జిల్లాలోనూ పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు అక్కడి పరిశ్రమలను సంప్రదించి ఈ ఏడాదికి ఏయే నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏ మేరకు కావాలన్న వివరాలను సేకరించారు. ఈ సర్వేలో 1,275 కంపెనీలు సుమారు 21 వేల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని, ఇందుకోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఆయా సంస్థలకు అవసరమైన మానవ వనరుల్ని అందించే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ వీఆర్వీఆర్ నాయక్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకోసం పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ‘స్కిల్ హబ్స్’ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. పరిశ్రమలకు అవసరమైన సుమారు 180కి పైగా నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చేవిధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. స్వచ్ఛంద శిక్షణకు ముందుకొచ్చిన 68 కంపెనీలు కాగా, రాష్ట్రంలో 68 కంపెనీలు తమ ప్రాంగణాల్లోనే ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి ముందుకు వచ్చినట్లు నాయక్ తెలిపారు. మిగిలిన పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా స్కిల్ హబ్‌ల్లో కోర్సులను రూపొందిస్తున్నట్లు పరిశ్రమ ప్రతినిధులు, విద్యారంగ నిపుణులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్ఎస్డీసీ), నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ, ఐటీ ఈ–సీ ప్రత్యేక కార్యదర్శి జి.జయలక్ష్మి పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. -
ఇక్కడి విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్: మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో సీఎం జగన్ ఉన్నారని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు జరిగే మెగా జాబ్‌మేళాను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల తమ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి, వైజాగ్‌లలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాలకు విశేష స్పందన వచ్చిందని, రెండుచోట్ల 347 కంపెనీలు పాల్గొనగా, 30 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. అలాగే, ఏఎన్‌యూలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాలో 26 వేల ఉద్యోగాలను భర్తీచేసేందుకు ప్రైవేటు రంగంలోని వివిధ రకాల సంస్థలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఇందుకు వైఎస్సార్సీపీ జాబ్ పోర్టల్‌లో 97వేల మంది నిరుద్యోగ యువత నమోదు చేసుకున్నారన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో తిరుపతి, వైజాగ్, గుంటూరు జిల్లాల్లో మెగా జాబ్‌మేళాలను నిర్వహిస్తున్నామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. జాబ్‌మేళాకు విశేష స్పందన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించిందని విజయసాయిరెడ్డి తెలిపారు. తొలిరోజు మేళా ముగిసిన అనంతరం ఆయన పలువురికి కంపెనీల ఆఫర్ లెటర్లు అందజేశారు. తొలిరోజు 142 కంపెనీలు పాల్గొనగా మొత్తం 7,473 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. తొలిరోజు 31 వేల మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారన్నారు. ప్రజా మద్దతు లేనివారికే పొత్తులు కావాలి వైఎస్సార్సీపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరంలేదని విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు. ఎవరికైతే ప్రజల మద్దతు లేదో వారే పొత్తుల కోసం పాకులాడుతున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీని ఎదుర్కొనేందుకు విçపక్షాలన్నీ కలిసి రావాలని చంద్రబాబు శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ప్రతి ఎన్నికల్లోనూ ఇతరులపై ఆధారపడే తత్వం, వారిని మోసగించి వెన్నుపోటు పొడిచే నైజం చంద్రబాబుదేనన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రూ.11.5 లక్షల ప్యాకేజీ తొలిరోజు ఉద్యోగాలకు ఎంపికైన వారిలో లోమా ఐటీ సొల్యూషన్ కంపెనీ కల్యాణి అనే యువతికి అత్యధికంగా వార్షిక ప్యాకేజీ కింద రూ.11.5 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత సీఎఫ్ఎల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, క్లస్టర్ మేనేజర్‌గా ఎంపిక చేసుకున్న అభ్యర్థికి రూ.5.47 లక్షల ప్యాకేజీ ఇచ్చారు. రాజకీయ వ్యవస్థను టీడీపీ భ్రష్టుపట్టిస్తోంది సాక్షి, అమరావతి: వ్యవస్థలను అడ్డుపెట్టుకుని రాజకీయ వ్యవస్థను టీడీపీ భ్రష్టుపట్టిస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. న్యాయబద్ధంగానే ఈ చర్యలను ఎదుర్కోవాల్సిన బాధ్యత న్యాయవాదులపైనే ఉందని ఆయన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలకు దిశా నిర్ధేశంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ లీగల్ సెల్ రాష్ట్రస్థాయి సమావేశం సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. మనోహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. బార్ కౌన్సిల్‌తో సహా రాష్ట్రంలో ఉన్న 143 బార్ అసోసియేషన్లలో వైఎస్సార్సీపీకి చెందిన లీగల్ సెల్ నాయకులే పట్టు సాధించాలన్నారు. వచ్చే జులై 8న జరగనున్న పార్టీ ప్లీనరీలోగా అన్ని జిల్లాల్లో మహాసభలు నిర్వహించాలని ఆయన సూచించారు. -
‘జెనరేషన్ జెడ్’పై ఎక్కువ ప్రభావం చూపిస్తోన్న కోవిడ్
న్యూఢిల్లీ: యువతరం కార్మికులు, ఉద్యోగులపై కరోనా మహమ్మారి ప్రభావం గట్టిగానే పడింది. జెనరేషన్ జెడ్ (18–24 వయసువారు)ను వృత్తిపరంగా, ఆర్థికంగా గట్టి దెబ్బకొట్టినట్టు ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న 78 శాతం మంది కరోనా తమ వృత్తి జీవితంపై ప్రభావం చూపించిందని చెప్పారు. 55 ఏళ్లకు పైన ఉన్న వారితో పోలిస్తే తమపై రెండింతల ప్రభావం పడినట్టు పేర్కొన్నారు. 17 దేశాల నుంచి 32,471 మంది కార్మికుల అభిప్రాయాలను ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సర్వేలో భాగంగా తెలుసుకుంది. యువ కార్మికులు ప్రతీ ఐదుగురిలో ఇద్దరు (39 శాతం) ఉద్యోగం కోల్పోయినట్టు లేదా తాత్కాలికంగా తొలగింపునకు గురైనట్టు ఈ సర్వే తెలిపింది. అన్ని వయసుల్లోని వారిని పరిగణనలోకి తీసుకుని చూస్తే.. ఇలా చెప్పిన వారు 28 శాతం మంది ఉన్నారు. భారత్‌లో సగానికి పైగా కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగం కోల్పోతామన్న ఆందోళనను ఎదుర్కొన్నట్టు చెప్పారు. ‘‘యువతరం పనివారిపై భారత్‌లో కరోనా మహమ్మారి ఎక్కువ ప్రభావం చూపించింది. స్వీయ చైతన్యంతో వారు మరింత బలంగా నిలబడి నూతన నైపుణ్యాలపై దృష్టి సారించారు’’అని ఏడీపీ ఇండియా, దక్షిణాసియా ఎండీ రాహుల్ గోయల్ తెలిపారు. చదవండి:వర్క్‌ఫ్రమ్ హోమ్ కొనసాగింపు.. ఎంప్లాయిస్‌పై నజర్! ఎప్పటివరకంటే.. -
దేశీయంగా యాపిల్ విస్తరణ.. 10 లక్షల ఉద్యోగాలు టార్గెట్
బెంగళూరు: ఐఫోన్ల దిగ్గజం యాపిల్ దేశీయంగా విస్తరణను చేపట్టనుంది. ఇందుకు భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ ప్రొడక్ట్ కార్యకలాపాల వైస్‌ప్రెసిడెంట్ ప్రియ బాలసుబ్రమణ్యన్ పేర్కొన్నారు. ఉద్యోగులు, యాప్స్, సరఫరా భాగస్వాములు, తదితరుల ద్వారా 10 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి మద్దతివ్వనున్నట్లు 2021 బెంగళూరు టెక్ సదస్సు సందర్భంగా తెలియజేశారు. రెండు దశాబ్దాలుగా యాపిల్ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. 2017లో బెంగళూరు యూనిట్లో ఐఫోన్ల తయారీని చేపట్టినట్లు ప్రస్తావించారు. ఆపై చెన్నైలోనూ తయారీ కార్యకలాపాలను విస్తరించినట్లు పేర్కొన్నారు. తద్వారా వివిధ ఐఫోన్ మోడళ్లను దేశ, విదేశీ మార్కెట్ల కోసం రూపొందిస్తున్నట్లు వివరించారు. కస్టమర్లను ఈ మోడళ్లు ఆకర్షి స్తాయన్న విశ్వాసాన్ని వక్తం చేశారు. ఐపీవోలపై ఆచితూచి..: నజారీ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి వెళ్లడం ద్వారా నిధులను సమీకరించాలంటే కంపెనీలు సాధ్యాసాధ్యాల పరిశీలనకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని స్టార్టప్‌లకు ఐపీవో అవకాశాలు, సవాళ్లుపై నిర్వహించిన టెక్ సదస్సులో నజారా టెక్నాలజీస్ సీఈవో మనీష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇందుకు కంపెనీ నిర్వహణ తదితర పలు అంశాలపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలనలోకి ప్రవేశించవలసి ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రమోటర్లు వాటా విక్రయం ద్వారా వాటాదారులకు విలువ చేకూర్చడం అనేది కాల్పనిక అంశమని అన్నారు. చదవండి: యాపిల్ బంపర్ ఆఫర్..! ఇకపై మీఫోన్‌లను మీరే బాగు చేసుకోవచ్చు..! -
తల్లి చేయని మేలు చేస్తోన్న ‘సీడాప్’
కర్నూలు (ఓల్డ్‌సిటీ): తల్లిదండ్రులు చేయలేని పనిని ఆ సంస్థ చేసిచూపిస్తోంది.. పిల్లల పోషణ, పెంపకం, విద్యా బుద్ధులు నేర్పడం వరకే సాధ్యమవుతుందేమో కానీ వారు తమ పిల్లలను ఉద్యోగాలకు ఎంపికయ్యేంత నేర్పరితనాన్ని మాత్రం నూరిపోయలేరు. అలాంటి కఠినమైన పాత్రను ఆ సంస్థ పోషిస్తోంది. అంతే కాదు.. ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇప్పిస్తోంది. ఇంతకూ ఆ సంస్థ పేరు ఏమిటని అనుకుంటున్నారా.. సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్). జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహించి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. గ్రామీణ నిరుద్యోగుల భవిష్యత్తుకు బాటలు.. పల్లె ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకుల భవితకు బాటలు వేయాలనే సదుద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (డీడీయూ–జీకేవై) పథకంలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా చేరి డీఆర్డీఏ ఆధ్వర్యంలో సీడాప్ సంస్థను స్వయంగా నడిపిస్తోంది. రాష్ట్రంలో 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. 2008లో కర్నూలులో స్థాపించారు. ఆతర్వాత ఎమ్మిగనూరులోనూ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఈ రెండు చోట్లా శిక్షణలు కొనసాగుతున్నాయి. బ్యాచీకి 35 మంది చొప్పున కర్నూలులో రెండు బ్యాచీలు, ఎమ్మిగనూరులో ఒక బ్యాచ్ నిర్వహిస్తున్నారు. శిక్షణ కాలపరిమితి 90 రోజులు. కుములేటివ్ ఇంగ్లీష్, రిటైల్ నాలెడ్జ్, కంప్యూటర్ ఎం.ఎస్.ఆఫీస్, సాఫ్ట్ స్కిల్స్, టైపింగ్ వంటి నేర్పిస్తారు. ఇక్కడి ఫ్యాకల్టీ ఇతరుల పట్ల గౌరవ భావం, సౌమ్యంగా మాట్లాడే విధానం నేర్పడంతో పాటు క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఇంటికంటే మెరుగైన సదుపాయాలు.. ఆ సంస్థలో చేరిన యువతీ యువకులకు మూడు పూటలా చక్కటి భోజనంతో పాటు సాయంత్రం పూట స్నాక్స్ కూడా అందిస్తారు. ఆహారం తయారీదారులు పౌష్ఠిక విలువలు, రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తారు. ఆహార వడ్డింపును సీడాప్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. వారు సూచించిన మెనూ ప్రకారమే ఆహారాన్ని అందిస్తారు. శిక్షణలో చేరగానే మొదట రెండు జతల యూనిఫాంతో పాటు ఒక జత షూస్, సాక్స్‌లు ఇస్తారు. తరగతిలో హాజరు బయోమెట్రిక్ విధానంలో ఉంటుంది. బస చేసేందుకు యువతులకు, యువకులకు వేర్వేరు గదులను ఏర్పాటు చేశారు. నిద్రించేందుకు నాణ్యమైన పరుపులు కూడా ఉంటాయి. సంస్థ జేడీఎం కిరణ్ సంస్థను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. శిలను శిల్పం చేసిన సీడాప్.. చిత్రంలో కనిపిస్తున్న యువతి పేరు సువర్చల. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామ రైతు ఎర్రపోగు మోహన్ కూతురు. ఇంటర్ వరకు చదువుకుంది. వీరిది నిరుపేద కుటుంబం. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. ఇలాంటి తరుణంలో జాబ్ రీసోర్స్ పర్సన్ ద్వారా సీడాప్ సంస్థ గురించి తెలుసుకుంది. 2020 జనవరిలో సీడాప్ సంస్థలో చేరి 90 రోజుల శిక్షణ చేసింది. శిలను శిల్పంగా మార్చే చందంగా ఈ సంస్థలో ఫ్యాకల్టీ చక్కటి తర్ఫీదు ఇచ్చారు. క్యుములేటివ్ ఇంగ్లీష్, రిటైల్ నాలెడ్జ్, కంప్యూటర్ ఎం.ఎస్.ఆఫీస్, సాఫ్ట్ స్కిల్స్, టైపింగ్ వంటి నేర్పించారు. ఇతరులను ఎలా గౌరవించాలి, సౌమ్యంగా మాట్లాడే విధానాన్నీ నేర్పారు. ట్రైనింగ్ పూర్తి కాగానే ఆమెను హైదరాబాదులోని లలిత జువెల్లర్స్ షోరూమ్ వారు సేల్స్ రంగంలో ఉద్యోగం ఇచ్చారు. మొదట జీతం 12,500 రూపాయలు ఉండేది. సంవత్సర కాలంలోనే ప్రతిభ చూపించి సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పదోన్నతి పొందింది. ప్రస్తుతం ఆమె జీతం (ఇన్సెంటివ్లతో కల్పుకుని) నెలకు రూ. 35 వేలు పైమాటే. కుటుంబానికి ఆర్థిక బాసటగా నిలిపిన సీడాప్ సంస్థ రుణం తీర్చుకోలేనిదని ఆమె పేర్కొంటున్నారు. ఇప్పుడు ఉన్నత చదువులు చదువుతోంది ఈమె పేరు శాంతమ్మ. పాములపాడు మండలం వానాల గ్రామ రైతు కుటుంబానికి చెందిన ఈ యువతి ఐదేళ్ల క్రితమే ఇంటర్ పూర్తి చేసింది. వ్యవసాయ రంగంలో ఒడిదుడుకుల కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. తాను ఉన్నత చదువులు చదువుకోలేదు, తనకు ఎవరు ఉద్యోగమిస్తారంటూ తరచూ ఆందోళనకు గురయ్యేది. ఆనోటా ఈనోటా సీడాప్ సంస్థ గురించి తెలుసుకుంది. అప్పట్లో 75 రోజుల శిక్షణ ఉండేది. సంస్థలో చేరి శిక్షణ పూర్తి చేసుకుంది. హైదరాబాదులోని డీమార్ట్ స్టోర్స్‌లో సీఎస్ఏగా ఉద్యోగం పొందింది. చేరినప్పుడు జీతం కేవలం రూ. 8,000 ఉండేది. ఉద్యోగ నిర్వహణలో క్రమశిక్షణ, ఖచ్చితత్వం, అంకితభావం వంటి గుణాలను చూసి యాజమాన్యం ఆమెకు పదోన్నతులు కల్పించింది. ప్రస్తుతం ఆమె కర్నూలు నగరంలోని డీమార్ట్ షోరూమ్‌లో ఫ్లోర్ ఇంచార్జి. ఈమె జీతం అక్షరాలా రూ. 38 వేలు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడమే కాక ఉన్నత చదువులు చదవాలనే తన కోరికను కూడా నెరవేర్చుకుంటానని చెబుతోంది. తొలగుతున్న నిరుద్యోగ సమస్య: బి.కె.వెంకటేశ్వర్లు, పీడీ డీఆర్డీఏ కొత్త ప్రభుత్వం వచ్చాక వలంటీర్లు, గ్రామ సచివాలయాలు, ప్రజా పంపిణీ సరుకుల వాహనాలు వంటి వాటి ద్వారా దాదాపుగా అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగస్తులు అయ్యారు. కాగా సీడాప్ ద్వారా కొనసాగుతున్న ఉద్యోగ కల్పన ప్రక్రియ ద్వారా ఏడాదికి 420 మంది వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులుగా మారుతున్నారు. ఈ లెక్కన ఇప్పటి వరకు సుమారు ఐదు వేలకు పైగా నిరుద్యోగులు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగస్తులు అయ్యారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది. -
అఫ్గన్ కార్మికులకు అమెరికానే ఉపాధి చూపాలి
అఫ్ఘనిస్తాన్‌లో నాటో, అమెరికా దళాలకు సేవలు అందించి, తాలిబన్ల రాకతో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన భారతీయుల సంక్షేమాన్ని అమెరికా పట్టించుకోవాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అఫ్గన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన భారతీయ కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ అమెరికా, నాటో దేశాలకు ప్రవాసి మిత్రా లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల లేఖ రాశారు. సైనిక శిబిరాల్లో పనిచేసిన కొన్ని వేల మంది అఫ్ఘన్లను యుఎస్‌కు తీసుకుని వెళ్లారని ప్రవాసి మిత్ర పేర్కొంది. అదే ప్రయోజనాన్ని భారతీయ కార్మికులకు కూడా అందించాలని ‘ప్రవాసి’ కోరింది. ఈ మేరకు నాటో శిబిరాలలో సేవలందించి ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ నుండి తిరిగి వచ్చిన భారతీయ కార్మికులందరి వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. చదవండి: Helpline Numbers To Afghans: హెల్ప్‌లైన్ నంబర్లు ప్రకటించిన భారత ప్రభుత్వం -
ఉపాధికి ఆమడ దూరంలో విద్య
మన ఇంట్లో, మన ఊళ్లో, మన వీధిలో ఎంతమంది యువకులు పనులు లేక తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తున్నారనేది మనందరికీ తెలుసు. మన దేశంలో విద్యావంతులుగా చెప్పుకుంటున్న వాళ్లలో నూటికి 90 మంది నైపుణ్యం లేని అక్షరాస్యులు మాత్రమే. ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం, విద్య అంటే అక్షరాస్యత, చదువు, నైపుణ్యం, నైతిక విలువల శిక్షణ. కానీ మనం చదువును మాత్రమే విద్య అంటున్నాం. పారిశ్రామిక, సాంకేతిక సంస్థల, వ్యాపార వాణిజ్య రంగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించే విద్యా వ్యవస్థ రావాలి. అప్పుడే మన దేశ నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. కోట్లాది మంది నిరుద్యోగ యువకులకు భవిష్యత్ మీద ఒక విశ్వాసం కలుగుతుంది. ‘‘షెడ్యూల్డ్ కులాలు ఆర్థికంగా ఎదగడానికి అక్షరాస్యత ఇచ్చే చదువుకన్నా, సాంకేతిక విద్య చాలా ముఖ్యం. సాంకేతిక విద్యను అభ్యసించడం ఈ రోజుల్లో చాలా కష్టం. చాలా ఖర్చుతో కూడుకున్నది. కులతత్వం కలిగిన హిందువులు నైపుణ్యం లేని షెడ్యూల్డ్ కులాలను మరింత దోపిడీకి, అణచివేతకు గురిచేస్తారు. అందువల్ల షెడ్యూల్డ్ కులాలకు భారత ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక విద్యలో అవకాశాలు కల్పించాలి. నిపుణు లుగా తీర్చిదిద్దాలి’’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1942 అక్టో బర్ 29వ తేదీన ఆనాటి గవర్నర్ జనరల్‌కు సమర్పించిన ఒక విజ్ఞాపనలో అభ్యర్థించారు. షెడ్యూల్డ్ కులాల సమస్యలపై ఒక సుదీర్ఘమైన మెమోరాండంను అంబేడ్కర్ సమర్పించారు. అందులో నాలుగు భాగాలున్నాయి. మొదటిది రాజకీయ ప్రతిపాదనలు, రెండోది విద్యా సంబంధమైన కోర్కెలు, మూడోది, నాలుగోది ప్రధానంగా అంటరానితనం వలన ఎదురవుతున్న సమస్యలు, దాడులు అందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి పేర్కొన్నారు. అంతేకాకుండా, కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలను కూడా అంబేడ్కర్ చేశారు. ఆరోజు ఉనికిలో ఉన్న ఎన్నో సాంకేతికమైన పనులను, శిక్షణ లను ఆయన అందులో ప్రస్తావించారు. ‘‘ఆర్ట్స్, న్యాయ సంబం ధమైన చదువులవల్ల ఎక్కువ ప్రయోజనం ఆశించలేం. శాస్త్ర, సాంకే తిక విద్యవల్ల మాత్రమే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు, హిందూ కులాల విద్యావంతులతో పోటీపడగలరు. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవచూపి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించ అలవడుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ఉపకార వేతనాల ద్వారా సహాయం అందించాలి’’ అని కూడా కోరారు. ఇవి 80 ఏళ్లనాటి మాటలు. కానీ ఈనాటికీ ఇవి అక్షర సత్యాలు. ఈ మాటలు నేడు కేవలం షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు మాత్రమే పరిమితమై లేవు. శాస్త్ర, సాంకేతిక, వృత్తి నైపుణ్యమైన విద్యను అభ్య సించిన కోట్లాది మంది యువకులు నిరుద్యోగంతో లేదా అర్హతకు సంబంధం లేని పనులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్యూ’ (pew) అనే సంస్థ నిర్వహించిన అధ్య యనం ప్రకారం ఒక కోటీ 80 లక్షల 60 వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. అదే విధంగా 39 కోట్ల 30 లక్షల 70 వేల మంది అరకొర పనులతో, చాలీచాలని జీతాలతో జీవితాలు వెళ్లదీస్తున్నారు. ఇవి అవ గాహనకు మాత్రమే. మనందరికీ తెలుసు మన ఇంట్లో, మన ఊళ్లో, మన వీధిలో ఎంతమంది యువకులు పనులు లేక తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తున్నారనేది. అందుకు చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైన అంశం బాబాసాహెబ్ అంబేడ్కర్ 1942లో పేర్కొన్న విషయం. మన దేశంలో నైపుణ్యం కలిగిన యువకులు పనిచేసే సామర్థ్యం కలిగిన వాళ్లలో కేవలం 4.69 శాతం మాత్రమే. అదే చైనాలో 24 శాతం, 52 శాతం అమెరికాలో, 68 శాతం బ్రిటన్‌లో, 75 శాతం జర్మ నీలో, 80 శాతం జపాన్‌లో, 96 శాతం దక్షిణ కొరియాలో ఉన్నట్టు ఇటీవలి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అదే విధంగా 2021లో ప్రకటించిన నిరుద్యోగ గణాంకాల ప్రకారం ఇండియాలో చదువు వారీగా నిరుద్యోగుల శాతం ఉన్నది. అందులో గ్రాడ్యుయేట్లు 16.3 శాతం, పోస్ట్గ్రాడ్యుయేట్లు 14.2 శాతం, సర్టిఫికెట్ కోర్సులు చదివిన వాళ్లలో 11.3 శాతం, డిప్లొమా చేసిన వాళ్లలో 11.1 శాతం నిరుద్యో గులుగా ఉన్నారు. అదేవిధంగా హైస్కూల్ చదివిన వాళ్లలో 7.4 శాతం, ప్రైమరీ చదివిన వాళ్లలో 5.4 శాతం, నిరక్షరాస్యుల్లో 2 శాతం నిరుద్యోగులు ఉన్నారు. ఉన్నత విద్య చదివిన వాళ్లలో ఎక్కువమంది నిరుద్యోగులుగా ఉన్నారని అర్థమవు తోంది. నిరక్షరాస్యులలో 2 శాతం నిరుద్యోగులుగా ఉన్నారు.. చదువు కున్నవాళ్లలో ఎక్కువమంది నిరుద్యోగులుగా ఉన్నారు. దీనికి పెద్దగా అధ్యయనాలు, పరిశోధనలు అవసరం లేదు. అయితే విద్యావంతుల్లో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉండటానికి ప్రధానమైనది మన విద్యా వ్యవస్థ. మన చదువుల్లో ఎక్కువమంది ఆర్ట్స్ విభాగంలో ఉన్నారు. ఇందులో 30 శాతం మంది విద్యార్థులు ఉండగా, సైన్స్‌లో 16 శాతం మంది, కామర్స్‌లో 14 శాతం మంది, ఇంజనీరింగ్‌లో 12 శాతం మంది, మెడిసిన్‌లో 3 శాతం, ఐటీలో 2.4 శాతం, 2 శాతం మేనేజ్ మెంట్ కోర్సుల్లో చదువుతున్నట్లుగా ఇటీవల విడుదలైన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో వెల్లడైంది. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ రంగాలు కలిసి 60 శాతం మంది చదువుతున్నారు. ఉద్యోగావకాశాలు ఉన్న ఇంజనీరింగ్, మెడిసిన్, ఇన్ఫర్మేషన్ టెక్నా లజీ, మేనేజ్మెంట్ కోర్సులో చాలా తక్కువమంది ఉన్నారు. ఇందులో ఇంజనీరింగ్‌లో 12 శాతం ఉన్నారు. మనకు తెలుసు మన దేశంలో ఇంజనీరింగ్ చదువులు ఎంత ఉన్నతంగా ఉన్నాయో. మెడిసిన్ మేనే జ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు కొంత మెరుగ్గా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. మన దేశంలో విద్యా వ్యవస్థ ఇటువంటి ప్రణాళిక లేని ఒక అగమ్యగోచరమైన విధానంగా కొనసాగుతున్నది. ఇక్కడ విద్యా వంతులుగా చెప్పుకుంటున్న వాళ్లలో నూటికి 90 మంది నైపుణ్యం లేని అక్షరాస్యులు మాత్రమే. మనం విద్యను తప్పుగా అర్థం చేసుకున్నాం. ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం, విద్య అంటే అక్షరాస్యత, చదువు, నైపుణ్యం, నైతిక విలువల శిక్షణ. కానీ మనం చదువును మాత్రమే విద్య అంటున్నాం. కోటి విద్యలు కూటి కొరకే అన్న నానుడి మనందరికీ తెలుసు. దానర్థం కోటి చదువులు అని కాదు. కోటి విధాలైన నైపుణ్యం కలిగిన పనులు అని అర్థం. కానీ, మన విద్యా వ్యవస్థ పూర్తిగా వక్రమార్గంలో పయనిస్తున్నది. మన ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలలోనైనా మంచి చదువును అంది స్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు పేద విద్యా ర్థులకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరీ చదువును నేర్పిస్తున్నాయి. ఇంటర్ తర్వాత వాళ్లలో ఎక్కువమంది ఇప్పటివరకు మనం పేర్కొన్న నైపుణ్యంలేని డిగ్రీలు పుచ్చుకున్నారు. ఫలితంగా నిరుద్యోగుల జాబి తాలో చేరుతున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ప్రభుత్వాల కన్నా అధికంగా తమ పిల్లల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. తమ పిల్లలు పెద్ద చదువులు చదువుతూ మంచి ఉద్యోగం చేస్తారని ఆశించి భంగపడుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సునీల్ లాంటి యువకులు తమ ప్రాణాలను వదులుకుంటున్నారు. కారణం సునీల్∙నైపుణ్యం లేని డిగ్రీ పాస్ కావడమే. లక్షలాదిమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడు తున్నారు. ప్రైవేట్ రంగంలో కావాల్సిన నైపుణ్యాన్ని విద్యా వ్యవస్థ వారికి అందించలేకపోతున్నది. భవిష్యత్‌లో చాలా రంగాల్లో అధు నాతన పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యం కలిగిన యువకులకు మాత్రమే ఉద్యోగాలు ఉండబోతు న్నాయి. ప్రభుత్వాలు తమ పరిపాలన కోసం వేలమందిని తీసు కోవచ్చు. కానీ లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. అందుకే ఈ పరిస్థితి మారాలంటే నిరుద్యోగులుగా ఉన్న యువతకు భరోసా కల్పించి, వారికి సాంకేతికపరమైన శిక్షణను అందించాలి. వారి అభి రుచినిబట్టి ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలి. దానితోపాటు మన విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేయాలి. పారిశ్రామిక, సాంకేతిక సంస్థల, వ్యాపార వాణిజ్య రంగా లకు అవసరమైన నైపుణ్యాలను అందించే విద్యా వ్యవస్థ రావాలి. చాలా ఏళ్లుగా జర్మనీలో అమలు జరుగుతున్న విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి, మన దేశానికి అవసరమైన వారితో మనం దానిని అన్వయించుకోగలిగితే, మన దేశ నిరుద్యోగ సమస్యకు ఒక పరి ష్కారం దొరుకుతుంది. కోట్లాదిమంది నిరుద్యోగ యువకులకు భవిష్యత్‌మీద ఒక విశ్వాసం కలుగుతుంది. అటువైపుగా అందరం ఆలోచించాలి. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
ఆ కుటుంబానికి కరోనా మంచే చేసింది
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా.. లాక్డౌన్ కాలంలో బతుకుపాఠాలను నేరి్పంది. స్వశక్తిగా ఎదిగి, ఆత్మస్థైర్యంతో ఎలా బతకాలో అన్నీ నేరి్పంది. ఎవరో వస్తారు.. ఏదో సాయం చేస్తారని ఎదురు చూడకుండా స్వశక్తి స్వయం ఉపాధి మార్గాలను చూపింది. వారి నూతన ఆలోచనలు ఆ ప్రాంతానికి కొత్త కుటీర పరిశ్రమలను పరిచయం చేశాయి. తాము కూడబెట్టుకున్న డబ్బు ఇంటి వద్దనే చిన్నతరహా పరిశ్రమ ఏర్పాటు చేసుకుని మరికొన్ని కుటుంబాలకు ఉపాధి కలి్పస్తున్నారు నల్లమాడ వాసులు. నల్లమాడ/అనంతపూర్: కరోనాకు ముందు.. కరోనా తర్వాత.. ఇక నుంచి ప్రతీదీ ఇలాగే ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని నిరూపించారు నల్లమాడ వాసులు. వృథా ఖర్చులకు కళ్లెం వేయడం దగ్గర్నుంచి.. ఆర్థిక భరోసా కోసం మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవడంలాంటివన్నీ ఆచరణలో పెట్టి విజయం సాధించారు. కరోనా నిరోధానికై విధించుకున్న లాక్డౌన్ వల్ల సమస్యలు ఎదుర్కొన్నా.. ఆత్మస్థైర్యంతో జీవించే విధానాలను ఈ మహమ్మారి నేర్పిందనేది అక్షర సత్యమని నిరూపించారు. ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో ఆర్థిక ఎదుగుదలకు బాటలు వేసుకున్నారు. కరోనా వల్ల మూతపడ్డ చిరు వ్యాపారం.. నల్లమాడకు చెందిన వెంకటనారాయణ, కృష్ణవేణి దంపతులకు హరీష్‌కుమార్, సాయికిరణ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో హరీష్‌కుమార్ సీఏ (చార్టెడ్ అకౌంటెన్సీ) కోర్సు చేస్తున్నాడు. సాయికిరణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నల్లమాడ బస్టాండ్ కూడలిలో కృష్ణవేణి దంపతులు ఓ చిన్నపాటి టిఫెన్ సెంటర్ నడుపుతూ వచ్చే డబ్బుతో పిల్లలను చదివించుకుంటున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా గత ఏడాది మార్చి నుంచి హోటల్ కాస్త మూతపడింది. రోజులు.. నెలల తరబడి ఇంటి పట్టునే ఖాళీగా ఉండిపోయారు. పైసా ఆదాయం లేకపోవడంతో కుటుంబపోషణ, పిల్లల చదువులు భారమయ్యాయి. బతుకుపాఠం నేర్పిన కోవిడ్–19.. హోటల్ మూతపడి కృష్ణవేణి దంపతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడసాగారు. పిల్లల చదువుల కోసం ఏదో ఒక పని చేయాలని కృష్ణవేణి భావించింది. పలు రకాలుగా ఆలోచించించి చివరకు తమిళనాడులోని ధర్మపురిలో తమకు తెలిసినవారు డోర్ మ్యాట్లు తయారు చేస్తుండడం గుర్తుకొచ్చి, వెంటనే వారిని ఫోన్లో సంప్రదించింది. తన పరిస్థితి మొత్తం వారికి వివరించి, తాను కూడా మ్యాట్లు తయారు చేయడం నేర్చుకుంటానని, ఇందుకు సహకరించాలని అభ్యరి్థంచింది. వారు అంగీకరించడంతో వెంటనే ధర్మపురికి వెళ్లి పది రోజుల పాటు అక్కడే ఉండే మ్యాట్ల తయారీపై శిక్షణ పూర్తి చేసుకుని వచ్చింది. నల్లమాడలో కుటీర పరిశ్రమ ఏర్పాటు.. మ్యాట్ల తయారీకి అవసరమైన రెండు యంత్రాలను తమిళనాడు నుంచి తెప్పించుకున్న కృష్ణవేణి... స్థానిక కుటాలపల్లి రహదారిలో ఓ షెడ్ అద్దెకు తీసుకొని మూడు నెలల క్రితం కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసింది. ముడిసరుకు (టెంకాయ తాళ్లను)ను సైతం తమిళనాడు నుంచే దిగుమతి చేసుకొని వాటికి రంగులు అద్ది మ్యాట్లు తయారీ చేయడం మొదలు పెట్టింది. ఈ మొత్తం యూనిట్ ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.5 లక్షల వరకు ఆమె పెట్టుబడి పెట్టారు. భార్య ఆలోచనను ప్రోత్సహిస్తూ వచ్చిన భర్త వెంకటనారాయణ..ఆమె తయారు చేసిన మ్యాట్లను మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించడం మొదలు పెట్టాడు. పని భారం పెరగడంతో మరో నలుగురు మహిళలకు కృష్ణవేణి ఉపాధి కలి్పస్తూ వస్తోంది. ఒక్కొక్కరికి రోజూ రూ.200 చొప్పున కూలి చెల్లిస్తోంది. దీంతో ఉత్పత్తి మరింత పెరగడంతో వ్యాపారాన్ని పొరుగు జిల్లాలకు విస్తరింపజేశారు. జిల్లాలోని ముదిగుబ్బ, కదిరి, పుట్టపర్తి, ఓడీ చెరువుతోపాటు వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి ప్రాంతాల్లోని రిటైల్ దుకాణాలకు మాట్లను సరఫరా చేసే స్థాయికి ఎదిగారు. పేపర్ ప్లేట్ల తయారీతో ఉపాధి ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లికి చెందిన ఎస్.వన్నప్ప నల్లమాడ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వన్నప్ప కుమార్తెకు స్థానిక సచివాలయంలో ఉద్యోగం రావడంతో ఆమెకు తోడుగా ఉండేందుకు ఏడాది క్రితం కుటుంబంతో సహా ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. ఖాళీగా ఇంటిపట్టున ఉండలేక రూ.2 లక్షల పెట్టుబడితో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేసుకున్నారు. కరోనా మంచే చేసింది కరోనా మాకు మంచే చేసింది. హోటల్ మూతపడడంతో కొంత కాలం ఇబ్బందులు పడింది వాస్తవమే. ఇదే ఈ రోజు మమ్మల్ని కుటీర పరిశ్రమ నిర్వహించే స్థాయికి ఎదిగేలా చేసింది. మరో నాలుగు కుటుంబాలకు ఉపాధి కలి్పంచే స్థాయికి మమ్మల్ని ఎదిగేలా చేసిన కరోనాకు థ్యాంక్స్. టెంకాయ తాడుతో తయారు చేసే మ్యాట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. రిటైల్‌గా రూ.100కు, హోల్‌సేల్‌గా అయితే రూ.80తో విక్రయిస్తున్నా. పరిశ్రమ ఏర్పాటు చేసుకొని మూడు నెలలే అయింది కాబట్టి ఇప్పుడిప్పుడే లాభనష్టాల గురించి బేరీజు వేయలేను. – కృష్ణవేణి, నల్లమాడ -
వ్యవసాయం ఆదుకుంది
సాక్షి, హైదరాబాద్: కరోనా దేశీయ ‘జాబ్ మార్కెట్’లో గణనీయమైన మార్పులు తెచ్చింది. లాక్డౌన్లో, ఆ తర్వాత కూడా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువ ఉత్పాదకత రంగాల వైపు మళ్లినట్టు స్పష్టంగా కన్పిస్తోంది. ఉత్పత్తి, సర్వీసెస్ (సేవలు) వంటి ఎక్కువస్థాయి కార్మిక ఉత్పాదక కేంద్రాలుగా ఉన్న రంగాల నుంచి వ్యవసాయం, నిర్మాణ రంగం వంటి తక్కువ కార్మిక ఉత్పాదకత రంగాలకు ఉద్యోగ అవకాశాలు మళ్లినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తన తాజా నివేదికలో విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి రంగం ఒక మోస్తరుగానే కోలుకోవడం ఇందుకు కారణమని అంచనా వేసింది. 2020–21లో గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఔషధ తయారీ పరిశ్రమలు (ఫార్మాస్యూటికల్స్) మినహా దాదాపుగా అన్ని ప్రధాన తయారీ, ఉత్పత్తి రంగాలు గతేడాదితో పోల్చితే చాలా తక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాయి. వ్యవసాయానుకూల పరిస్థితులూ కారణం లాక్డౌన్ కాలంలో వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడం.. పరిశ్రమలు, తయారీ, విద్యా, రవాణా, పర్యాటకం వంటి వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల తగ్గుదలను స్పష్టం చేస్తోంది. ఈ పరిస్థితికి గతేడాది మంచి వానలు పడడం, వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడం కూడా కారణమని ఈ సంస్థ విశ్లేషించింది. సీఎంఐఈ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి సర్వే (కన్జ్యూమర్ పిరమిడ్స్ హౌస్‌హోల్డ్ సర్వే) ప్రకారం... గత ఏడాది జూలై, ఆగస్టు నాటికే వ్యవసాయరంగంలో ఉపాధి అవకాశాలు 16 కోట్లకు చేరుకుని సెప్టెంబర్‌లోనూ కొంచెం అటుఇటుగా కొనసాగాయి. ఇది 2019–20తో పోల్చితే 5.5 శాతం అధికం. గత డిసెంబర్లో ఈ రంగంలో ఉపాధి 15.4 కోట్లకు తగ్గినా అంతకు ముందు ఏడాదితో పోల్చితే 3.5 శాతం ఎక్కువ. మొత్తంగా చూస్తే 2020లో మొత్తం అన్ని రంగాల ఉపాధి అవకాశాల కల్పనలో వ్యవసాయ రంగం 40 శాతంతో అగ్రభాగాన నిలిచింది. ఇది 2019తో పోల్చితే 4 శాతం అధికం. విద్యారంగంపై తీవ్ర ప్రభావం కరోనా తీవ్రత అనంతర పరిస్థితుల్లో కూడా సేవల రంగం ఇంకా పూర్తిస్థాయిలో కోలుకుని నిలదొక్కుకోకపోవడంతో ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరగడం లేదు. ప్రధానంగా విద్య, అనుబంధ రంగాలపై కోవిడ్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడడంతో సేవల రంగం పూర్తిస్థాయిలో తేరుకోలేదు. 2020 మార్చిలో సేవల రంగంలో 15.7 కోట్ల మంది ఉద్యోగాల్లో ఉండగా, గత డిసెంబర్ నాటికి ఈ రంగంలో ఉద్యోగుల సంఖ్య 14.8 కోట్లకు తగ్గిపోయింది. గత నెల కల్లా సేవల రంగం బాగానే కోలుకున్నా.. విద్యారంగంలో మాత్రం ఉద్యోగాలు కోల్పోయేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం నాటికి ఒక్క విద్యారంగంలోనే 91 లక్షల ఉద్యోగాలు పోయాయి. మరోవైపు ›ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఉత్పత్తి రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 1.14 కోట్ల మేర తగ్గుదల నమోదైనట్టు సీఎంఐఈ అధ్యయనం వెల్లడించింది. ఈ రంగం కూడా క్రమంగా కోలుకుంటున్నా మొత్తం మీద ఉపాధి అవకాశాలు తగ్గినట్టు పేర్కొంది. -
‘ముందే చెప్పాను.. కానీ ఎగతాళి చేశారు’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత కొద్ది రోజులుగా నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాహుల్ గాంధీ వరస ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితుల్లో లేదంటూ గురువారం ట్వీటర్లో ఓ వీడియోను షేర్ చేశారు. ‘కరోనా కారణంగా దేశం భారీ నష్టాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని నేను ఇది వరకే హెచ్చరించాను. కానీ అప్పుడు మీడియా నన్ను ఎగతాళి చేసింది. ఈ రోజు మళ్లీ అదే చెబుతున్నా. కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వదు. ఒకవేళ మీరు దీనిని అంగీకరించకపోతే 6-7 నెలలు వేచి ఉండండి మీకే తెలుస్తుంది” అని పేర్కొన్నారు. అలాగే గడిచిన నాలుగు నెలల్లో సుమారు రెండు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన బుధవారం ట్వీట్ చేశారు.(చదవండి: ఫేస్‌బుక్‌ను బీజేపీ నియంత్రిస్తోంది: రాహుల్) ...India will not be able to provide employment to youth. Media made fun of me when I warned the country that there will be heavy loss due to #COVID19. Today I am saying our country won't be able to give jobs. If you don't agree then wait for 6-7 months: Rahul Gandhi, Congress pic.twitter.com/QlkMhrS5H2 — ANI (@ANI) August 20, 2020 ‘‘గత నాలుగు నెలల్లో సుమారు రెండు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబాల భవిష్యత్తు అంధకారంలో ఉంది. సోషల్ మీడియాల్లో నకిలీ వార్తలు వ్యాప్తి చేయడం ద్వారా నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థలోని నిజాలను దాచలేము’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేగాక జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా లబ్ధిదారుల జాబితాను విస్తరించడంపై కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. మోదీ ప్రభుత్వం ఎన్ఎఫ్ఎస్ఎ లబ్ధిదారుల జాబితాను విస్తరించాల్సి ఉందని, కాని ప్రభుత్వం అలా చేయలేదన్నారు. ప్రజల హక్కు అయిన రేషన్ వారికి అందడం లేదని ఆరోపించారు. ఈ సమస్య విషాద రూపాన్ని సంతరించుకుందంటూ ఆయన హిందీలో ట్వీట్లో చేశారు. (చదవండి: కరోనా గ్రాఫ్ భయపెడుతోంది: రాహుల్ ) -
ఉద్యోగ భద్రత ఏది?
సాక్షి, సిటీబ్యూరో: ‘ఆర్టీసీ ఉద్యోగమంటే జీవి తాంతం ప్రశాంతంగా బతుకొచ్చుననే భరోసా ఉండేది. రిటైర్మెంట్ గడువు దగ్గర పడిందంటే... అయ్యో అప్పుడే ఆర్టీసీని వదిలి వెళ్లాల్సి వస్తుందా అని ఆందోళనకు గురయ్యేవాళ్లం. కానీ ఇప్పుడు ఎప్పుడు రిటైర్మెంట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఏ రోజు ఎలాంటి వేధింపులను ఎదుర్కోవలసి వస్తుందో తెలియని అభద్రతతో పని చేయాల్సి వస్తుంది. ఆర్టీసీ కార్మికుల ‘సంక్షేమం’ ఇలా ఉంటుందనుకోలేదు....’’ ముషీరాబాద్–2 డిపోకు చెందిన ఒక సీనియర్ కండక్టర్ ఆవేదన ఇది. అధికారులు వేధింపుల కారణంగా డ్యూటీ చేయాలంటేనే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేశాడు. గ్రీవెన్స్‌సెల్ బాక్సులో వేసి ఫిర్యాదుల పరిష్కారానికి ఎలాంటి చర్యలు లేవని చెప్పాడు. కేవలం 20 కిలోమీటర్లు తక్కువ నడిపారనే కారణంతో అదే డిపోకు చెందిన 12 మంది కండక్టర్, డ్రైవర్లను ముషీరాబాద్–2 నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) డిపోకు బదిలీ చేయడంపై కార్మికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఒక్క డిపోలోనే కాదు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోల్లో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, తదితర సిబ్బందిపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. డిపోస్థాయిలో ఏర్పాటు చేసిన కార్మికుల సంక్షేమ కమిటీలు అలంకారప్రాయంగా మిగిలాయి. ఫిర్యాదుల పెట్టెలోనే ‘సంక్షేమం’.... ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించింది. 55 రోజుల సమ్మె అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి డిపో స్థాయిలో మేనేజర్, ఒక చీఫ్ ఇన్స్పెక్టర్, ఒక మెకానికల్ ఫోర్స్మెన్, మరో ఇద్దరు డ్రైవర్, కండక్టర్లతో కమిటీలను ఏర్పాటు చేశారు. డిపోల్లో పని చేసే కార్మికుల ఫిర్యాదులను స్వీకరించేందుకు గ్రీవెన్స్సెల్గా ఇది పని చేయవలసి ఉంది. డిపో కమిటీల స్థాయి వెల్ఫేర్ కమిటీల్లో పరిష్కారం కాని సమస్యలను రీజనల్ మేనేజర్ స్థాయిలో పరిష్కరిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పర్యవేక్షణ అధికారిగా వ్యవహరించవలసి ఉంది. నగరంలోని 29 డిపోల్లో వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ ఏ ఒక్క డిపోలోనూ తమ ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోవడం లేదని కండక్టర్లు, డ్రైవర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.‘‘ డబుల్ డ్యూటీలు వేస్తున్నారు. అదనపు జీతం ఇవ్వడం లేదు. సీనియారిటీని లెక్కలోకి తీసుకోవడం లేదు. డిపోమేనేజర్ను కలిసి సమస్యలు చెప్పుకొనేందుకు అవకాశంలేదు’ ఉప్పల్ డిపోకు చెందిన ఒక డ్రైవర్ విస్మయం వ్యక్తం చేశారు. బస్సులు తగ్గించి పని భారం పెంచారు... గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోలున్నాయి. గ్రేటర్లో సుమారు 1000 బస్సులను రద్దు చేశారు. వాటిలో కొన్నింటిని కార్గోలుగా మా ర్చారు. అకస్మాత్తుగా 10 వేల ట్రిప్పులకు పైగా తగ్గాయి. ఇక మిగిలిన 2500 బస్సులే ఆదాయ మార్గంగా మారాయి. దీంతో గతంలో ఉన్న 7.5 గంటల పని విధానం అటకెక్కింది. కండక్టర్లు, డ్రైవర్లపైన పని భారం పెరిగింది. ‘ఇప్పుడు రోజుకు 9 గంటలు పని చేస్తున్నాం, అయినా ఏదో ఒక రోజు ట్రాఫిక్ రద్దీ కారణంగా ఒకటి, రెండు ట్రిప్పులు రద్దయితే ఇంక్రిమెంట్లను వాయిదా వేస్తున్నారు.’ అని ముషీరాబాద్–1 డిపోకు చెందిన కండక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒక బస్సుకు రూ.4500 ఎర్నింగ్స్ టార్గెట్‌గా ఉంటే ఏదో ఒక రోజు రూ.3500 వచ్చిందంటే చాలు ఆ రోజు కండక్టర్, డ్రైవర్‌కు మూడినట్లే...’అని కంటోన్మెంట్ డిపోకు చెందిన డ్రైవర్ ఒకరు తెలిపారు. కేఎంపీఎల్ తగ్గినా డ్రైవర్లపైన వేధింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు... బస్సుల సంఖ్యను తగ్గించి, ట్రిప్పులు కుదించి సిబ్బందిపై ఒత్తిడిని తీవ్రతరం చేసినప్పటికీ నగరంలో ప్రయాణికులకు సరైన రవాణా సదుపాయాన్ని అందజేయడంలో ఆర్టీసీ దారుణంగా విఫలమవుతోంది. నగర శివార్లకు, కాలనీలకు బస్సులు భారీగా తగ్గాయి. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు అనేక ప్రాంతాల నుంచి రైళ్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లకు చేరుకుంటాయి. కానీ ఆ సమయంలో సిటీ బస్సులు డిమాండ్‌కు తగిన విధంగా అందుబాటులో ఉండడం లేదు. ఉదయం 6.30 తరువాత మాత్రమే బస్సులు డిపో నుంచి బయటకు వస్తున్నాయి. దీంతో ప్రయాణికులు క్యాబ్‌లు, ఆటోలను, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. -
గల్ఫ్ నుంచి వచ్చి.. కులవృత్తిలో రాణించి..
వూశకొయ్యల గంగాకిషన్, నవీపేట (నిజామాబాద్ జిల్లా): గల్ఫ్ దేశాలలో సంపాదన బాగుంటుందని తలచిన ఆ యువకుడు ఉపాధి కోసం దుబాయికి వెళ్లాడు. కానీ, విజిట్ వీసాపై వెళ్లడంతో ఆశలు ఆవిరయ్యాయి. యేడాదిలోపే అక్కడి పోలీసులు స్వగ్రామానికి పంపించేశారు. అయితే, అప్పుల బాధలు అతడిని మళ్లీ గల్ఫ్ వైపు మళ్లించాయి. రెండోసారి ఖతార్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి సౌదీ అరేబియాకు బదిలీపై వెళ్లి స్థిరపడుతున్న సమయంలోనే కంపెనీ మూతపడింది. దీంతో గల్ఫ్‌పై మక్కువ చంపుకుని స్వగ్రామంలోనే ఉపాధి పొందాలనుకున్నాడు. కులవృత్తి అయిన వడ్రంగి పనిలో మెళకువలను నేర్చుకుని గల్ఫ్‌లో సంపాదించే డబ్బులకు సమానంగా ప్రస్తుతం ఇక్కడే సంపాదిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని నాగేపూర్ గ్రామానికి చెందిన గన్నోజి రాజన్న, సక్కుబాయిల రెండో కుమారుడు రమేష్ పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఉన్నత చదువులు చదవాలని తలంచినా.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు చదువుకు దూరం చేశాయి. తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని తలచి 2006లో దుబాయికి వెళ్లాడు. అందరూ విజిట్ వీసాపై వెళ్లి పనులు చేయడంతో ఆకర్షితుడైన రమేష్ అక్కడికి వెళ్లాడు. అక్కడిక్కడ కూలీ పనులు చేస్తున్న రమేష్‌ను పోలీసులు పట్టుకుని 2007లో ఇండియాకు పంపించేశారు. ఆశగా వెళ్లి ఆవేదనతో వచ్చిన రమేష్‌కు గ్రామానికి రాగానే మళ్లీ అప్పుల బాధలు వెంటాడాయి. 2009లో జేఅండ్‌పీ కంపెనీ వీసాపై ఖతార్‌కు వెళ్లాడు. వడ్రంగి వృత్తిలో ప్రావీణ్యుడైన రమేష్ ఫర్నిచర్ తయారీ ఉద్యోగంలో స్థిర పడ్డాడు. 2011లో అదే కంపెనీకి చెందిన సౌదీ అరేబియా బ్రాంచ్‌కు బదిలీపై వెళ్లాడు. 2015లో ఫోర్‌మెన్‌గా ఉద్యోగోన్నతి కల్పించడంతో ఆనందంగా గడిపాడు. నాలుగుపైసలు సంపాదిస్తున్నానన్న ఆనందంలో ఉండగా.. పిడుగులాంటి వార్త వినబడింది. కంపెనీ దివాలా తీసిందని 2018లో మూసివేశారు. ఆరు నెలల జీతం..ఏడు నెలల సర్వీస్ డబ్బులు ఇవ్వకుండానే రమేష్‌ను కంపెనీ యాజమాన్యం ఇంటికి పంపించింది. మనోధైర్యంతో.. రమేష్ ఉద్యోగం కోల్పోయి ఇంటికి చేరిన సమయంలో ఆయనకు ఇద్దరు పిల్లలు. ఆ దశలో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అని అతను కుంగిపోలేదు. వడ్రంగి వృత్తిలో మరింతగా రాణించి సొంతూళ్లోనే ఉపాధి పొందాలని సంకల్పించాడు. ఫర్నిచర్ తయారీలో మరిన్ని మెళకువలు నేర్చుకున్నాడు. దుబాయి, ఖతార్, సౌదీలలో ఫర్నిచర్ పనిచేయడంతో పలు రకాల వస్తువులను తయారు చేయడం సులువుగా నేర్చుకున్నాడు. రూ. లక్షన్నర అప్పు చేసి ఫర్నిచర్ తయారీకి ఉపయోగపడే యంత్రాలను, సామగ్రిని సమకూర్చుకున్నాడు. గృహాలకు అవసరమయ్యే ఫర్నిచర్‌ను తయారు చేస్తూ.. గల్ఫ్‌లో నెలకు సంపాదించే డబ్బులను సొంతూళ్లోనే సంపాదిస్తున్నాడు. స్వగ్రామమే బెటర్: రమేష్ కష్టపడే గుణముంటే ప్రతి ఒక్కరికీ సొంతూరే ఒక గల్ఫ్ దేశం అవుతుంది. అమ్మా, నాన్న, భార్యాపిల్లలకు దగ్గరగా ఉంటూ ఉపాధి పొందడం ఆనందంగా ఉంది. అక్కడ సంపాదించే డబ్బులను ఇక్కడే సంపాదిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. గల్ఫ్ దేశాలపై మోజు తగ్గించుకుని ఇక్కడే పనులు చేసుకుంటే అందరూ హాయిగా ఉంటారు. -
పెరగనున్న ఉపాధి, ఉద్యోగావకాశాలు
‘వైఎస్సార్ నవోదయం’తో జిల్లాలోని అనేక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ( ఎంఎంఎస్ఈ) ఊపిరి పోసుకోనున్నాయి. కంపెనీలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు రుణాల రీ షెడ్యూల్‌కు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో పలు కంపెనీలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతోంది. ఇప్పటికే పలు సిమెంట్ కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించగా, రాంకో కంపెనీ పనులు వేగంగా జరుగుతున్నాయి. అల్ట్రాటెక్, ప్రిజమ్ కంపెనీలు వస్తుండటంతో భారీగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. సాక్షి, కర్నూలు(అర్బన్): జిల్లాలో మరో రెండు సిమెంట్ కంపెనీలు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ, ప్రియా, జయజ్యోతి సిమెంట్ కంపెనీలు తమ ఉత్పత్తులను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామం సమీపంలో ఇప్పటికే రూ.1,500 కోట్ల పెట్టుబడితో రాంకో సిమెంట్ కంపెనీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ కంపెనీ ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2018 డిసెంబర్లో ఈ కంపెనీ పనులకు శంకుస్థాపన చేసినా, ఈ ఏడాది జూన్ నుంచే పనులు ఊపందుకున్నాయి. 2020 మార్చి, ఏప్రిల్ నాటికి పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే మరో రెండు సిమెంట్ కంపెనీలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రూ.2వేల కోట్లతో దాదాపు 1850 మందికి ఉపాధి కల్పించే దిశగా అల్ట్రాటెక్, రూ.4వేల కోట్ల పెట్టుబడితో ప్రిజమ్ కంపెనీలు సన్నాహాలు ప్రారంభించనట్లు సమాచారం. ప్రిజమ్ ద్వారా దాదాపు 3 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ మూడు సిమెంట్ కంపెనీలు జిల్లాలో ఉత్పత్తి ప్రారంభిస్తే వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వైఎస్సార్ నవోదయంతో ఎంఎస్ఎంఈలకు ఊపిరి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ నవోదయం’ కార్యక్రమంతో జిల్లాలోని అనేక సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎంఎస్ఈ ) ఊపిరి పోసుకోనున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు రూ.10 లక్షల పెట్టుబడితో 6,017 ఎంఎస్ఎంఈలు ఉండగా, వీటిలో 2,628 రీస్ట్రక్చరయ్యాయి. అలాగే రూ.10 లక్షలకు పైగా పెట్టుబడితో 201 ఎంఎస్‌ఎఈలుండగా, ఇందులో 20 మాత్రమే రీస్ట్రక్చరయ్యాయి. ఆయా ఎంఎస్ఎంఈలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున పలు ఎంఎస్ఎంఈలకు ఆర్థిక వెసులుబాటు కలగనుంది. ఆర్థిక వెసులుబాటు కలిగితే తిరిగి ఆయా ఎంఎస్ఎంఈలు పునర్జీవం పొందడమే గాక, ఉత్పత్తులు ప్రారంభించే అవకాశాలున్నాయి. దీంతో కార్మికులకు ఉపాధితో పాటు ఉత్పత్తుల మార్కెటింగ్ వల్ల మరి కొన్ని రంగాలకు లబ్ధి చేకూరే అవకాశముంది. కొత్త సిమెంట్ పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయి జిల్లాకు కొత్తగా రెండు సిమెంట్ పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయి. అల్ట్రాటెక్, ప్రిజమ్ కంపెనీల ప్రతినిధులు ఇటీవల సీఎంను కలిశారు. రాంకో సిమెంట్ పరిశ్రమ ప్రారంభమైతే చాలా మందికి ఉపాధి లభిస్తుంది. వైఎస్సార్ నవోదయం పథకం ద్వారా జిల్లాలో అనేక ఎంఎస్ఎంఈలు పునర్జీవం పొందనున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ విధానం అందుబాటులో ఉంది. ఔత్సాహికులు సింగిల్ డెస్క్ విధానంలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు, అనుమతులు పొందొచ్చు. – జీ సోమశేఖర్‌రెడ్డి, డీఐసీ జీఎం