Nitish Kumar Big Announcement On Jobs And Employment In Bihar - Sakshi
Sakshi News home page

Nitish Kumar: బీహారీలకు ‘బిగ్‌’ న్యూస్‌ చెప్పిన సీఎం నితీష్‌

Published Mon, Aug 15 2022 1:47 PM | Last Updated on Mon, Aug 15 2022 2:45 PM

Nitish Kumar Big Announcement On Jobs And Employment In Bihar - Sakshi

Nitish Kumar Announcement.. బీహార్‌లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత నితీష్‌ కుమార్‌.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం నితీష్‌ కుమార్‌.. బీహార్‌ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. 

తమ సంకీర్ణ ప్రభుత్వ హామీల మేరకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా మరో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పన కోసం తాము పెద్ద ఎత్తున కృషి చేస్తామని  వెల్లడించారు. కాగా, సీఎం నితీష్‌ వ్యాఖ్యల మేరకు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ హర్షం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉండగా.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్జేడీ కనుక అధికారంలోకి వస్తే.. 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తేజస్వీ యాదవ్‌ హామీ ఇచ్చారు. కానీ, ఆర్జేడీ మాత్రం అధికారంలోకి రాలేదు. ఇక, తాజాగా జేడీయూతో కలిసి ఆర్జేడీ అధికారంలోకి రావడంతో అప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చేలా సీఎం నితీష్‌.. నేడు ఇలా గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. 

ఇది కూడా చదవండి: మీ రాజకీయాల కోసం.. చరిత్రను వక్రీకరించకండి: సోనియా ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement