
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలతో కలిసి పని చేస్తామని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) దక్షిణ ప్రాంత చైర్‌పర్సన్ సుచిత్ర ఎల్లా తెలిపారు.
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ద్విముఖ వ్యూహాన్ని రూపొందించామని బుధవారమిక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆమె చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలను ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా ప్రమోట్ చేయడంతోపాటు, వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం ఇప్పటికే ఉన్న పరిశ్రమలతో కలిసి పనిచేస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment