త‍్వరలో లక్షా 12 వేల ఉద్యోగాలు 100 శాతం భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సోమవారం ఉదయం శాసనసభలో అంబేద్కర్ ఓవర్‌సీస్ పథకం, గ్రూప్-2 పై అడిగిన ప్రశ్నలపై సీఎం మాట్లాడారు. అంబేద్కర్ ఓవర్‌సీస్ పథకానికి పరిమితి లేదన్నారు. అర్హులందరికీ ఈ పథకం వర్తింప చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.