ఉద్యోగ సమాచారం.. | Employment news of the day | Sakshi
Sakshi News home page

ఉద్యోగ సమాచారం..

Published Thu, Feb 11 2016 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

ఉద్యోగ సమాచారం..

ఉద్యోగ సమాచారం..

ఐఐసీటీలో 34 పోస్టులు
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్ అనుబంధ సంస్థ ఇండియన్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ).. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో జూనియర్ రీసెర్‌‌చ ఫెలో, ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 34. ఇంటర్వ్యూ తేది ఫిబ్రవరి 15, 16. వివరాలకు www.iictindia.org చూడొచ్చు.
 
ఏపీహెచ్‌ఎంఈఎల్‌లో 20 పోస్టులు
కొండపల్లిలోని (విజయవాడ) ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఏపీహెచ్‌ఎంఈఎల్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో జూనియర్ కాంట్రాక్ట్ ఇంజనీర్, అసిస్టెంట్ కాంట్రాక్ట్ ప్రోగ్రామర్, కాంట్రాక్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 20. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 29. వివరాలకు www.aphmel.comచూడొచ్చు.
     
     ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో వివిధ పోస్టులు
 ఐసీఏఆర్ అనుబంధ సంస్థ సెంట్రల్ సాయిల్ సాలినిటీ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రీసెర్‌‌చ ఫెలో, రీసెర్‌‌చ అసో సియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 13. ఇంటర్వ్యూ తేదీలు ఫిబ్రవరి 22, 23. వివరాలకు www.cssri.org చూడొచ్చు.
 
 సీఎస్‌ఐఆర్ అనుబంధ సంస్థలో...
 హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్ అనుబంధ సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ).. వికలాంగుల కోటాలో వివిధ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 7. దరఖాస్తుకు చివరి తేది మార్చి 1. వివరాలకు www.iictindia.org చూడొచ్చు.
 
హెచ్‌ఈసీలో మిడిల్ లెవల్ ఆఫీసర్ పోస్టులు
 హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 6. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 29. వివరాలకు www.hecltచూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement