ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో సారి వందల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జులై నెలలో పునర్వ్యవస్ధీకరణ పేరుతో 1800 మంది ఉద్యోగులను తొలగించగా..తాజా లే ఆఫ్స్ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది.
మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఓ సీనియర్ డిజైనర్ ఉద్యోగుల తొలగింపుపై లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేశారు. ఈ వారంలో ముఖ్యంగా మోడ్రన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ టీం (ఎంఎల్‌ఎక్స్) ఉద్యోగుల్ని ఫైర్ చేయనుందని ఓ బాంబు పేల్చారు. సీనియర్ డిజైనర్‌తో పాటు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం ప్రతినిధులు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎంఎల్‌ఎక్స్ టీం తో పాటు ప్రపంచంలోని మైక్రోసాఫ్ట్ కు చెందిన లోకేషన్‌లలో విధులు నిర్వహించే హెచ్ ఆర్ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ సభ్యుల్ని తొలగించే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది.
2018లో
2018లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఉత్పత్తుల్ని వినియోగించుకునే కస్టమర్లు..మళ్లీ తిరిగి వాటిని ఉపయోగించేలా మోడ్రన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ టీం (ఎంఎల్‌ఎక్స్) విభాగాన్ని ఏర్పాటు చేసింది. తొలిసారి ఈ ఎంఎల్‌ఎక్స్ సభ్యులు ఎఫెక్టీవ్ వేలో హెల్దీ ఆన్ లైన్ హ్యాబిట్స్‌తో వినియోగదారులు వారి రోజూవారీ కార్యకలాపాల్ని చక్కదిద్దే లక్ష్యంతో ఎక్స్ బాక్స్ తరహా ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్‌ను డెవలప్ చేశారు.
జూన్ 2020లో మనీ ఇన్ ఎక్స్‌ఎల్ అనే టెంప్లెట్‌ను మార్కెట్‌కు పరిచయం చేశారు. ఈ మనీ ఎక్స్ అనే టెంప్లెట్ సాయంతో వినియోగదారులు మైక్రోసాఫ్ట్ ఎక్స్ ఎల్ నుంచి డైరెక్ట్‌గా వారి బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ అకౌంట్‌లలో ఎంటర్ అవ్వొచ్చు. పెట్టుబడులు సైతం పెట్టుకోవచ్చు. కాగా, ఈ మనీ ఇన్ ఎక్సెఎల్ అనే టెంప్లెట్ వచ్చే ఏడాది జూన్ 30న షట్ డౌన్ చేయనుంది.
ఉద్యోగుల తొలగింపు సాధారణమే
ఆర్ధిక మాంద్యంతో ఇక టిక్‌టాక్, ట్విట్టర్, నెట్‌ఫ్లిక్స్ ఇతర సంస్థలు ఉద్యోగుల్ని తొలగించాయి. ఆ సమయంలో ఉద్యోగుల తొలగించడం సాధారణమని మైక్రోసాఫ్ట్ చెప్పుకొచ్చింది. కంపెనీకి చెందిన 1.8 లక్షల మంది ఉద్యోగుల్లో కేవలం 1 శాతం లోపు ఉద్యోగులనే తొలగించామని తెలిపింది.
చదవండి👉వేలమంది ఉద్యోగులపై వేటు,టెక్కీలకు గడ్డుకాలం..వరస్ట్ ఇయర్‌గా 2022
Comments
Please login to add a commentAdd a comment