ఆర్ధిక మాంద్యం దెబ్బకు ప్రపంచ దేశాల్లోని ఆయా కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తొలగింపులపై ముందస్తు సమాచారం ఇస్తున్నాయి. కానీ కొన్ని సంస్థల లేఆఫ్స్ తీరుపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు పింక్ స్లిప్‌లను మెయిల్స్, మెసేజ్‌ల ద్వారా తెలుపుతాయి. కానీ ఈ సంస్థ అందుకు భిన్నంగా వ్యవహరించింది. కడుపు నిండా తిండి పెట్టి, తాగినోళ్లకు తాగినంత మందు పోసి చావు కబురు చల్లగా చెప్పింది
అమెరికాలోని అరిజోనా కేంద్రంగా బిషప్ ఫాక్స్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే ఇటీవల అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లతో ప్రాజెక్ట్‌లు లేక.. సంస్థలో ఆర్ధిక అనిశ్చితి నెలకొంది. దీంతో ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. బిషప్ ఫాక్స్‌లో మొత్తం 400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
వారందరికి ఖరీదైన హోటల్‌లో పార్టీ ఇచ్చింది. కంపెనీ ఇచ్చిన పార్టీకి ఉద్యోగులు హాజరయ్యారు. కడుపు నిండా తిండి పెట్టి, తాగినోళ్లకు తాగినంత సైబర్ సూప్ పేరుతో కంపెనీ ఖరీదైన మద్యం సరఫరా చేసింది. పార్టీ అయిపోయింది. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. తెల్లారేసరికి లేఆఫ్ అంటూ చావు కబురు చల్లగా చెప్పడంతో షాక్ తిన్నారు. ముందురోజు రాత్రి పార్టీని బాగా ఎంజాయ్ చేసిన ఉద్యోగులు తెల్లారి కంపెనీ ప్రకటన విని ఊహించలేకపోయామంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి👉దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు!
Comments
Please login to add a commentAdd a comment