గోల్కొండ (హైదరాబాద్): మాయమాటలతో పశ్చిమబెంగాల్ రాష్ట్రం చి నగరానికి యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. గోల్కొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన దంపతులు చందు, చంద్రకళ నగరంలోని షేక్‌పేట్ ఓయూ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు.
తేలిగ్గా డబ్బులు సంపాదించాలనే ఆలోచనలో భాగంగా తమ స్వరాష్ట్రంలోని హోటళ్లు, పబ్‌లలో పని చేసే యువతులను హైదరాబాద్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రప్పించేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారితో బలవంతంగా వ్యభిచారం చేయించేవారు. కాగా, బుధవారం వీరి ఇంటి నుంచి పెద్దగా కేకలు వినిపించడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. పోలీసులను చూసి మిగిలిన వారు పారిపోగా, చంద్రకళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి(22)ని పోలీసులు విచారించారు. తనతో వ్యభిచారం చేయిస్తున్నారని బాధిత యువతి చెప్పడంతో చంద్రకళను రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చి వ్యభిచారం
Published Wed, May 18 2016 10:12 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement