సాక్షి, నల్లగొండ: పొట్టకూటి కోసం ఉపాధిహామీ పనులకు వెళితే పస్తులుండాల్సిన పరిస్థితి నెల కొంది. రెక్కాడితేగాని డొంక నిండని కూలీ లకు ప్రభుత్వం రెండు నెలలుగా చిల్లి గవ్వా కూడా చెల్లించకపోవడంతో తల్లడిల్లిపోతున్నారు. జిల్లాలోని 59 మండలాల పరిధిలో 10.40 లక్షల మంది కూలీలు ఉపాధిహామీ పథకంలో నమోదై ఉన్నారు. ఇందులో దాదాపు 8.30 లక్షల మంది పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతుండడంతో రోజుకు సరాసరి 1.50 లక్షల మంది ఉపాధి పనులు చేస్తున్నారు. ప్రతి కూలీకి ఏడాదిలో 100 రోజుల పని కల్పించాలి. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోంది. చేసిన పనులను బట్టి రోజుకు గరిష్టంగా *149 చెల్లిస్తారు. ఇందుకు అవసరమైన నిధులు ప్రతి త్రైమాసికానికి ముందుగానే విడుదల చేస్తుంది.
నిధులు విడుదల చేయని ప్రభుత్వం
ఉపాధి హామీ చట్టం ప్రకారం పనులు చేసిన 15 రోజుల్లోగా కూలీలకు వేతనం అందజేయాలి. కానీ రెండు నెలలుగా జిల్లాలో దాదాపు 1.50 లక్షల మందికి కూలి అందలేదు. సుమా రు *9కోట్ల మేర పనులు జరగగా జూలై ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. ఫలితంగా ఉపాధి పనినే నమ్ముకున్న కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత్యతరం లేక అప్పు చేసి పూట గడుపుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
వారంలో విడుదల?
ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి సంబంధిం చిన నిధులను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. రెండో త్రైమాసికానికి జూలై మొదటి వారంలోనే విడుదల కావాల్సి ఉంది.నేడో రేపో నిధులు విడుదల చేయకపోతారా అని డ్వామా అధికారులు కూలీల బిల్లులు చేసి పోస్టాఫీసులకు పంపించారు. ఇలా చూస్తుండగానే రెండు నెలలు గడిచిపోతున్నాయి. అయినాప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పోస్టాఫీసుల్లో బిల్లులు పేరుకుపోయాయి. నిధుల విడుదలకు మరో వారం రోజులు పట్టే అవకా శం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నిధుల విడుదల కోసం కూలీలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
అందని ‘ఉపాధి’ కూలి
Published Tue, Aug 27 2013 6:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement