
ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న మహిళలు
డాబాగార్డెన్స్(విశాఖదక్షిణ): కష్టపడి పనిచేస్తామంటే పని దొరకదు. ఒకవేళ పని దొరికిందంటే..కూలీ డబ్బులకు తిప్పుతుంటారు. ఇదిలా ఉంటే..కొందరు మహిళలకు ఇంట్లో ఊసు పట్టడం లేదు. ఇలాంటి వారందరికీ ఎన్నికలు బాగా కలిసొచ్చాయి. ఎన్నికల పుణ్యమా అంటూ పనులు దొరుకుతున్నాయి. ఇంట్లో ఊసుపట్టలేని వారందరికీ బోలెడన్ని ఊసులు తెలుస్తున్నాయి.
అయితే ఇవన్నీ ఊరకనే కాదండీ..ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు పార్ట్ టైమ్ ఉద్యోగాల తరహాలో ప్రచార పనులు దొరుకుతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఎన్నికల ప్రచారంలో తిరిగితే రూ.150 నుంచి రూ.200 (రాజకీయ పార్టీల సామర్థ్యాల బట్టి)ల వరకు, సాయంత్రం వేళల్లో వాతావరణం చల్లబడుతున్న దృష్ట్యా 4 నుంచి 8 గంటల వరకు ఎన్నికల ప్రచారంలో తిరిగితే రూ.120 నుంచి రూ.150 వరకు డబ్బులు దొరుకుతున్నాయి. ఇవీ కూడా స్పాట్ పేమెంట్లే.
Comments
Please login to add a commentAdd a comment