అఫ్ఘనిస్తాన్‌లో నాటో, అమెరికా దళాలకు సేవలు అందించి, తాలిబన్ల రాకతో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన భారతీయుల సంక్షేమాన్ని అమెరికా పట్టించుకోవాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అఫ్గన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన భారతీయ కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ అమెరికా, నాటో దేశాలకు ప్రవాసి మిత్రా లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల లేఖ రాశారు.
సైనిక శిబిరాల్లో పనిచేసిన కొన్ని వేల మంది అఫ్ఘన్లను యుఎస్‌కు తీసుకుని వెళ్లారని ప్రవాసి మిత్ర పేర్కొంది. అదే ప్రయోజనాన్ని భారతీయ కార్మికులకు కూడా అందించాలని ‘ప్రవాసి’ కోరింది. ఈ మేరకు నాటో శిబిరాలలో సేవలందించి ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ నుండి తిరిగి వచ్చిన భారతీయ కార్మికులందరి వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు.
చదవండి: Helpline Numbers To Afghans: హెల్ప్‌లైన్ నంబర్లు ప్రకటించిన భారత ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment