
మాట్లాడుతున్నఎమ్మెల్యే బాలకృష్ణ
హిందూపురం అర్బన్: డిగ్రీలు చేతపట్టి పొట్టకూటి కోసం కాళ్లరిగేలా ఉద్యోగాల కోసం తిరుగుతున్న నేటి యువతరానికి ఉద్యోగ కల్పనే తమ ధ్యేయమని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్‌డీజిఎస్ కళాశాలలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాజాబ్‌మేళాను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దేశం మాకు ఏం ఇచ్చిందని అడిగే ముందు దేశానికి తామేమి చేశామని యువత ప్రశ్నించుకోవాలన్నారు. విదేశాల్లో సైతం అన్నిరంగాల్లో రాణిస్తున్న తెలుగువారిని స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలన్నారు. అలాగే ఏపీఎస్‌ఎస్‌డీసీ సీఇవో సాంబశివరావు మాట్లాడుతూ జాబ్‌మేళాలో 80 కంపెనీలు, ఐదు ప్లేస్‌మెంట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని, రెండురోజుల పాటు ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.