సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత కొద్ది రోజులుగా నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాహుల్ గాంధీ వరస ట్వీట్‌లు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితుల్లో లేదంటూ గురువారం ట్వీటర్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.
‘కరోనా కారణంగా దేశం భారీ నష్టాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని నేను ఇది వరకే హెచ్చరించాను. కానీ అప్పుడు మీడియా నన్ను ఎగతాళి చేసింది. ఈ రోజు మళ్లీ అదే చెబుతున్నా. కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వదు. ఒకవేళ మీరు దీనిని అంగీకరించకపోతే 6-7 నెలలు వేచి ఉండండి మీకే తెలుస్తుంది” అని పేర్కొన్నారు. అలాగే గడిచిన నాలుగు నెలల్లో సుమారు రెండు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన బుధవారం ట్వీట్ చేశారు.(చదవండి: ఫేస్‌బుక్‌ను బీజేపీ నియంత్రిస్తోంది: రాహుల్)
...India will not be able to provide employment to youth. Media made fun of me when I warned the country that there will be heavy loss due to #COVID19. Today I am saying our country won't be able to give jobs. If you don't agree then wait for 6-7 months: Rahul Gandhi, Congress pic.twitter.com/QlkMhrS5H2
— ANI (@ANI) August 20, 2020
‘‘గత నాలుగు నెలల్లో సుమారు రెండు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబాల భవిష్యత్తు అంధకారంలో ఉంది. సోషల్ మీడియాల్లో నకిలీ వార్తలు వ్యాప్తి చేయడం ద్వారా నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థలోని నిజాలను దాచలేము’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేగాక జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా లబ్ధిదారుల జాబితాను విస్తరించడంపై కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. మోదీ ప్రభుత్వం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ లబ్ధిదారుల జాబితాను విస్తరించాల్సి ఉందని, కాని ప్రభుత్వం అలా చేయలేదన్నారు. ప్రజల హక్కు అయిన రేషన్ వారికి అందడం లేదని ఆరోపించారు. ఈ సమస్య విషాద రూపాన్ని సంతరించుకుందంటూ ఆయన హిందీలో ట్వీట్‌లో చేశారు.
(చదవండి: కరోనా గ్రాఫ్ భయపెడుతోంది: రాహుల్ )
Comments
Please login to add a commentAdd a comment