హైదరాబాద్: మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుంది. దీని అనంతరం బడ్జెట్పై సుధీర్ఘ చర్చ జరగనుంది. నాలుగు రోజులపాటు బడ్జెట్పై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సోమవారం ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ శాసనసభలో 2016-17 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొత్తం రూ.1,30,415 కోట్లతో బడ్జెట్ ప్రకటించారు. ఇందులో ప్రణాళికా వ్యయం రూ.67,630 కోట్లుకాగా, ప్రణాళికేతర వ్యయం 62,785.14 కోట్లుగా ఉంది. వీటిల్లో సాగునీరు, ఆతర్వాత సంక్షేమ రంగానికే అధిక వాటాదక్కింది.
తెలంగాణ బడ్జెట్పై కాసేపట్లో వాడి వేడి
Published Wed, Mar 16 2016 9:58 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
Advertisement