నవ్వులు పూయించిన జానారెడ్డి | janareddy makes smile in telangana assembly | Sakshi
Sakshi News home page

నవ్వులు పూయించిన జానారెడ్డి

Published Wed, Mar 16 2016 1:16 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

నవ్వులు పూయించిన జానారెడ్డి - Sakshi

నవ్వులు పూయించిన జానారెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి తెలంగాణ అసెంబ్లీలో నవ్వులు పూయించారు. బడ్జెట్ అంటేనే సాధారణంగా గందరగోళ అంశమని, అలాంటి బడ్జెట్ లెక్కలను చేతులకు ఇచ్చి మంత్రి ఈటల రాజేందర్ మరింత గందరగోళంలో పడేశారని అన్నారు. ఈ లెక్కలు చాలా జాగ్రత్తగా ఎమ్మెల్యేలు చదువుకోవాలని చెప్పారు. దీంతో అందరూ నవ్వారు. 'సభలో చాలామంది సభ్యులు లేరు. మంత్రులు ఎవరు లేరు. మండలికి పోయినరా' అని చక్కగా తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ సభలో నవ్వులు విరభూయించారు.

తాను ఎంతమేరకు అంచనా వేసి చెప్పానో అంతమేరకే ఈటల బడ్జెట్ కేటాయింపు చేశారని అన్నారు. మిషన్ కాకతీయ నిధుల విషయంలో కూడా అదే జరిగిందని తెలిపారు. తాను పారదర్శకంగా ఉంటానని, అలాంటి పాలనను అందించాలని కోరుకుంటానని జానా అన్నారు. తాను సక్రమంగా లేకుంటే అధికార పక్షం చెప్తే సరవుతానని, లేదంటే అధికార పార్టీ సరవ్వాలని చెప్పారు. ఈటల బడ్జెట్పై చిన్న కవిత లాంటిది కూడా జానా చదివారు. బడ్జెట్ అంకెలతో ఆటపట్టించారని, లెక్కలతో గారడీ చేశారని, ప్రజలను భ్రమింపజేయడానికి ప్రయత్నించారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement