సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో మంగళవారం ఉదయం కాంగ్రెస్ వాయిదా తీర్మానంపై చర్చించాలని జానారెడ్డి చేసిన డిమాండ్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. కొంతమంది కాంగ్రెస్ సభ్యులు.. సీనియర్ సభ్యుడైన జానారెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఓవైసీ పేర్కొన్నారు. జానారెడ్డి వాకౌట్ చేస్తే మిగతా కాంగ్రెస్ సభ్యులు సభలో ఉంటున్నారని చెప్పారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.
కాంగ్రెస్, టీడీపీ హయాంలో కొశ్చన్ అవర్ తర్వాతే వాయిదా తీర్మానాలను ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రులు చెప్పిన విషయాన్ని ఓవైసీ గుర్తు చేశారు. వాయిదా తీర్మానాలు పెట్టేందుకు ఓ పద్ధతి ఉంటుందన్నారు. వాయిదా తీర్మానాలపై కాంగ్రెస్, బీజేపీ వైఖరి సరికాదన్నారు. ఈ మూడున్నరేండ్లలో ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానంపై చర్చించాలని కాంగ్రెస్ ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా డిమాండ్ చేయడమేంటని ఓవైసీ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment