హైదరాబాద్ : గల్ఫ్ దేశాల్లో తెలుగువారి వెతలపై శుక్రవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని శాసనసభ్యులు శ్రీనివాసులు, గొల్లపల్లి సూర్యారావు కోరారు.
హైదరాబాద్ : గల్ఫ్ దేశాల్లో తెలుగువారి వెతలపై శుక్రవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన తెలుగువారు అనేక కష్టాలు పడుతున్నారని, శాసనసభ్యులు శ్రీనివాసులు, గొల్లపల్లి సూర్యారావు ...ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
దీనిపై ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమాధానమిస్తూ గల్ఫ్ దేశాల నుంచి 161మందిని వారివారి స్వస్థలాలకు తరలించామన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లినవారిలో ఎక్కువ శాతం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వారే అధికంగా ఉన్నారన్నారు. తాపీ పని, డ్రైవర్లు, పని మనుషులుగా వెళ్లినవారు అధికమని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాయంతో అక్కడ ఉన్నవారిని పైసా ఖర్చు లేకుండా రాష్ట్రానికి తరలించినట్లు చెప్పారు.