మండలానికి ఒక్క స్కూలే ఉంటే ఎలా? | ys jagan mohan reddy questions ganta srinivasarao about government schools | Sakshi
Sakshi News home page

మండలానికి ఒక్క స్కూలే ఉంటే ఎలా?

Published Fri, Mar 27 2015 11:14 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

మండలానికి ఒక్క స్కూలే ఉంటే ఎలా? - Sakshi

మండలానికి ఒక్క స్కూలే ఉంటే ఎలా?

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో క్లస్టర్ స్కూళ్ల ఏర్పాటుతో ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.  అసెంబ్లీలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ స్కూళ్ల అంశంపై చర్చ జరిగింది. మండలానికి ఒక్క స్కూలే ఉంటే ఎలా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. పిల్లలకు స్కూల్ దగ్గరగా ఉంటేనే మంచిదని, ఒక కిలోమీటర్లోపే పాఠశాల ఉంటే బాగుంటుందన్నారు. స్కూల్ దూరంగా ఉంటే డ్రాప్ అవుట్స్ ఉంటాయని, పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానం ఇస్తూ పిల్లలకు ఇబ్బంది లేకుండా, వారి విద్యకు ఆటంకం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement