రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు అంశాలపై అధికార పక్షాన్ని శుక్రవారం ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు.
హైదరాబాద్ : రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు అంశాలపై అధికార పక్షాన్ని శుక్రవారం ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రైతుల సమస్యలతో పాటు వారిపై అక్రమ కేసులు బనాయించి, వేధిస్తున్నారంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు.
వైఎస్ఆర్ సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానమిచ్చారు. రైతులపై అక్రమంగా కేసులు బనాయించలేదని, అక్రమాలు జరిగాయనే ఆరోపణలతోనే విచారణ జరుపుతున్నారని, ఒకవేళ అక్రమమని తేలితే రైతులపై కేసులు తీసివేయటం జరుగుతుందన్నారు.