హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమైనాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు సమయం కొనసాగుతోంది. బడ్జెట్పై ఈరోజు కూడా పలువురు సభ్యులు ప్రసంగించనున్నారు. ఇప్పటికే వివిధ అంశాలపై తెలంగాణ అసెంబ్లీలో పలు రాజకీయ పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.
వేతన సవరణ బకాయిలు బాండ్ల రూపంలో ఇవ్వడంపై బీజేపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ వాయిదా తీర్మానం ఇచ్చింది. అలాగే వీఆర్ఏల వేతనాల అంశంపై సీపీఎం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.